ఐపీఎల్ 2024లో భాగంగా.. ఆర్సీబీ-రాజస్థాన్ మధ్య జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ గెలుపొందింది. 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 184 పరుగుల టార్గెట్ను 19.1 ఓవర్లలో ఛేదించింది. కాగా.. ఈ మ్యాచ్లో రెండు సెంచరీలు నమోదయ్యాయి. ఆర్సీబీ బ్యాటింగ్లో విరాట్ కోహ్లీ సెంచరీ చేయగా.. అతని సెంచరీ వృధా అయింది. రాజస్థాన్ బ్యాటింగ్లో బట్లర్ సెంచరీ చేశాడు. 58 బంతుల్లో 100 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. అతని ఇన్నింగ్స్లో 4 సిక్స్ లు, 9 ఫోర్లు ఉన్నాయి.
Off The Record: ఈటల, రంజిత్ రెడ్డి రెండు పార్టీలలో ఉండటంపై చర్చ.. ప్లాన్ అదేనా..?
రాజస్థాన్ బ్యాటింగ్లో ఓపెనర్ జైస్వాల్ డకౌట్ కాగా.. తర్వాత వచ్చిన బట్లర్ (100), సంజూ శాంసన్ (69) మంచి ఇన్నింగ్స్ ఆడటంతో విజయం సాధించారు. ఆ తర్వాత రియాన్ పరాగ్ (4), జురెల్ (2), హెట్మెయర్ (11) పరుగులు చేశారు. ఆర్సీబీ బౌలర్లలో టోప్లీ 2 వికెట్లు పడగొట్టాడు. యష్ దయాల్, సిరాజ్ తలో వికెట్ సాధించారు.
Russia Floods: రష్యాలోని ఓరెన్‌బర్గ్లో తెగిన ఆనకట్ట.. 4 వేల మంది సురక్షితం
అంతకుముందు మొదట బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ.. నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 183 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ సెంచరీ చేశాడు. ఈ సీజన్ లో తొలి సెంచరీని నమోదు చేశాడు. 72 బంతుల్లో 113 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. అతని ఇన్నింగ్స్ లో 6 సిక్స్లు, 12 ఫోర్లు ఉన్నాయి. ఐపీఎల్లో కోహ్లీకి ఇది ఎనిమిదో సెంచరీ కావడం విశేషం. డుప్లెసిస్ (44) పరుగులు చేశాడు. ఈ ఇద్దరు బ్యాటర్లు తప్ప.. మిగతా బ్యాటర్లు ఎవరూ పెద్దగా రాణించలేదు. మ్యాక్స్ వెల్ (1) ఈ మ్యాచ్లో కూడా నిరాశపరిచాడు. సౌరవ్ చౌహన్ (9), కెమెరాన్ గ్రీన్ (5) పరుగులు చేశారు. రాజస్థాన్ బౌలింగ్లో యజువేంద్ర చాహల్ 2 వికెట్లు పడగొట్టాడు. బర్గర్ ఒక వికెట్ తీశాడు.