మండుటెండలో సుడిగాలి పర్యటన చేస్తూ బీఆర్ఎస్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ గెలుపే లక్ష్యంగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా జరిగిన సభల్లో సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ… కేసీఆర్ బస్సు యాత్రకు అన్యుహ్య స్పందన వస్తుందని 12 సీట్లలో బీఆర్ఎస్ గెలుస్తుందని నివేదికలు రావటంతో బీజేపీ-కాంగ్రెస్ కుమ్మక్కై కేసీఆర్ 48 గంటలు ప్రచారాన్ని అడ్డుకుంటున్నారన్నారు. 5 నెలల్లో రేవంత్ పరిపాలన చూసి కేసీఆర్‌ని ఎందుకు వదులుకున్నాం అని నేడు ప్రజలు బాధపడుతున్నారన్నారు. కేసీఆర్ పాలనలో రెప్పపాటు కరెంట్ పోకుండే… ఇపుడు తరుచూ పోతుందన్నారు. మోడీ,రేవంత్ రెడ్డిలు ఎన్నికల ప్రచారాల్లో మాట్లాడింది కనిపించటం లేదా అని ప్రశ్నించారు. 96 బీసీ కులాలను ఏకం చేసిన గొప్ప నాయకులు కాసాని జ్ఞానేశ్వర్ ని గెలిపించుకుని సత్తా చాటాలన్నారు. పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా కోసం పార్లమెంట్ లో గట్టిగా పోరాటం చేస్తారన్నారు. కేసీఆర్ తయారు చేసిన ఇద్దరు నేతలే కాసాని జ్ఞానేశ్వర్ కి పోటీగా వస్తున్నారని, వారిద్దరికీ ఓటుతో బుద్ధి చెబుతాం అన్నారు. 2 లక్షల రుణమాఫీ,4 వేల పెన్షన్, రైతు బంధు ఎకరాకు 15 వేలు డిసెంబర్ 9 నాడే ఇస్తామని నేటికి ఇవ్వలేదని, గతంలో ఇచ్చిన రైతు బంధు కూడా నాలుగు, ఐదు ఎకరాల వరకే ఇచ్చారని, పెన్షన్లు రెండు వేల రూపాయలే ఇచ్చి ఒక నెల 25 వ తేదీన, మరొక నెల ఇవ్వనే లేదన్నారు. ప్రజలంతా కసిగా కారు గుర్తుకు ఓటు వేసి అబద్ధాల ప్రచార కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాలన్నారు.ఆగస్ట్ 15 వ తేదీన 2 లక్షల రుణమాఫీ చేస్తామని దేవుళ్ళ మీద ముఖ్యమంత్రి ఒట్టు వేస్తున్నారని, ఆ మాటలను ప్రజలు నమ్మటం లేదన్నారు.
కేంద్ర బీజేపీ ప్రభుత్వం పదేళ్లు ఏమి చేయలేదని, మోడీని చూసి ఓట్లు వేయమని బీజేపీ అభ్యర్థి అభ్యర్థిస్తున్నారని పేర్కొన్నారు. ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఎక్కడ అని, ఒక్క విద్యాలయం ఇవ్వలేదని, పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా ఇవ్వలేదని విమర్శించారు. కళ్యాణాలక్ష్మి లక్షతో పాటు తులం బంగారం ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందన్నారు. పాలన అనుభవం లేక రాష్టం అస్త్యవ్యస్తంగా మారిందని, 200 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, 24 గంటల్లో జాబితా ఇవ్వమంటే 4 గంటల్లోనే ఇచ్చిన నేటికి స్పందన లేదన్నారు. కేసీఆర్ కష్టాల్లో ఉన్న రైతుల వద్దకు వెళ్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్టేడియంలో క్రికెట్ మ్యాచ్ చూస్తున్నారని,ప్రజల పట్ల, రైతుల పట్ల ఆయనకు ఉన్న చిత్తశుద్ధికి ఇదే నిదర్శనం అన్నారు. పచ్చని అడవులను పాడు చేసే రాడార్ వ్యవస్థను గతంలో కేసీఆర్ అడ్డుకుంటే నేడు ప్రభుత్వం తీసుకువచ్చే ప్రయత్నం చేస్తుందన్నారు.