అండర్-19 మహిళల క్రికెట్ వరల్డ్ కప్ సాధించి రెండోసారి విశ్వవిజేతగా నిలిచిన భారత జట్టుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున హోంమంత్రి వంగలపూడి అనిత అభినందనలు తెలిపారు. మేటి జట్లను మట్టి కరిపించి త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించిన అద్భుతమైన సందర్భంలో మన తెలుగు తేజాలు.. విశాఖకు చెందిన షబ్నమ్ షకీల్, తెలంగాణకు చెందిన గొంగడి త్రిష పాత్ర మరువలేనిదని కొనియాడారు.
సీఎం చంద్రబాబు రాయచోటి పర్యటనపై వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి స్పందించారు. ముఖ్యమంత్రి పర్యటన రాయచోటి నియోజకవర్గ ప్రజలకు నిరాశ మిగిల్చిందని ఆరోపించారు.
అండర్-19 ఉమెన్స్ వరల్డ్ కప్ విజేతగా భారత్ నిలిచింది. వరుసగా రెండోసారి అండర్-19 వరల్డ్ కప్ గెలిచింది భారత్.. 9 వికెట్ల తేడాతో భారత జట్టు విజయం సాధించింది. 11.2 ఓవర్లలోనే 83 పరుగుల టార్గెట్‌ను భారత్ బ్యాటర్లు రీచ్ అయ్యారు. బ్యాటింగ్, బౌలింగ్‌లోనూ భారత జట్టు దుమ్మురేపింది.
టీడీపీ దిగజారుడు రాజకీయాలు చేస్తోంది టీడీపీ ప్రభుత్వంపై మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. టీడీపీ దిగజారుడు రాజకీయాలు చేస్తోందని.. పార్టీ ఫిరాయింపులను టీడీపీ నాయకులు ప్రోత్సహిస్తున్నారన్నారని మండిపడ్డారు. గుంటూరులో అంబటి మీడియాతో మాట్లాడారు. ‘‘కేవలం 11 స్థానాలు గెలిచిన కూటమి ఎలా స్థాయి సంగం ఎన్నికల్లో పోటీ చేస్తుంది. ఇప్పటికే నలుగురికి పచ్చ కండువాలు వేసేశారని.. టీడీపీ పెట్టిన క్యాంప్‌లో ఫ్యాన్ గుర్తుపై గెలిచిన కార్పొరేటర్లు ఉన్నారు. మేము కోడి పిల్లలను…
కేంద్ర బడ్జెట్‌పై ఏపీ ఆర్ధికశాఖ అలెర్ట్.. కేంద్ర బడ్జెట్‌పై ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక శాఖ అలెర్ట్ అయ్యింది.. బడ్జెట్ లో రాష్ట్రానికి వస్తున్న ప్రయోజనాలు.. నిధులకు సంబంధించి మద్యాహ్నం 3 గంటలలోగా నివేదిక ఇవ్వాలని అన్నిశాఖలకు ఆర్ధికశాఖ సూచనలు చేసింది.. అన్ని శాఖల నుంచి సమాచారం వచ్చిన తర్వాత.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు నివేదిక ఇవ్వనుంది ఆర్థిక శాఖ.. ఆంధ్రప్రదేశ్ లో నదుల అనుసంధానానికి కేంద్రాన్ని నిధులు కోరింది ఏపీ ఆర్ధిక శాఖ. తుఫాన్లు, రాయలసీమ ప్రాంతంలో…
ఐదు రోజుల్లో ఓటింగ్.. ఆప్‌కి భారీ ఎదురు దెబ్బ.. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆమ్ ఆద్మీ పార్టీకి (ఆప్) గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఓటింగ్‌కు ఐదు రోజుల ముందు ఏడుగురు ఎమ్మెల్యేలు పార్టీకి రాజీనామా చేశారు. ఈ ఎమ్మెల్యేల టిక్కెట్లను పార్టీ రద్దు చేయడంతో వారిలో అసంతృప్తి నెలకొంది. రాజీనామా చేసిన ఎమ్మెల్యేలలో నరేష్ యాదవ్ (మెహ్రౌలీ), రోహిత్ కుమార్ (త్రిలోక్‌పురి), రాజేష్ రిషి (జనక్‌పురి), మదన్ లాల్ (కస్తూర్బా నగర్), పవన్ శర్మ (ఆదర్శ్…
ఎన్నికల కోడ్ సాకుతో రైతు భరోసా పథకాన్ని ఆపేందుకు కుట్ర ఎన్నికల కోడ్‌ను సాకుగా చూపిస్తూ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా పథకాన్ని నిలిపివేయాలని చూస్తోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ విమర్శించారు. రైతు భరోసా పథకం ఇప్పటికే అమలులో ఉన్న పథకమే కాబట్టి ఎన్నికల సంఘం నుంచి ఎటువంటి సమస్య ఉండదని ఆయన స్పష్టం చేశారు. పైగా రానున్న ఎన్నికలు పట్టభద్రులు, ఉపాధ్యాయులకు సంబంధించినవే కాబట్టి వాటిపై ప్రభావం పడే…
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇన్ని రోజులుగా నేను మోనంగా, గంభీరంగా చూస్తున్నా.. నేను కొడితే మాములుగా ఉండదని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్‌లో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి మంత్రి నారా లోకేష్ ఇంఛార్జి మంత్రులతో సమావేశం నిర్వహించారు. ఏపీలో జరిగే రెండు గ్రాడ్యుయేట్, ఒక టీచర్ ఎమ్మెల్సీల ఎన్నికల్లో కార్యాచరణపై లోకేష్ మంత్రులతో చర్చించారు.