ఐపీఎల్ 2024లో భాగంగా.. లక్నోతో జరిగిన మ్యాచ్ లో ఆర్సీబీ ఓటమి పాలైంది. 182 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ.. 153 పరుగులకే ఆలౌటైంది. దీంతో.. లక్నో సూపర్ జెయింట్స్ 28 పరుగుల తేడాతో విక్టరీ సాధించింది. ఆర్సీబీ బ్యాటింగ్ లో చివరలో లామ్రోర్ 13 బంతుల్లో 33 పరుగుల మెరుపు ఇన్నింగ్స్ ఆడినప్పటికీ లాభం లేకుండా పోయింది. ఆర్సీబీ ఓపెనర్లు విరాట్ కోహ్లీ (22), డుప్లెసిస్ (19) పరుగులు చేసి మంచి ఆరంభాన్ని అందించలేకపోయారు.
Sourav Ganguly: ఫిట్నెస్ ఉంటే ఏ క్రీడల్లో అయినా రాణించగలం..
ఆ తర్వాత బ్యాటింగ్ క దిగిన రజత్ పాటిదర్ (29) పరుగులు చేశాడు. ఒకవైపు వికెట్లు పడుతుంటే.. పాటిదర్ మాత్రం కాసేపు నిలకడగా ఆడాడు. మ్యాక్స్ వెల్ ఈ మ్యాచ్ లో కూడా రాణించలేకపోయాడు. మరోసారి గోల్డెన్ డక్ అయ్యాడు. గ్రీన్ (9), అనుజ్ రావత్ (11), దినేష్ కార్తీక్ (4), సిరాజ్ (12) పరుగులు చేశారు. లక్నో బౌలింగ్ లో మయాంక్ యాదవ్ మళ్లీ మెరిశాడు. 4 ఓవర్లు వేసి కేవలం 14 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. ఆ తర్వాత నవీన్ ఉల్ హక్ 2 వికెట్లు తీశాడు. సిద్ధార్థ్, యష్ ఠాకూర్, స్టోయినీస్ తలో వికెట్ సంపాదించారు.
Registrations & Stamps : రిజిస్ట్రేషన్లు & స్టాంపుల శాఖ ఆదాయం క్షీణించింది
అంతకుముందు మొదట బ్యాటింగ్ చేసిన లక్నో జట్టు.. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 181 పరుగులు చేసింది. లక్నో బ్యాటింగ్ లో క్వింటాన్ డికాక్ (81) పరుగులతో రాణించాడు. ఆ తర్వాత నికోలస్ పూరన్ (40*) పరుగులు చేశాడు. ఈ ఇద్దరు బ్యాట్స్ మెన్స్ దూకుడుగా ఆడటంతో 181 పరుగులు చేసింది లక్నో జట్టు. లక్నో బ్యాటింగ్ లో కెప్టెన్ కేఎల్ రాహుల్ (20), పడిక్కల్ (6), స్టోయినీస్ (24) పరుగులు చేశారు. ఆర్సీబీ బౌలర్లలో మ్యాక్స్ వెల్ 2 వికెట్లు పడగొట్టాడు. ఆ తర్వాత టోప్లీ, యష్ దయాల్, సిరాజ్ తలో వికెట్ సాధించారు.