ఒక వ్యక్తి కారు బైక్ లో పెట్టకుండా తన చొక్కాలు 20 లక్షల నగదు 27 తులాల బంగారం తీసుకుని వెళ్ళవచ్చా ఏమో కానీ ఈ యువకుడు తన చొక్కాలో దాచిపెట్టుకొని అంత పెద్ద మొత్తంలో డబ్బుని తీసుకు వెళుతు వుండగా పోలీసులు పట్టుకున్నారు.పుష్ప సినిమా తరహాలో డబ్బులని చొక్కల్లో దాచుకున్న యువకుడు పట్టుబడిన వైనం ఇది. ఖమ్మం జిల్లా రూరల్ పోలీస్ స్టేషన్లో పరిధిలో ఘటన జరిగింది. గత రాత్రి పోలీసులు తనిఖీలు చేస్తుంటే ఒక…
పెళ్లంటే ఎంతో హడవిడి ఉంటుంది. అనుకున్న సమయానికి పెళ్లి జరగాలని తల్లిదండ్రులు కోరుకుంటారు. అందుకోసం పెళ్లి ఏర్పాట్లు చకాచకా కానిస్తారు. కానీ.. ఇక్కడ ఓ వింత ఘటన జరిగింది. వరుడు మద్యం తాగి ఆలస్యంగా వచ్చాడని వధువు వివాహాన్ని రద్దు చేసింది. ఈ ఘటన బీహార్‌లోని కటిహార్‌లో జరిగింది. అంతేకాకుండా.. పెళ్లి ఏర్పాట్ల కోసం ఖర్చైన రూ. 4 లక్షలు ఇవ్వాలని వరుడు తల్లిదండ్రులను డిమాండ్ చేసింది.
మధ్యప్రదేశ్‌లో ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన రాంనివాస్ రావత్ మంగళవారం బీజేపీలో చేరడంతో కాంగ్రెస్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రాంనివాస్ రావత్ దిగ్విజయ్ సింగ్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. గతంలో మధ్యప్రదేశ్ కాంగ్రెస్ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఉన్నారు.
ఏలూరు జిల్లా దెందులూరు ప్రజాగళం సభలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. తండ్రి ఆశయాలు నెరవేర్చేందుకు నిరంతరం శ్రమిస్తున్న వ్యక్తి వంగవీటి రాధా అని.. ఆయన సేవలు ఈ రాష్ట్రానికి అవసరమని, తగిన గుర్తింపు ఇస్తామన్నారు. దెందులూరులో చింతమనేని అభిమానులు ఎక్కువ ఈలలు వేస్తారు తక్కువ పని చేస్తారు.. ఇకనుంచి ఎక్కువ పని చేయాలన్నారు.
జహీరాబాద్‌లో నేడు బీజేపీ నిర్వహించిన భారీ బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ.. నా తెలంగాణ కుటుంబ సభ్యులందరికి నమస్కారం. కేతకి సంగమేశ్వర, ఏడుపాయల దుర్గా అమ్మవారు, బసవేశ్వరునికి నమస్కారం అంటూ ప్రసంగాన్ని ప్రారంభించారు. పదేళ్లుగా ఎన్డీఏ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని చూశారని, కాంగ్రెస్ మళ్లీ పాతరోజులు తెచ్చేందుకు ప్రయత్నిస్తోందన్నారు. గతంలో కాంగ్రెస్ చేతిలో దేశం అవినీతిమయం అయిపోయిందని ప్రధాని మోడీ అన్నారు. బీఆర్ఎస్ లూటీ చేస్తే ఇప్పుడు కాంగ్రెస్…
పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ రోజు చేవెళ్ల పార్లమెంట్ పరిధిలోని వికారాబాద్ నియోజకవర్గం మోమిన్ పేట్ మండలం కేంద్రంలో నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన రోడ్ షో కార్యక్రమంలో అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తో కలిసి, కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం ఏజ్ఆర్ గార్డెన్ లో జరిగిన కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సమావేశంలో పాల్గొన్నారు.
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పిటిషన్‌పై వరుసగా రెండో రోజు విచారణ జరిగింది. కేజ్రీవాల్‌ను అరెస్టు చేసిన సమయంపై సుప్రీంకోర్టు మంగళవారం ప్రశ్నలు లేవనెత్తింది. సార్వత్రిక ఎన్నికలకు ముందు కేజ్రీవాల్‌ను అరెస్టు చేయడంపై సుప్రీంకోర్టు ఈడీని సమాధానం కోరింది.
కోచింగ్ ఇనిస్టిట్యూట్‌లో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం వరకు తరగతులు, రాత్రిపూట స్వీయ చదువులు, వారానికి ఒకటి రెండుసార్లు పరీక్షలు, తల్లిదండ్రుల అంచనాలు, తోటివారితో పోటీ ఒత్తిడితో విద్యార్థులు ఆత్మహత్యల దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ ఏడాది నాలుగు నెలల్లో ఐదుగురు విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. తాజాగా.. మూడు రోజుల్లో ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. గతేడాది 29 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. ముగ్గురు విద్యార్థులు అదృశ్యమయ్యారు.
న్డీఏ కూటమి మేనిఫెస్టోపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీ-జనసేన మేనిఫెస్టోపై మోడీ ఫొటో పెట్టవద్దని ఢిల్లీ నుంచి వాళ్లకు ఫోన్ వచ్చిందని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. ముగ్గురు కూటమిలో ఉండి.. ముగ్గురి ఫోటోలను మేనిఫెస్టోలో పెట్టుకునే పరిస్థితి చంద్రబాబుకు లేదన్నారు.
ఎండల తీవ్రతతో సతమవుతున్న ఓ ఉపాధ్యాయుడు వినూత్న ఆలోచన చేశారు. ఎండలబారి నుండి రక్షించుకునేందుకు తరగతి గదినే స్విమ్మింగ్ పూల్‌గా మార్చాడు. ఈ ఘటన యూపీలో చోటు చేసుకుంది. ఉత్తరప్రదేశ్‌లోని వివిధ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్‌కు పైగా పెరిగాయి. తీవ్ర ఎండలతో అక్కడి జనాలు సతమతమవుతున్నారు. ఈ క్రమంలో.. పాఠశాల విద్యార్థులు ఎండల నుంచి ఉపశమనం పొందడానికి తరగతి గదుల్లో ఒకదానిని తాత్కాలిక స్విమ్మింగ్ పూల్‌గా మార్చాడు ఉపాధ్యాయుడు.