Markapuram: చెన్నకేశవస్వామి ఆలయ గోపుర, కలశ ప్రతిష్టా మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యేలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Markapuram: మార్కాపురం పట్టణంలో వెలసిన శ్రీ లక్ష్మిచెన్నకేశవుడు నాలుగు యుగాల దేవుడిగా కామిత వరదాతగా ప్రసిద్ధి గాంచాడు. ‘కృతయుగే గజారన్నే తేత్రాయం మాదవీపురి ద్వాపరే స్వర్గసోపానం కలౌ మారికాపురి’ అని ప్రసిద్ది. కృతయుగాదిలో స్వామి ఇక్కడ వెలసినట్లు మార్కండేయ మహాముని రచించిన గజారణ్య సంహితలో ఉంది. కృతయుగంలో గజారణ్యమని ఏనుగులు తొండాలతో నీటిని తెచ్చి స్వామిని అభిషేకించేవని పురాణాలు చెబుతున్నాయి. మార్కాపురం ప్రజల ఇలవేల్పు శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయంలో జరుగుతున్న గోపుర, కలశ ప్రతిష్టా మహోత్సవంలో గిద్దలూరు శాసన సభ్యులు అన్నా రాంబాబు కుటుంబం, మార్కాపురం ఎమ్మెల్యే కేపీ నాగార్జున కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబుతో పాటు ఆయన సతీమణి దుర్గకుమారి, కుమారుడు కృష్ణ చైతన్య, కోడలు అనూషలు పాల్గొన్నారు. మార్కాపురం ఎమ్మెల్యే కేపీ నాగార్జున రెడ్డితో పాటు ఆయన సతీమణి సతీమణి కల్పనారెడ్డి, సోదరుడు కృష్ణ మోహన్ రెడ్డి దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆలయంలో జరుగుతున్న నాలుగు గోపుర ప్రాకార కలశ ప్రతిష్ట మహోత్సవము, నూతన ధ్వజ పునః ప్రతిష్ఠా మహోత్సవ కార్యక్రమాల్లో వారు పాల్గొన్నారు. అనంతరం వారు స్వామి వారిని దర్శించుకొని ఆశీస్సులు తీసుకున్నారు. శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవస్థానంలో 130 సంవత్సరాల తర్వాత నూతన ధ్వజ ప్రతిష్ఠా మహోత్సవం, నాలుగు గోపుర ప్రాకార కలశ ప్రతిష్ట మహోత్సవాలు మన మార్కాపురానికీ చారిత్రాత్మకమైన రోజు అని ఎమ్మెల్యేలు తెలిపారు.
Also Read
- Ind Vs NZ: భారత్‌పై న్యూజిలాండ్ ఘన విజయం.. సిరీస్ కైవసం చేసుకున్న ఇండియా..
- NASA Swift Telescope: నాసా రెస్క్యూ విఫలం.. భూమిపై కూలిపోనున్న స్విఫ్ట్ అబ్జర్వేటరీ.!
- Municipal Elections: కర్నూల్ జిల్లాలో పోటెత్తిన ఓటర్లు.. రాష్ట్రవ్యాప్తంగా 3 గంటల సమయానికి 48.03 శాతం ఓటింగ్ నమోదు..
- YS Jagan: ఓటు వేయకుండానే వెనుదిరిగిన మాజీ సీఎం జగన్.. పులివెందులలో తీవ్ర ఉద్రిక్తత..
తాజావార్తలు
-
AP Municipal Elections 2026 Live Updates: మున్సిపల్ ఎన్నికల పోలింగ్ లైవ్ అప్డేట్స్.. ఎస్ఈసీ కార్యాలయంకు వైసీపీ నేతలు!
-
Nara Lokesh : పులివెందులలో శాంతిభద్రతల సమస్యకు జగనే కారణం
-
Mamata Banerjee : బెంగాల్ హక్కుల కోసం ఎంతటి పోరాటానికైనా సిద్ధం.. వెనక్కి తగ్గేది లేదు
-
Ind Vs NZ: భారత్‌పై న్యూజిలాండ్ ఘన విజయం.. సిరీస్ కైవసం చేసుకున్న ఇండియా..
-
NASA Swift Telescope: నాసా రెస్క్యూ విఫలం.. భూమిపై కూలిపోనున్న స్విఫ్ట్ అబ్జర్వేటరీ.!
-
RAAKA: ‘రాకా’ ఇంటర్వెల్ కోసం మైండ్ బ్లోయింగ్ స్టంట్స్.. బన్నీ ఫ్యాన్స్‌కు పండగే!
ట్రెండింగ్
-
Medicine Storage Tips : ఇంట్లో మందులు ఎక్కడ పెడుతున్నారు? ఈ చిన్న పొరపాట్లు చేయొద్దు
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!