పల్నాడు జిల్లా ఈపూరు మండలం భద్రు పాలెం వద్ద అమానుషం చోటు చేసుకుంది. వృద్ధాప్యంలో ఉన్న తండ్రిని కారులో తీసుకొచ్చి సాగర్ కాలువలో పడేశాడు కుమారుడు వెంకటేశ్వర్లు.. నూజెండ్లకు చెందిన తండ్రి గంగినేని కొండయ్య (85)ను కాలువలో పడేశాడు కుమారుడు.
సూపర్ సిక్స్ అన్నాడు.. అయితే ఇప్పుడు అది సాధ్యం కాదని చంద్రబాబు నాయుడు చెప్పడం విడ్డూరంగా ఉందని మాజీమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆరోపించారు. కడప వైసీపీ జిల్లా సర్వసభ్య సమావేశానికి హాజరైన ఆయన మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఘాటు విమర్శలు చేశారు.
ముడా స్కామ్లో సీఎం సిద్ధరామయ్య పేరు.. షాకిచ్చిన ఈడీ.. కర్ణాటకలో సంచలనంగా మారిన మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(ముడా) కుంభకోణంలో సీఎం సిద్ధరామయ్యతో పాటు ఆయన భార్యకు సంబంధం ఉందని ఈడీ పేర్కొంది. సిద్ధరామయ్య, ఆయన భార్య, ఆయన కుటుంబ సభ్యులకు ఈ స్కామ్లో సంబంధం ఉందని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) వెల్లడించింది. ప్రభుత్వం సేకరించిన భూమిని అక్రమంగా డీ-నోటిఫై చేయడం, మోసపూరిత భూమి మార్పిడి , సుమారు రూ.56 కోట్ల విలువైన సైట్ కేటాయింపులు వంటి పెద్ద…
కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెడన బైపాస్ రోడ్ లో లారీ, బైకును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైకుపై వెళ్తున్న ముగ్గురు మృతి చెందారు. మచిలీపట్నం నుండి పెయింట్ పని ముగించుకుని తిరిగి స్వగ్రామం అత్తమూరుకు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.
వెటరన్ బ్యాట్స్మెన్ షెల్డన్ జాక్సన్ గురువారం రంజీ ట్రోఫీలో రికార్డు సృష్టించాడు. రంజీ ట్రోఫీ చరిత్రలో అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాట్స్మెన్గా షెల్డన్ నిలిచాడు. రాజ్కోట్లో అస్సాంతో జరిగిన చివరి లీగ్ దశలో షెల్డన్ జాక్సన్ ఈ ఫీట్ సాధించాడు. భారత మాజీ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ నమన్ ఓజా రికార్డును షెల్డన్ బద్దలు కొట్టాడు.
హామీల అమలుకు కొంత ఆలస్యం కావచ్చు కానీ.. ప్రజల్ని మోసం చేయము! తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలుకు కొంత ఆలస్యం కావచ్చు కానీ.. ప్రజల్ని మాత్రం మోసం చేయమని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ వెల్లడించారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి దృష్టిలో పెట్టుకొని పథకాల అమలు ఉంటుందని స్పష్టం చేశారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఉద్దేశం డబ్బులు లేవని కాదని, అధికారుల వల్ల కొంత ఆలస్యం అవుతుందన్నారు. జీహెచ్ఎంసీపై ఫోకస్ చేస్తున్నామని,…
విశాఖలో స్టీల్ ప్లాంట్ పర్యటనలో కేంద్ర మంత్రి హెచ్డీ కుమార స్వామి బిజీబిజీగా గడిపారు. ఆయనతో పాటు.. ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ కూడా ఉన్నారు. ఈ సందర్భంగా.. ఆర్ఐఎన్ఎల్ (RINL) డైరెక్టర్లు, ఉన్నతాధికారులతో ప్లాంట్ వాస్తవ పరిస్థితులపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.
ఏపీలో రిజిస్ట్రేషన్ శాఖ సర్వర్లు మొరాయిస్తున్నాయి. ఫిబ్రవరి 1 నుంచి కొత్త మార్కెట్ ధరలు అమలు కానున్న నేపథ్యంలో రిజిస్ట్రేషన్ల కార్యాలయాలకు ఇవాళ తాకిడి పెరిగింది. దీంతో సీఎఫ్ఎంఎస్ పోర్టల్ ఓపెన్ కాకుండా సర్వర్లు మొరాయిస్తున్నాయి.
సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో 15 ప్రాజెక్టులకు సంబంధించి రూ. 44,776 కోట్ల పెట్టుబడులకు ఎస్ఐపీబీ ఆమోదం తెలిపింది. ఈ పెట్టుబడుల ద్వారా 19,580 ఉద్యోగాల కల్పన జరుగనుంది.
ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. బడ్జెట్ సమావేశాల్లో ప్రవేశపెట్టే పలు బిల్లులు, ప్రభుత్వ అజెండాపై అఖిలపక్ష నేతలకు కేంద్రం వివరించింది. పార్లమెంటు సమావేశాలు సజావుగా సాగేందుకు సహకరించాలని, కీలక బిల్లుల ఆమోదానికి మద్దతు తెలపాలని అఖిలపక్ష నేతలను ప్రభుత్వం కోరింది. అఖిలపక్ష సమావేశానికి టీడీపీ తరపున బీద మస్తాన్ రావు, వైసీపీ తరపున మిథున్ రెడ్డి, జనసేన తరపున బాలశౌరి హాజరయ్యారు.