ఐపీఎల్-2024లో వరుస విజయాలతో దూసుకుపోతున్న కోల్‌కతా నైట్ రైడర్స్ కు బిగ్ షాక్ తగిలింది. బుధవారం ఢిల్లీతో జరిగిన మ్యాచ్ లో కేకేఆర్ జట్టు యువ పేసర్ హర్షిత్ రాణా గాయపడ్డాడు. బంతిని ఆపేందుకు ప్రయత్నించగా అతని కుడి భుజానికి గాయమైంది. దీంతో.. ఆ మ్యాచ్ మధ్యలోనే ఫీల్డ్ నుంచి బయటికి వెళ్లిపోయాడు. తర్వాత ఫీల్డింగ్ రాలేదు. అంతేకాకుండా.. ఆ మ్యాచ్ లో ఒక్క ఓవర్ కూడా బౌలింగ్ చేయలేదు.
Read Also: Navneet Kaur: అమరావతిలో నామినేషన్ వేసిన నవనీత్ కౌర్
కాగా.. అతని గాయంపై కేకేఆర్ ఫ్రాంఛైజీ ఎటువంటి అప్ డేట్ ఇవ్వలేదు. అయితే.. రాణాకు గాయం ఎక్కువైతే ఏప్రిల్ 8న చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగే మ్యాచ్ కు అతను దూరం కానున్నాడు. హర్షిత్ రాణా.. ఇప్పటివరకు 3 మ్యాచ్ లు ఆడి ఐదు వికెట్లు తీశాడు. ఇక.. కేకేఆర్ జట్టు బుధవారం ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో 106 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే..
Read Also: CM YS Jagan: జూన్ 4న మళ్లీ అధికారంలోకి వస్తాం.. దానిపైనే మొదటి సంతకం!
ఈ సీజన్ లో కోల్ కతా నైట్ రైడర్స్ ఆడిన మూడు మ్యాచ్ ల్లోనూ విజయం సాధించింది. దీంతో.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. కోల్ కతా నైట్ రైడర్స్ తర్వాతి మ్యాచ్ సీఎస్కేతో ఆడనుంది.