తిరుమల: రేపు శ్రీవారి ఆలయంలో రథసప్తమి వేడుకలు. ఇవాళ, రేపు, ఎల్లుండి తిరుపతిలో జారీ చేసే సర్వదర్శనం టోకెన్లు రద్దు చేసిన టీటీడీ. ఇవాళ సిఫార్సు లేఖల స్వీకరణ రద్దు చేసిన టీటీడీ. రేపు శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాలు, వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేసిన టీటీడీ. నేడు గుంటూరు కార్పొరేషన్ లో స్టాండింగ్ కమిటీ ఎన్నిక … ఉత్కంఠ గా మారిన స్టాండింగ్ కమిటీ ఎన్నిక… ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం…
ఢిల్లీలో ఈనెల 5న అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. అందుకోసం బీజేపీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెళ్లారు. షాధ్రాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు చంద్రబాబు. ఆయనతో పాటు కేంద్రమంత్రి మనోహర్ లాల్ కట్టర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.
“ఆఫ్ ది పీపుల్, ఫర్ ది పీపుల్”.. బడ్జెట్ తర్వాత నిర్మలా సీతారామన్ తొలి ఇంటర్వ్యూ పార్లమెంట్ లో ఫిబ్రవరి 1వ తేదీన బడ్జెట్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా ఆమె బడ్జెట్ తర్వాత ఓ టీవీ ఛానల్ కి ఇచ్చిన మొదటి ఇంటర్య్వూలో మాట్లాడుతూ.. ప్రజల కోసం, ప్రజల చేత తీసుకొచ్చిన బడ్జెట్ అన్నారు. అలాగే, నేను ఎక్కడికి వెళ్లినా వినిపించే పదం పన్ను చెల్లింపుల గురించి.. మేం…
డబుల్ ఇంజన్ సర్కార్ వల్లనే అమరావతి, పోలవరం, స్టీల్ ప్లాంట్, జలజీవన్ మిషన్ పొడిగింపు వంటి ప్రయోజనాలు రాష్ట్రానికి కలిగాయని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. 2019కి ముందు పోలవరం ప్రాజెక్టులో ఎప్పుడూ లేని ఫేజ్-1, ఫేజ్-2లను తీసుకొచ్చి జగన్ తీవ్రమైన తప్పిదం చేశాడని ఆరోపించారు.
అండర్-19 ఉమెన్స్ వరల్డ్ కప్ విజేతగా భారత్ నిలిచిన సంగతి తెలిసిందే.. వరుసగా రెండోసారి అండర్-19 వరల్డ్ కప్ గెలిచింది. కౌలాలంపూర్ వేదికగా జరిగిన ఫైనల్లో 9 వికెట్ల తేడాతో భారత జట్టు విజయం సాధించింది. ఈ సందర్భంగా అండర్-19 భారత మహిళల క్రికెట్ జట్టు టీ20 వరల్డ్ కప్ సాధించడం పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందనలు తెలిపారు.
ఐదు టీ20 సిరీస్‌లో భాగంగా కాసేపట్లో చివరి టీ20 మ్యాచ్ జరుగనుంది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఇరు జట్లు తలపడనున్నాయి. ఈ క్రమంలో.. ఇంగ్లాండ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో.. ముందుగా టీమిండియా బ్యాటింగ్ చేయనుంది.
వైసీపీ మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డికి మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. సీఎం చంద్రబాబు నాయుడు పర్యటన పై ఆరోపణలు చేయడం తగదని అన్నారు.
పల్నాడు జిల్లాలో చాక్లెట్ ఇస్తానని మాయమాటలు చెప్పి ఓ బాలికను అపహరించేందుకు ప్రయత్నం చేశాడు ఓ ఆగంతకుడు.. ఇది గమనించిన స్థానికులు నిందితుడిని పట్టుకుని దేహశుద్ధి చేశారు. ఈ ఘటన వినుకొండ పట్టణంలోని బోసుబొమ్మ సెంటర్లో జరిగింది.
కేంద్ర బడ్జెట్‌పై కాంగ్రెస్ నేత హనుమంతు రావు రియాక్షన్.. కేంద్ర బడ్జెట్‌పై కాంగ్రెస్ నేత వి. హనుమంతు రావు స్పందించారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ.. బడ్జెట్ కేటాయింపులు ఎన్డీఏ పాలిత రాష్ట్రాలకే ఎక్కువగా జరిగాయన్నారు. “తెలంగాణలో విభజన హామీలు ఏవీ పూర్తి చేయలేదు. మూసీ ప్రక్షాళన కోసం నిధులు కోరినా కేటాయింపులు జరపలేదు. ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలపై కేంద్రం పక్షపాతాన్ని ప్రదర్శిస్తోంది. పోలవరం, అమరావతి, విశాఖ స్టీల్ ప్లాంట్‌కు నిధులిచ్చిన కేంద్రం, తెలంగాణలో ఒక్క ప్రాజెక్టుకు కూడా…
ముద్రగడ పద్మనాభ రెడ్డి కుమార్తె జనసేన నాయకురాలు బార్లపూడి క్రాంతి రాజమండ్రిలో మీడియా సమావేశం నిర్వహించారు. మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభ రెడ్డి ఇంటిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానని తెలిపారు.