అల్లారుముద్దుగా పెంచుకుని.. పెరిగి పెద్ద చేసుకుని ఉన్నతస్థాయి చదువులు చదివిపిస్తే, వారు మాత్రం తల్లిదండ్రుల దుఖాన్ని, బాధను చూడకుండా కడుపుకోతను మిగులుస్తున్నారు. తమ పిల్లలు మంచిగా చదువుకుని తమను ఎంతో సంతోషంగా చూసుకుంటారని అనుకుంటే మధ్యలోనే తల్లిదండ్రులను విడిచిపోయి శోకసంద్రంలో ముంచుతున్నారు. ఇటీవల విడుదలైన ఇంటర్ పరీక్ష ఫలితాలలో కొందరు విద్యార్థులు మంచి మార్కులు సాధిస్తే, మరికొందరు ఫెయిల్ అయ్యారు. అయితే వారికి ఇంకో అవకాశం ఉంది. మళ్లీ సప్లిమెంటరీ రాసి ఫాస్ కావొచ్చని.. కానీ వారు అదేమీ ఆలోచించకుండా పరీక్షల్లో ఫెయిల్ అయ్యామని బాధతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ప్రతీ ఏటా ఇలా ఫలితాలు విడుదలైనప్పుడు ఎక్కడో చోట ఆత్మహత్య సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి.
Read Also: Sunetra Pawar: రూ. 25,000 కోట్ల బ్యాంకు కుంభకోణంలో అజిత్ పవార్ భార్యకు క్లీన్ చిట్..
తాజాగా తెలంగాణలో ఇంటర్ లో ఫెయిల్ అయినందుకు విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. మెదక్ జిల్లాలో ఓ విద్యార్థిని సూసైడ్ చేసుకుంది. ఇంటర్ లో ఫెయిల్ కావడంతో ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. శేరిపల్లి సమీపంలో రమ్య అనే విద్యార్థిని రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. మరోవైపు.. మంచిర్యాల జిల్లాలో రెండు వేర్వేరు చోట్ల ఇద్దరు ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. దొరగారి పల్లి గ్రామానికి చెందిన ఘటిక తేజస్విని అనే విద్యార్థిని.. ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలో ఫెయిల్ అయిన కారణంగా మనస్థాపంతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. తాండూరు మండలం అచలాపూర్ లో సాత్విక్ (15) అనే ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థి పరీక్షల్లో ఫెయిల్ అయినందుకు ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
Read Also: Mahesh Babu: వామ్మో.. ఆ రోజు మహేష్ వేసుకున్న షర్ట్ రేటు లక్షా?