కొమురంభీం జిల్లాలో నిర్వహించిన జనజాతర సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఆదివాసీలపై బీజేపీ, బీఆర్ఎస్ లకు ప్రేమ లేదన్నారు. ఆదివాసీల సమస్యల్ని పట్టించు కోలేదని ఆయన మండిపడ్డారు. సోయం బాపూరావు సమస్యలు పరిష్కరించాలని బీజేపీ కేంద్ర మంత్రుల చూట్టూ తిరిగినా పట్టించు కోలేదని, ఆఖరికి బీజేపీ సిట్టింగ్ ఎంపీ అయిన సోయం బాపు రావు కు టికెట్ ఇవ్వకుండా అవమానించిందని ఆయన విమర్శించారు. ఆత్రం సుగుణకు అవకాశం ఇవ్వండి మీకోసం పనిచేస్తుందని, ఆదిలాబాద్ అంటే నాకు అభిమానమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అందుకే యూనివర్శిటి ఇస్తా అని హమీ ఇచ్చానని, ఇంద్రవెల్లి అమరుల కుటుంబాలను ఆదుకున్నామన్నారు. పేదలను ఆదుకునే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమన్నారు. 1881 నుంచి జనాభా లెక్కలు చెయ్యడం విధానం ఉందని, బీజేపి అధికారం లోకి వచ్చాక జనాభా లెక్కించ లేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. 2021 జనాభా లెక్కించ కుండా మోడీ, అమిత్ షా కుట్ర చేసారని, బలహీన వర్గాల కుల గణగణ చేయాలనే డిమాండ్ వచ్చిందని, జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు పెంచే తప్పని సరి పరిస్తితి వస్తుందని జనాభా లెక్కించలేదన్నారు.
అంతేకాకుండా..’రిజర్వేషన్ ల రద్దుకు తీవ్రంగా ప్రయత్నం చేస్తుంది బీజేపి. ఈ ఎన్నికల్లో బిజేపి కి 400 సీట్లు వస్తె ఎస్ సి ఓబీసీ రద్దు కు కుట్ర చేస్తుంది. మీరూ బిజెపికి ఓటు వేస్తే మీ వేసే ప్రతి ఓటు రిజర్వేషన్ ల పై పోటు గా మారుతుంది. ఇవ్వన్నీ మాట్లాడుతుంటే డిల్లీ పోలీసుల తో సమన్లు ఇప్పించారు. న్నో కేసులు అయ్యాయి.. అయినా భయపడలేదు. మీ రు అండగా ఉంటే డిల్లి సుల్తాన్ లను ఎదురుస్తాం. ఢిల్లీ సుల్తానుల ఆటలు సాగానివ్వం. బయ్యారంఅడిగితే గాడిద గుడ్డు ఇచ్చారు. బీజేపి ఏమి ఇచ్చింది అంటే గాడిద గుడ్డు ఇచ్చారు అంటూ జనం తో పలికించిన రేవంత్ రెడ్డి. బీజేపీకికి కర్రు కాల్చి వాత పెడుతాం.’ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.