ఏపీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. విశాఖలో సముద్రంలో ఆరుగురు మత్స్యకారులు గల్లంతయ్యారు. నిన్న సాయంత్రం విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ నుంచి మత్స్యకారులు సముద్రంలోకి చేపల వేటకు వెళ్లారు. వైజాగ్ హార్బర్ నుంచి V1-MO -2736 నెంబర్ గల బోట్ లో వేటకు వెళ్లినట్లు తెలుస్తోంది. హార్బర్ నుంచి దక్షిణ దిశగా గంగవరం వైపు వేటకు వెళ్లారు మత్య్సకారులు. అయితే వారి ఆచూకీ తెలియకపోవడంతో ఫిషింగ్ బోట్లు, కోస్ట్ గార్డ్ సాయంతో గాలింపు చర్యలు చేపడుతున్నారు.
ఈ నెల 6న రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో కాంగ్రెస్ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు సభా ప్రాంగణాన్ని సీఎం రేవంత్ రెడ్డి మంగళశారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. రాజీవ్ గాంధీ ప్రాంగణంలో 6 వ తేదీ సాయంత్రం సభ నిర్వహించనున్నట్లు.. సభకు తెలంగాణ జనజాతర పేరు ఖరారు చేసినట్లు ఆయన తెలిపారు. జన జాతర వేదిక మీది నుండి మేనిఫెస్టో విడుదల…
ఓ వార్తను కవరేజ్ చేసేందుకు వచ్చిన జర్నలిస్ట్ గున్వంత్ కలాల్ పై చిరుత దాడి చేసేందుకు ప్రయత్నం చేసింది. అతడి కాలును నోటితో కరిచి పట్టుకోవడంతో అతడు ధైర్యంగా పోరాడి చిరుతను గట్టిగా పట్టేసుకున్నాడు. దాని దవడ, మెడను గట్టిగా పట్టుకుని.. ఆ తర్వాత చిరుత పులిని బంధించి అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు.
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించుకొని ఉదయగిరిని సిరుల గిరిగా చేసుకుందామని ఉదయగిరి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ పేర్కొన్నారు. వింజమూరు మండల కేంద్రంలోని బొమ్మరాజు చెరువు సమీపంలో ఉన్న తెలుగుదేశం ప్రధాన పార్టీ కార్యాలయం నందు మహిళా శక్తి మహిళా నేతలతో కలిసి కాకర్ల సురేష్ సోమవారం సమావేశం నిర్వహించారు.
ఎస్సీ వర్గీకరణకు అండగా నిలిచిన ఎన్డీఏ కూటమి గెలుపే ఎమ్మార్పీఎస్ లక్ష్యం అని ఎమ్మార్పీఎస్ నేతలు తెలిపారు. వింజమూరు మండల కేంద్రంలోని బొమ్మరాజు చెరువు సమీపంలో ఉన్న టీడీపీ కార్యాలయంలో ఎంఎస్పి సీనియర్ నాయకులు ఉదయగిరి బిట్ టూ ఇంఛార్జి గోచిపాతల వెంకటేశ్వర్లు మాదిగ ఆధ్వర్యంలో సోమవారం ఎమ్మార్పీఎస్ జిల్లా స్థాయి, నియోజకవర్గంలోని మండల నాయకులతో కలిసి ఎన్డీఏ కూటమి అభ్యర్థి కాకర్ల సురేష్ ను కలిసి శాలువాతో ఘనంగా సన్మానించారు.
ఐపీఎల్ 2024లో భాగంగా ఈరోజు ముంబై ఇండియన్స్-రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ విజయం సాధించింది. 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. 125 పరుగుల లక్ష్యాన్ని మరో 27 బంతులు ఉండగానే 4 వికెట్లు కోల్పోయి 127 పరుగులు చేసింది. ఈ విజయంతో రాజస్థాన్ వరుసగా మూడు మ్యాచ్ లు ఆడి.. మూడింటిలో గెలిచింది. ఇక.. ముంబై కూడా వరుసగా మూడింటిలో మూడు ఓడిపోయింది. హోంగ్రౌండ్ లో జరిగిన మ్యాచ్…
ఈరోజు ముంబైలోని వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్-రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ లో ముంబై ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో.. ఓ అభిమాని గ్రౌండ్ లోకి వచ్చాడు. స్లిప్ లో ఫీల్డింగ్ చేస్తున్న రోహిత్ శర్మ దగ్గరకు వెనుకనుంచి వెళ్లడంతో.. ఒక్కసారిగా భయపడ్డాడు. వెంటనే వెనక్కి జరిగి అభిమానికి హగ్ ఇచ్చాడు. ఆ తర్వాత అక్కడే కీపింగ్ చేస్తున్న ఇషాన్ కిషన్ దగ్గరికి వెళ్లి హగ్ చేసుకున్నాడు. ఆ తర్వాత భద్రతా సిబ్బంది గ్రౌండ్…
రైతు యాత్ర అని పెట్టారు.. ఏదో ఏదో మాట్లాడారన్నారు మంత్రి సీతక్క. ఇవాళ ఆమె ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. 40 వేల కోట్లు పెట్టిన మిషన్ కాకతీయ చెరువుల్లో నీళ్ళు ఉండాలి కదా అని ఆమె అన్నారు. కట్టిన కాళేశ్వరం కూలిపాయే అని ఆమె విమర్శించారు. కావాలని బురద జల్ల వద్దని ఆమె హితవు పలికారు. అధికారం పొతే గాని ప్రజలు గుర్తుకు రాలేదని, రాష్ట్ర పతి పదవి ఆదివాసి కి…
ఐపీఎల్-2024లో భాగంగా ఈరోజు ముంబై ఇండియన్స్-రాజస్తాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. వాంఖడే వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో 'హిట్ మ్యాన్' రోహిత్ శర్మ మరోసారి నిరాశపరిచాడు. హోంగ్రౌండ్ లో పరుగులేమీ చేయకుండానే ఔటయ్యాడు. రాజస్తాన్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ వేసిన బౌలింగ్లో.. వికెట్ కీపర్ సంజూ శాంసన్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాట పట్టాడు.