టీడీపీ-జనసేన-బీజేపీ సంకీర్ణ ప్రభుత్వంలోనే అన్ని వర్గాల ప్రజలు సంక్షేమంగా ఉంటారని తెలిపారు గన్నవరం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు సతీమణి యార్లగడ్డ జ్ఞానేశ్వరి. విజయవాడ రూరల్ మండలం రామవరప్పాడు గ్రామంలోని రాజుల బజారు, వేమినేని రామస్వామి గారి వీధి, చాగంటిపాటి వెంకటప్పయ్య గారి వీధి, మక్లిమూడి వారి వీధిలో గురువారం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో జ్ఞానేశ్వరి పాల్గొన్నారు. గ్రామంలో ఇంటింటికి వెళ్లి మహిళలకు బొట్టు పెడుతూ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతి ఒక్కరు సైకిల్ గుర్తుకు ఓటేసి తన భర్త వెంకట్రావుని ఎమ్మెల్యేగా గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా గ్రామస్థులతో మాట్లాడుతూ.. జగన్ పాలనలో అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందని, యువతకు ఉద్యోగాలు లేక నానా ఇబ్బందులు పడుతున్నారని అవేదన వ్యక్తం చేశారు.
Koona Srisailam Goud: బీజేపీకి షాక్.. కాంగ్రెస్ లో చేరిన కూన శ్రీశైలం గౌడ్
ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి రాగానే అర్హులందరికీ ప్రతి నెల రూ. 4 వేల పింఛను ఇంటివద్దకే వెళ్లి అందజేస్తామన్నారు. వెంకట్రావుని ఎమ్మెల్యేగా ఎన్నుకుంటే గన్నవరంలో పరిశ్రమలు ఏర్పాటు చేసి స్థానిక యువతకు ఉద్యోగాలు కల్పిస్తారని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు నాభిగాని కొండయ్య, రేగళ్ళ రాజా, అద్దేపల్లి సాంబ, కొంగన రవి, బొమ్మసాని అరుణ, జనసేన నాయకులు తిప్పా రాజేశ్వరి, టీడీపీ నాయకులు సాయి రామరాజు, పట్టపు చంటి, తుపాకుల శివలీలా, దూళిపూడి దుర్గాప్రసాద్, సూర్య కుమార్, పుట్టి నాగరాజు, బీజేపీ నియోజకవర్గ ఇంఛార్జి డా. ఫణి, కళ్లేపల్లి నాగరాజు, గంధం గోవర్ధన్, కూనపరెడ్డి నాని, కొళ్ళ ఆనంద్, జనసేన నాయకులు కొడెమల రవి తదితరులు పాల్గొన్నారు…