ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఎన్డీఏ కూటమి మేనిఫెస్టోను విడుదల చేసింది. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో టీడీపీ-బీజేపీ-జనసేన కూటమి ఉమ్మడి మేనిఫెస్టోను మూడు పార్టీల నేతలు ఆవిష్కరించారు. ఉమ్మడి మేనిఫెస్టో చంద్రబాబు, పవన్ కల్యాణ్, సిద్జార్థ్ నాథ్ సింగ్‌లు విడుదల చేశారు.
లైట్ బీర్ల పొరాటంలో విజయం సాధించాడు తాగుబోతుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు. మంచిర్యాల జిల్లాలో తాగుబోతుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు కొట్రంగి తరుణ్ బీర్ల కోసం చేసిన పోరాటంలో విజయం సాధించారు.
Operation Chirutha: శంషాబాద్ ఎయిర్‌పోర్టు రన్‌వేపై చిరుత కలకలం సృష్టించిన విషయం తెలిసిందే.. చిరుతను పట్టుకునేందుకు అటవీశాఖ అధికారులు రెండు రోజులుగా శ్రమిస్తున్నారు.
ఐపీఎల్ 2024లో భాగంగా.. ఢిల్లీతో జరిగిన మ్యాచ్ లో కోల్‌కతా విజయం సాధించింది. 154 పరుగుల లక్ష్యాన్ని 16.3 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి సాధించింది. కోల్‌కతా బ్యాటింగ్ లో ఫిల్ సాల్ట్ (68) రన్స్ చేయడంతో కేకేఆర్ అలవోకంగా విజయం సాధించింది. కోల్‌కతా బ్యాటింగ్ లో సునీల్ నరైన్ (15), రింకూ సింగ్ (11) పరుగులు చేశారు. ఆ తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన శ్రేయాస్ అయ్యర్ (33*), వెంకటేష్ అయ్యర్ (26*) పరుగులతో రాణించడంతో…
పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వచ్చే నెల 8న కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రచారం నిర్వహించే అవకాశముంది. ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం నుండి రాష్ట్ర కార్యాలయానికి సమాచారం పంపింది. పార్టీ వర్గాల సమాచారం మేరకు… ఆరోజు ఉదయం కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని వేములవాడలో పర్యటిస్తారు. ప్రధాని రాక సమాచారాన్ని అందుకున్న జిల్లా నాయకత్వం సభాస్థలి, ఏర్పాట్లపై ద్రుష్టి సారించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తొలిసారి వేములవాడ రానున్న నేపథ్యంలో దక్షిణ…
దక్షిణ అమెరికా పెరూలో ఘోర ప్రమాదం జరిగింది. బస్సు నదిలో పడి 23 మంది మృతి చెందారు. ఈ ఘటన సోమవారం జరిగింది. ప్రమాదవశాత్తు బస్సు నదిలో పడటంతో ప్రయాణికులంతా నదిలో మునిగిపోయారు. అయితే ఈ ప్రమాదంలో ఎంతమంది మృతి చెందారనే సమాచారం ఇంకా తెలియరాలేదు.
శంషాబాద్ ఎయిర్‌పోర్టు రన్‌వేపై చిరుత కలకలం సృష్టించింది. దీంతో అప్రమత్తమైన అధికారులు ఎయిర్‌పోర్టు పరిసరాల్లో హై అలర్ట్ ప్రకటించారు. చిరుతను బంధించేందుకు మొత్తం 9 ట్రాప్ కెమెరాలతో పాటుగా ఒక బోన్‌ను సైతం ఏర్పాటు చేశారు. అయితే ఆ ట్రాప్ కెమెరాల్లో సైతం చిరుత కదలికలు స్పష్టంగా రికార్ట్ అయ్యాయి. అదే చిరుత రన్‌వే పైకి వచ్చిందని జిల్లా అటవీ శాఖ అధికారి విజయానంద్ తెలిపారు. కొన్ని నెలల క్రితం షాద్‌నగర్ ప్రాంతంలోనూ చిరుత కనిపించింది. ఇప్పుడే…
అమెరికా నుంచి కాదు కదా.. అంతరిక్షం నుండి వచ్చినా గుడివాడలో నన్ను ఓడించలేరని ఎమ్మెల్యే కొడాలి నాని పేర్కొన్నారు. కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గంలో నందివాడ మండలంలో కొడాలి నాని ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఐపీఎల్ 2024లో భాగంగా.. కోల్‌కతాతో జరుగుతున్న మ్యాచ్ లో ఢిల్లీ 153 పరుగులు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి ఓ మోస్తారు స్కోరును సాధించింది. ఢిల్లీ భారీ స్కోరు చేయకుండ ఉండేందుకు కేకేఆర్ బౌలర్లు శ్రమించడంతో పరుగులను కట్టడి చేశారు. ఢిల్లీ బ్యాటింగ్ లో స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ అత్యధికంగా (35*) పరుగులు చేశాడు. ఆ తర్వాత కెప్టెన్ రిషబ్ పంత్ (27) పరుగులు సాధించాడు.
ఉస్మానియా యూనివర్సిటీలో విద్యుత్తు, తాగునీటి కొరత ఉందంటూ చీఫ్ వార్డెన్ తప్పుడు ప్రకటన చేశారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు తెలిపారు. ఉస్మానియా యూనివర్సిటీలో విద్యుత్తు, తాగునీటి కొరత అంటూ కొంతమంది ప్రకటనలు ఇవ్వడం, సోషల్ మీడియాలో వైరల్ చేయడంతో తాను విచారణకు ఆదేశించినట్టు తెలిపారు. వెను వెంటనే విచారణ చేసిన అధికారులు విద్యుత్ సరఫరా లో ఎలాంటి అంతరాయం లేదని ప్రాథమిక నివేదికలో స్పష్టం చేశారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. తాగునీరు,…