రష్యాలో వరదలు బీభత్సం సృష్టించాయి. ఆకస్మాత్తుగా ఉరల్ నది వరదలు సమీప గ్రామాలలోకి నీరు ప్రవేశించింది. దీంతో పెద్ద సంఖ్యలో ప్రజలు తమ ఇళ్లలోనే చిక్కుకుపోయారు. కజకిస్థాన్ సరిహద్దుకు సమీపంలోని ఓరెన్‌బర్గ్ ప్రాంతంలో ఆనకట్ట తెగిపోవడంతో భారీగా వరదలు వచ్చాయి. వరదల భారీ నుంచి సుమారు 4,000 మందికి పైగా మందిని రెస్క్యూ సిబ్బంది రక్షించారు. దీనిపై.. ఓరెన్‌బర్గ్ గవర్నర్ కార్యాలయం శనివారం ఓ ప్రకటన చేసింది. ‘1,019 మంది పిల్లలతో సహా 4,208 మందిని రక్షించాం. 2,500 కంటే ఎక్కువ ఇళ్లు వరదల వల్ల ప్రభావితమయ్యాయని తెలిపింది.
Himanta Biswa Sarma: కాంగ్రెస్ మేనిఫెస్టో భారత్ కోసం కాదు, పాకిస్తాన్ కోసం..
మరోవైపు.. భారీ వరదల ధాటికి ఓర్స్క్ ప్రాంతంలో ఒక డ్యామ్ కుప్పకూలింది. ఈ క్రమంలో.. అక్కడ ఉన్న రెండు వేల మంది స్థానికులను ప్రావిన్షియల్ ప్రభుత్వం శనివారం సురక్షిత ప్రాంతాలకు తరలించింది. కాగా.. శుక్రవారం, ఉరల్ పర్వతాలలోని అరెన్‌బర్గ్ ప్రాంతంలో నది ఒడ్డున నివసించే ప్రజలను ఖాళీ చేయాలని స్థానిక అధికారులు కోరారు. వరదల ధాటికి అక్కడ ఆనకట్ట కొట్టుకుపోయింది. ఈ క్రమంలో.. ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయించారు. కాగా.. ఆ డ్యామ్ కొట్టుకుపోవడానికి సరైన నిర్వహణ లేకపోవడమే కారణమని అధికారులు చెబుతున్నారు.
Kishan Reddy: గ్యారెంటీల అమలుపై చర్చకు సిద్ధమా?.. రాహుల్‌కు కిషన్ రెడ్డి ఓపెన్ ఛాలెంజ్
ఈ ఘటనలో ఎవరికి ప్రాణ నష్టం జరగలేదని స్థానిక అధికారులు శనివారం తెలిపారు. కాగా.. ఓర్స్క్‌లో ప్రజలకు సహాయం చేయడానికి మరియు వరద పరిణామాలను ఎదుర్కోవటానికి అవసరమైన సహాయక చర్యలు చేపట్టారు. మరోవైపు.. డ్యామ్ దెబ్బతిన్న భాగాలపై అత్యవసర మరమ్మతు పనులు జరుగుతున్నాయని అధికారులు చెప్పారు.