ఇంటి వద్దకే పింఛన్ పంపిణీ కార్యక్రమాన్ని అడ్డుకుని చంద్రబాబు వృద్ధుల ఉసురు పోసుకున్నాడని కడప జిల్లా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అన్నారు. మండు టెండలో పింఛన్ కోసం వృద్ధులు పడుతున్న ఇబ్బంది చూసి బాధగా ఉందన్నారు. ఈ ఊరులో వరదరాజుల రెడ్డికి.. అక్కడ చంద్రబాబుకు కనికరం లేదన్నారు. చంద్రబాబు చేసినా దుర్మార్గమైన చర్యకు చంద్రబాబు ఒక్కరు ఓటు కుడా వేయరని ఆయన పేర్కొన్నారు. జగన్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు వృద్ధులకు, దివ్యంగులకు, వితంతువులకు ఈ పింఛన్ గొప్ప వరమని ఆయన తెలిపారు. పింఛన్ 4 వేల నుండి 5వేల రూపాయలు ఇవ్వాలని జగన్ కు విన్నవించుకొంటున్న అని ఆయన వ్యాఖ్యానించారు.
వాలంటీర్ వ్యవస్థను చూసి చంద్రబాబు బయపడుతున్నాడని, వాలంటీర్ వ్యవస్థను ప్రవేశ పెట్టిన జగన్ కు కృతజ్ఞతలు తెలిపారు రాచమల్లు. వాలంటీర్లు స్వచ్చందగా రాజీనామా చేసి, పార్టీ కోసం పనిచేస్తున్నారని, జూన్ 4 న మళ్ళీ వాలంటీర్ వ్యవస్థ పై తొలి సంతకం చేస్తానని జగన్ తెలిపారన్నారు. నా నియోజకవర్గంలో రాజీనామా చేసిన వాలంటీర్ అందరిని మళ్ళీ తీసుకుంటామన్నారు. తప్పని సరిగా జులైన మళ్ళీ ఇంటింటికి పింఛన్లు పంచుతామన్నారు.