కొమురం భీం జిల్లాలోని నిర్వహించిన సభలో మంత్రి సీతక్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. ఈనెల 5 వ తేదీన నిర్మల్ కు రాహుల్ గాంధీ వస్తున్నారని, బహిరంగ సభలో రాహుల్ పాల్గొంటారన్నారు. ఆసిఫాబాద్ లో సిఎం రేవంత్ రెడ్డి సభ సక్సెస్ అయిందని, అనేక ప్రాజెక్టులు , రోడ్లు ఇతర సమస్యల పై ప్రత్యేక దృష్టి పెడతామన్నారు. బీజేపి సిద్దాంతమే మనుధర్మంది అని, మేము చెప్పేది ప్రజల్లోకి వెళ్ళిందన్నారు మంత్రి సీతక్క. బీజేపి మనస్సు నిండా మనువాదమేనని, బీజేపి వాళ్ల రాజ్యాంగమే మన ధర్మశాస్త్రమన్నారు. ఓడిపో బోతున్నారు కాబట్టి ఆర్ ఎస్ ఎస్ వాళ్ల తో ఏదో చెప్పించారని, అందుకే మమ్మల్నీ భయ పెట్టాలని చూస్తున్నారని ఆమె అన్నారు. అందులో భాగంగానే సమన్లు అని, కాంగ్రెస్ పార్టీ వీక్ ఉన్న చోట చేర్పింకుంటున్నామన్నారు.
అధిష్టానం నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉండాలని, గాంధీ భవన్ లో కండువాలు కప్పి న నేతల ప్రక్రియ నిలిపి వేయలేదన్నారు. అధిష్టానం నిర్ణయం కట్టుబడి ఉండాలని, ఏదైనా అంతర్గత సమస్యలు ఉంటే పరిష్కరించుకోవాలన్నారు మంత్రి సీతక్క. బీజేపీ పేదల పార్టీ కాదని, కార్పొరేట్ వ్యవస్థకు దోచిపెట్టే పార్టీ అని మను ధర్మ సిద్ధాంతం పాటించే పార్టీని ఎద్దేవా చేశారు. కేసీఆర్ అధికారం కోల్పోయిన ఇంకా అధికార మత్తులోనే జీవిస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో ఏ సమస్య లేవని, పదవి దిగిన తర్వాత అన్ని సమస్యలు వచ్చాయని కేసీఆర్ చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. దేశంలోని బడుగు బలహీన వర్గాల సంక్షేమాన్ని కోరేది కాంగ్రెస్ పార్టీ అని కాంగ్రెస్ కు ఓటు వేసి రాహుల్ గాంధీని ప్రధాని కుర్చీలో కూర్చో బెట్టాలని ప్రజలను కోరారు.