ఏపీలో ఎన్నికల వేళ అధికారులు ముమ్మర తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ తనిఖీల్లో భారీగా అక్రమ మద్యం, డ్రగ్స్ పట్టుబడుతున్నాయి. సార్వత్రిక ఎన్నికల తనిఖీల్లో భాగంగా రూ.119 కోట్ల విలువైన అక్రమ మద్యం, డ్రగ్స్‌ను స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో(SEB) అధికారులు పట్టుకున్నారు.
గత నెలలో పాకిస్థాన్‌లో జరిగిన ఉగ్రదాడిలో చైనీస్ ఇంజనీర్లు హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ కేసులో నలుగురు నిందితులను అరెస్టు చేశారు. కాగా.. మార్చి 26న జరిగిన దాడిలో ఐదుగురు చైనా ఇంజనీర్లు, ఒక పాకిస్థానీ డ్రైవర్ మరణించారు. వీరంతా ఇస్లామాబాద్ నుంచి దాసు జలవిద్యుత్ ప్రాజెక్టు ప్రాంతానికి వెళ్తుండగా.. ఖైబర్ పఖ్తుంక్వా ప్రాంతంలో ఉగ్రదాడి జరిగింది.
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు మండలం లక్ష్మీపురం గ్రామంలో ఎన్నికల ప్రచారంలో ఎన్డీఏ కూటమి అభ్యర్థి కొలికపూడి శ్రీనివాసరావు పాల్గొన్నారు. లక్ష్మీపురం గ్రామంలో కొలికపూడి శ్రీనివాసరావుకు గ్రామస్థులు బ్రహ్మరథం పట్టారు.
డోన్‌లో ప్రజాగళం సభలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు నంద్యాల జిల్లా డోన్‌లో ప్రజాగళం సభలో టీడీపీ అధినేత చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. 13వ తేదీ దొంగలను పట్టుకోవడానికి సిద్ధమా అంటూ ఆయన వ్యాఖ్యానించారు. పిట్టకథల మంత్రికి, కట్టుకథల నేతలకు కాలం చెల్లిందన్నారు. అప్పులు చేసేది బుగ్గన…అప్పులు కట్టేది జనమని.. కోట్ల దెబ్బకి బుగ్గన పారిపోతాడన్నారు. విధ్వంస పాలనకు, అభివృద్ధికి ఈ ఎన్నికలు సవాల్ అంటూ ఆయన పేర్కొన్నారు. ధర్మానికి, అధర్మానికి మధ్య పోరాటమని ఆయన అన్నారు.…
సొంత ఇంటికి దారి వేయించుకోలేని వ్యక్తి ఉంగుటూరు వైసీపీ ఎమ్మెల్యే వాసు బాబు అని పవన్ కల్యాణ్ తీవ్రంగా విమర్శించారు. పేకాట నడపడం ద్వారా ఆస్తులు పోగేసుకుంటున్నారని ఆరోపించారు. పేకాటలో క్లబ్బులు నడిపే వాళ్ళు కావాలా.. డీఎస్సీ ఇచ్చే వాళ్ళు కావాలా అంటూ ప్రశ్నించారు. ఏలూరు జిల్లా ఉంగుటూరు నియోజకవర్గంలో గణపవరంలో పవన్ కళ్యాణ్ ప్రసంగించారు.
డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడిన మహిళను తప్పించేందుకు వాహనాన్ని ముందుకు తీసుకుని వెళ్తూ ఇతర వాహనాలను ఢీకొట్టి పారిపోయిన వ్యక్తిపై బంజారాహిల్స్ పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. బంజారాహిల్స్ ట్రాఫిక్ పోలీసులు ఆదివారం అర్ధరాత్రి బంజారాహిల్స్ రోడ్ నెం 14లోని స్టడీ సర్కిల్ సమీపంలో డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. అదే సమయంలో అక్కడకు వచ్చిన మహేంద్ర థార్ (టీఎస్08జేజెడ్4566)ను ఆపారు. కారు నడిపిస్తున్న మహిళకు బ్రీత్ అనలైజర్ పరీక్షలు చేయగా…
జగన్ సంభాషణ చూస్తే రాజశేఖర్ రెడ్డి గుర్తొచ్చారని.. ప్రజల నుంచి వచ్చిన రెస్పాన్స్ చూసేసరికి భావోద్వేగానికి గురయ్యానని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. అది యాక్షన్ కాదు, ఆటోమేటిక్‌గా వచ్చింది.. దానికి సమాధానం చెప్పలేనన్నారు.
అందరినీ కలుపుకొని పోయేందుకు జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యం లో సమన్వయ కమిటీ వేస్తున్నామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఇవాళ ఆయన ఖమ్మంలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గ స్థాయి కమిటీ లు వేస్తున్నామన్నారు. దేశంలో గత పది ఏళ్ల నుంచి పరిపాలన చేస్తున్న బిజెపి దేశాన్ని దోపిడీ చేసిందని, దేశంలో ప్రజాస్వామ్యాన్ని , అస్తులని కాపాడుకునేందుకు కాంగ్రెస్ కి మద్దతు ఇవ్వవల్సిన అవసరం వుందన్నారు. జనాభా దామాషా పద్ధతి లో…
ఐపీఎల్ ముగియగానే టీ20 వరల్డ్ కప్ ప్రారంభం కానుంది. 2024 జూన్ 1 నుండి వెస్టిండీస్, అమెరికాలో ఈ మెగా టోర్నీని నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉంటే.. మే 1తో జట్టు ప్రకటన గడువు ముగియనుంది. దీంతో ఈరోజు లేదా రేపు జట్టు ప్రకటించే అవకాశముంది. అయితే.. టీమిండియాలో వికెట్ కీపర్ గా సంజూ శాంసన్ కే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. మరోవైపు.. అతనికి పోటీగా రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్ వంటి స్టార్ ఆటగాళ్లు…