LPG Gas prices: చమురు మార్కెటింగ్ కంపెనీలు వాణిజ్య ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ల ధరలను తగ్గించాయి. 19 కేజీల కమర్షియల్ ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ల ధరపై రూ.19 తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి. సవరించిన ధరలు నేటి నుంచి అమల్లోకి వచ్చాయి. 19 కిలోల కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్ ధర దిల్లీలో రూ.1,745.50గా ఉంది. గత ఏడాది మే నెలతో పోల్చి చూస్తే.. ఈసారి సిలిండర్ ధరలు దిగి వచ్చాయి. 2023 మే నెల ఆరంభంలోనే సిలిండర్ ధర ఏకంగా రూ. 172 మేర తగ్గింది. అయితే, ఈ తగ్గుదల కేవలం కమర్షియల్ గ్యాస్ సిలిండర్‌కు మాత్రమే వర్తిస్తుందని ఆయిల్ కంపెనీలు తెలిపాయి. డొమెస్టిక్ సిలిండర్ ధర మాత్రం ఎలాంటి మార్పు లేదని చెప్పాయి.
Read Also: T20 World Cup 2024: రాహుల్ ద్రవిడ్ రాజకీయం.. రుతురాజ్ గైక్వాడ్‌కు అన్యాయం!
ఇక, దేశంలోని నాలుగు మెట్రో నగరాల్లో వరుసగా రెండో నెల కూడా వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధరలు తగ్గించారు. దేశ రాజధాని ఢిల్లీ, ముంబై, చెన్నైలలో వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర 19 రూపాయలు తగ్గింది. అలాగే, కోల్‌కతాలో వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర ఒక్కో గ్యాస్ సిలిండర్‌పై రూ.20 తగ్గింపుతో రూ.1859కి చేరింది. ఈ క్రమంలో 19 కిలోల ఇండియన్ ఎల్‌పీజీ సిలిండర్ ధర హైదరాబాద్‌లో రూ.32.50 తగ్గి రూ.1994.50కు చేరుకుంది. అయితే, ఉజ్వల స్కీమ్ కింద బెనిఫిట్ పొందే వారికి మాత్రం సిలిండర్ కేవలం 502 రూపాయలకే లభిస్తోందని చెప్పుకోవచ్చు. వీరికి 300 రూపాయల వరకు సబ్సిడీ దొరుకుతుంది.