వరంగల్లో సీఐపై పొక్సో కేసు నమోదు చేశారు కాకతీయ యూనివర్సిటీ పోలీసులు. కాకతీయ యూనివర్సిటీ పోలీస్టెషన్ లో గతంలో ఎస్సై గా పనిచేసి బండారి సంపత్ పైనా కేయూసీ పోలీస్ స్టేషన్లో ఫోక్సో కేసు నమోదైంది. ప్రస్తుతం భూపాలపల్లి లో సీఐగా పనిచేస్తున్న బండారి సంపత్ 2022 సంవత్సరంలో కాకతీయ పోలీస్ స్టేషన్లో ఎస్సైగా విధులు నిర్వహించారు. అయితే.. ఆ సమయంలో స్టేషన్ పరిధిలో ఒక మహిళతో సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయి.. NTR: ఎన్టీఆర్ మీద ఏం…
వైసీపీ నాయకులు కార్యక్రమాల్లో వాలంటీర్లు కనబడితే తమ వాట్సాప్ నెంబర్ కు సమాచారం పంపించమని ఒక ఫేక్ ట్విట్టర్ అకౌంట్ టీడీపీ నాయకులు ప్రారంభించారని రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ ఆరోపించారు. వాలంటీర్లు సాధారణ మనుషులు కాదా అని ప్రశ్నించారు. వాలంటీర్లను టీడీపీ, ఐటీడీపీ భయపెట్టాలని చూస్తుందని విమర్శించారు. ఈ సందర్భంగా ఎంపీ భరత్ రాజమండ్రిలో మీడియాతో మాట్లాడుతూ.. అభం శుభం తెలియని వాలంటీర్లపై ఎమ్మెల్యే కాండిడేట్ ఆదిరెడ్డి వాసు కక్ష తీర్చుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.
మోడీ మాదిగలకు ఏం చేశారో మందకృష్ణ సమాధానం చెప్పాలన్నారు ఏఐసీసీ కార్యదర్శి సంపత్. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జాతి ప్రయోజనాలు కాపాడుతుంది మా సీఎం రేవంత్ రెడ్డి అని ఆయన కొనియాడారు. సుప్రీంకోర్టులో మా ప్రభుత్వం అడ్వకేట్ ని పెట్టి కొట్లాడుతుందని, మాదిగ బిడ్డను నేను.. నన్ను ఎమ్మెల్యే.. ఏఐసీసీ కార్యదర్శి ని చేసింది కాంగ్రెస్ అని ఆయన వ్యాఖ్యానించారు. మోడీకి జాతిని అంటగట్టే పనిలో మందకృష్ణ ఉన్నారని, పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటే దానికి…
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను గురువారం రాత్ర ఈడీ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా తెలంగాణ జన సమితి అధ్యక్షుడు, ప్రొఫెసర్ కోదండరామ్ అరెస్ట్ ను ఖండించారు. ప్రభుత్వ పాఠశాలలను బాగు చేసిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను అరెస్ట్ చేయడం రాజకీయ కక్షలో భాగమేనని ఆరోపించారు. గుజరాత్ లో నేరాలు చేసిన వారిని మాత్రం నిర్దోషులుగా క్షమాభిక్ష పెడుతున్నారని.. ఇలాంటి ఘటనలు దేశవ్యాప్తంగా జరగడం శోచనీయం అని పేర్కొన్నారు.
మరికొన్ని గంటల్లో ఐపీఎల్ సీజన్ 17 ప్రారంభం కానుంది. ఈ సీజన్ లో తొలి మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్-ఆర్సీబీ మధ్య జరుగనుంది. అందుకోసం ఫ్యాన్స్ ఇప్పటికే.. చెన్నై చెపాక్ స్టేడియానికి భారీగా చేరుకుంటున్నారు. రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇదిలా ఉంటే.. ఈ ఐపీఎల్లో బీసీసీఐ కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. ఆ రూల్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
క్షయవ్యాధి (TB) అనేది ఒక అంటు వ్యాధి, ఇది టీబీ బాక్టీరియాతో ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది. ఇది సాధారణంగా ఊపిరితిత్తులలో సంభవిస్తుంది, దీనిని పల్మనరీ టీబీ అని పిలుస్తారు. అయితే ఇది మూత్రపిండాలు, వెన్నెముక, మెదడు లేదా శరీరంలోని ఏదైనా ఇతర భాగాన్ని కూడా ప్రభావితం చేయవచ్చు, దీనిని ఎక్స్ట్రాపల్మోనరీ టీబీ అంటారు. కొన్ని సందర్భాల్లో టీబీ బ్యాక్టీరియా పునరుత్పత్తి అవయవాలను కూడా ప్రభావితం చేస్తుంది, దీనిని జననేంద్రియ క్షయవ్యాధి అని పిలుస్తారు.
జగిత్యాల జిల్లాలో గంజాయి మూలాలు కలకలం రేపుతున్నాయి. పదవ తరగతి విద్యార్థినులు గంజాయికి బానిసైన విషయం విస్మయానికి గురి చేస్తుంది. జగిత్యాలలో విద్యార్థినులు గంజాయి మత్తులో చిత్తు అవుతున్నారు. తమ బంగారు భవిష్యత్తును చేజేతులా పాడు చేసుకుంటున్నారు. ముఖ్యంగా పదవ తరగతి చదివే విద్యార్థులు అధిక మొత్తంలో గంజాయికి బానిస అయ్యారు. ఈ విషయాన్ని ఓ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఘటన వెలుగులోకి వచ్చింది.
కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు, కార్మిక వ్యతిరేక విధానాల్ని నిరసిస్తూ రైతులు నల్లజెండాలు ఎగురవేయాలని సంయుక్త కిసాన్ మోర్చా, కిసాన్ మజ్దూర్ మోర్చా పిలుపునిచ్చారు.
ఇవాళ భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రెండు రోజుల అధికారిక పర్యటన నిమిత్తం భూటాన్ చేరుకున్నారు. ఈ సందర్భంగా పారో అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆయనకు ఘనస్వాగతం లభించింది.