ములుగు జిల్లాలో విషాదం.. నదిలో మునిగి బాలిక మృతి ములుగు జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఎండలు తాళలేక తండ్రి, కూతురు గోదావరి స్నానానికి వెళ్లారు. స్నానం చేస్తుండగా తండ్రి నదిలో మునిగిపో సాగాడు. దీంతో భయాందోళన చెందిన కుమార్తె నిఖిత (14) సాయం చేసేందుకు.. తన తండ్రికి చెయ్యి అందించబోయింది. అంతే ప్రమాదశాత్తు గోదావరిలో మునిగిపోయి ప్రాణాలు వదిలింది. తండ్రి రాజేందర్ మాత్రం ప్రాణాలతో క్షేమంగా బయటపడ్డాడు. మంగపేట (మం) కమలాపురంలో ఈ ఘటన చోటుచేసుకుంది.…
కరీంనగర్ జిల్లాలోని జమ్మికుంటలో నిర్వహించిన జనజాతర సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్ ఇక్కడకు వలస వస్తే తెలంగాణ వాదం కోసం గెలిపించారని, పాలమూరుకు వస్తే మేమూ గెలిపించామన్నారు. గత అసెంబ్లీ ఎన్నికలు సెమీఫైనల్స్ మాత్రమేనని, ఇప్పుడు జరిగేవి ఫైనల్స్… సెమీస్ లో కేసీఆర్ ని చిత్తు చిత్తుగా ఓడించారన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ ఎన్నిక్కల్లోనూ బిఅరెస్ బీజేపీ లను ఓడించాలని, విభజన హామీలను అమలు…
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర మంత్రి అమిత్ షాకు సంబంధించిన ఓ ఫేక్ వీడియో వైరల్గా మారింది. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడితే రాజ్యాంగ విరుద్ధమైన ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లను రద్దు చేస్తామంటూ ఆయన చెబుతున్నట్లు ఆ వీడియోలో ఉంది. కాగా.. ఈ ఫేక్ వీడియోపై బీజేపీ వెంటనే చర్యలు తీసుకుంది. ఈ నకిలీ వీడియోపై హోం మంత్రిత్వ శాఖకు ఫిర్యాదు చేసింది. చౌకబారు రాజకీయాలు చేస్తూనే కాంగ్రెస్ ఈ కుట్ర పన్నిందని బీజేపీ…
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ల పర్వం ముగియడంతో అన్ని పార్టీలు ప్రచారంలో దూకుడు పెంచాయి. నేతలు నియోజకవర్గాల్లో జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. మంత్రి దాడిశెట్టి రాజా తనదైన శైలిలో ప్రచారంలో దూసుకెళ్తున్నారు.
ఈ ఎన్నికల్లో మోడీకే వేస్తామని ప్రజలు అంటున్నారు… దేశ భవిష్యత్, మా భవిష్యత్ ముఖ్యం అని అంటున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. ఇవాళ జహీరాబాద్లో నిర్వహించిన బీజేపీ బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాలకు గ్రామాలు తీర్మానం చేసుకుంటున్నాయని, బీజేపీ బలపడుతుంటే కాంగ్రెస్, BRS గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయన్నారు కిషన్ రెడ్డి. రేవంత్ రెడ్డి మీ పార్టీ వల్ల బీసీ లకు అన్యాయం జరుగుతుంది… గ్రేటర్ కార్పొరేషన్…
కాంగ్రెస్ పార్టీ స్కాంల మీదగా నడిచే పార్టీ అని విమర్శించారు బీజేపీఎల్పీ మహేశ్వర్ రెడ్డి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పథకాల పైన నడిచే పార్టీ బీజేపీ అని ఆయన అన్నారు. 100 రోజుల్లో అరు పథకాలు ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ ఏ ఒక పథకంమైన అమలు చేశారా అని ఆయన ప్రశ్నించారు. ప్రజలకు మోసం చేసి గద్దె నెక్కిన నాయకుడు రేవంత్ అని, ఎన్నికల్లో ప్రజలకు పథకాల ఇస్తామని ఓట్లు దండుకున్నారని ఆయన అన్నారు.…
లండన్ (లండన్ స్టబ్)లో చాలా ఆశ్చర్యకరమైన కేసు వెలుగులోకి వచ్చింది. నార్త్-ఈస్ట్ లండన్లో ఓ వ్యక్తి కత్తితో ప్రజలు, పోలీసులపై దాడి చేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దాడికి పాల్పడే ముందు దుండగుడు తన కారును ఓ ఇంట్లోకి తీసుకెళ్లి.. అక్కడున్న వారిపై దాడి చేశాడని పేర్కొన్నారు. కాగా.. 36 ఏళ్ల నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అంతకుముందు కూడా ఆ వ్యక్తి చాలా మంది వ్యక్తులు, పోలీసులపై దాడికి పాల్పడ్డాడు.
ప్రస్తుతం ఉన్న పథకాలన్నీ కొనసాగిస్తామని.. చంద్రబాబుకు ఓటేస్తే నష్టమని.. పథకాలన్నీ ఆపేస్తాడని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి విమర్శించారు. చంద్రబాబు నాయుడు వయసు 75 దాటింది, ఈ జీవితంలో వెన్నుపోట్లు మోసాలతో జీవితం గడిచిపోయిందని.. ఇప్పటికైనా ఆయన జీవితంలో పశ్చాతాపం లేదని జగన్ వ్యాఖ్యానించారు.
రాహుల్ గాంధీ దేశానికి కాబోయే ప్రధాని అని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అమిత్ షా..మోడీల ఆదేశాల మేరకు గాంధీ భవన్ కి ఢిల్లీ పోలీసులు అని, రాజస్థాన్ లో మోడీ మాట్లాడిన మాటలు ఆధారాలు చూపెట్టాలి..లేదంటే ముక్కు నేలకు రాయాలన్నారు జగ్గా రెడ్డి. ఎన్నికల కమిషన్ బీజేపీ జేబు సంస్థగా వ్యవహరిస్తోందని, మోడీకి ఎందుకు ఎన్నికల కమిషన్ నోటీసులు ఇవ్వలేదన్నారు జగ్గారెడ్డి. రేవంత్ ని తిడితేనే హరీష్ ని…