రైతాంగ సమస్యలను పరిష్కరించాలని ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు కలెక్టర్‌కు వినతి పత్రం అందించారు. కలెక్టర్‌కు వినతి పత్రం అందించిన తర్వాత ఎంపీ నామా నాగేశ్వరరావు మాట్లాడుతూ.. ఖమ్మం జిల్లాలోని అన్ని మండలాలు, గ్రామాల్లో ఉన్న పంటలు అన్ని ఎండిపోయాయని, పంటలకు ఒక్క తడి నీరు అందిస్తే పంట చేతికి వచ్చేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారన్నారు. దానిపై కలెక్టర్ కు వినతి పత్రం అందించేందుకు సమయానికి వస్తె కలెక్టర్ సమయానికి రాలేదన్నారు. రైతులకు పంట నష్ట పోయిన రైతులకు నష్ట పరిహారం అందించాలని కలెక్టర్ కు వినతిపత్రం అందించామని, ఇప్పటికే ఖమ్మం నగరంలో బోర్లు వేయడం మొదలు పెట్టారన్నారు.
అంతేకాకుండా.. ఖమ్మం నగరంలో రోజుకి ఒకసారి కరెంట్ పోతుందని, తాగునీటి సమస్య మీద ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులను ఆదుకుని, నగర జిల్లా ప్రజలకు మంచి నీరు అందించాలన్నారు. అనంతరం.. రాజ్యసభ సభ్యులు, ఎంపీ గాయత్రి రవి మాట్లాడుతూ.త నాలుగు రోజులుగా జిల్లాలో మేము పంట పొలాలు పరిశీలించామన్నారు. ప్రతిపక్ష పార్టీ హోదాలో ప్రజల పక్షాన పోరాడేది మేమే అని గాయత్రి రవి అన్నారు. ఎకరాకు 25 వేలు పంట నష్ట పరిహారం ఇవ్వాలని, నష్టపోయిన రైతులకు నష్టపరిహారం వెంటనే ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేశారు. దాని విషయంలోనే జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేశామననారు. నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలన్నారు.