గురువారం ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి వన్డేలో టీమిండియా ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.. అయితే ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ ఆడలేదు. మోకాలి సమస్య వల్ల మొదటి మ్యాచ్ కు దూరమయ్యాడు. అయితే రెండో వన్డేలోనైనా ఆడుతాడా లేదా అన్నది అభిమానుల్లో పెద్ద ప్రశ్న మెదులుతుంది. మొదటి వన్డేలో కోహ్లీ స్థానంలో శ్రేయాస్ అయ్యర్‌కు అవకాశం లభించింది. అతను 59 పరుగులతో అద్భుతంగా రాణించి జట్టుకు విజయాన్ని అందించాడు.
Read Also: Stock Market: రుచించని ఆర్బీఐ పాలసీ.. నష్టాల్లో ముగిసిన సూచీలు
కాగా.. ఫిబ్రవరి 9న కటక్‌లో భారత్-ఇంగ్లాండ్ మధ్య రెండో వన్డే జరగనుంది. ఈ మ్యాచ్‌కు ముందు విరాట్ కోహ్లీ ఫిట్‌గా ఉంటాడా..? రెండో వన్డేలో కోహ్లీ ఆడుతాడా లేదా అన్నది భారత వైస్ కెప్టెన్ శుభ్‌మాన్ గిల్ అప్ డేట్ ఇచ్చాడు. అభిమానులకు గిల్ గుడ్ న్యూస్ చెప్పాడు. విరాట్ కోహ్లీ గాయం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. కటక్‌లో జరిగే రెండో వన్డేకు కోహ్లీ తిరిగి జట్టులోకి వస్తాడని ఆయన తెలిపాడు. “బుధవారం ప్రాక్టీస్ సందర్భంగా విరాట్ కోహ్లి కుడి కాలి మోకాలికి బంతి తాకింది. అయినప్పటికి అతడు తన ప్రాక్టీస్‌ను కొనసాగించాడు. ప్రాక్టీస్ సమయంలో ఎటువంటి ఇబ్బంది తలెత్తలేదు. కానీ శిక్షణ తర్వాత హూటల్‌కు వెళ్లాక అతడి మోకాలిలో వాపు కన్పించింది. దీంతో ముందు జాగ్రత్తగా అతడికి విశ్రాంతిని ఇచ్చాము. విరాట్ ప్రస్తుతం బాగానే ఉన్నాడు. అతడు కటక్ వన్డేలో ఆడే అవకాశం ఉంది” అని శుభ్‌మాన్ గిల్ స్టార్ స్పోర్ట్స్‌తో చెప్పాడు.
Read Also: Ratan Tata : సంచలనంగా రతన్ టాటా వీలునామా.. రూ.500కోట్లు పొందిన మిస్టరీ మ్యాన్ ఎవరు ?
నాగ్‌పూర్ వన్డేలో విరాట్ కోహ్లీ స్థానంలో శుభ్‌మాన్ గిల్ నంబర్-3 స్థానంలో వచ్చి 87 పరుగుల అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. జట్టు విజయంలో గిల్ కీలక పాత్ర పోషించాడు. ఈ ఇన్నింగ్స్‌కు గిల్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా లభించింది. మరోవైపు.. కోహ్లి రెండో వన్డేలో ఆడితే యువ ఆటగాడు యశస్వి జైశ్వాల్‌పై వేటు పడే అవకాశముంది. నాగ్‌పూర్ వన్డేతో అరంగేట్రం చేసిన జైస్వాల్.. కేవలం 13 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. ఈ క్రమంలో అతడిని పక్కన పెట్టి గిల్‌ను యథావిధిగా ఓపెనర్‌గా పంపాలని టీమ్ మెనెజ్‌మెంట్ భావిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వరుసగా మూడు, నాలుగు స్థానాల్లో విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్‌కు వచ్చే అవకాశం ఉంది.