గతంలో ఎన్నడూ లేని విధంగా బీర్ మరియు మద్యం సరఫరా కొరతను పరిష్కరించేందుకు జోక్యం చేసుకోవాలని తెలంగాణ వైన్ డీలర్స్ అసోసియేషన్ ప్రొహిబిషన్ & ఎక్సైజ్ శాఖకు లేఖ రాసింది. కమీషనర్, ప్రొహిబిషన్ & ఎక్సైజ్‌కి ఒక పిటిషన్లో, అసోసియేషన్ ఇలా పేర్కొంది, “తెలంగాణ అంతటా మద్యం మరియు బీర్ సరఫరా కొరత యొక్క క్లిష్టమైన సమస్య, ముఖ్యంగా రిటైలర్లను ప్రభావితం చేస్తుంది. మార్చి 2024 నుండి, మా డిపోలకు స్టాక్‌ల సరఫరా క్రమంగా తగ్గుతోంది, ఇది…
వర్షాన్ని సైతం లెక్కచేయకుండా అరకు పార్లమెంట్ ఉమ్మడి అభ్యర్థిని కొత్తపల్లి గీత ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. మంగళవారం నాడు జరిగిన ఎన్నికల ప్రచారంలో భాగంగా రంపచోడవరం నియోజకవర్గం గంగవరం మండలం ముల్లేరు గ్రామంలో ప్రచార రథం నుండి ఓటర్లనుద్దేశించి ప్రసంగించారు. గ్రామంలో రాములవారి గుడి ఆవరణలో మాట్లాడుతూ.. కూటమి పార్టీల నాయకులకు, కార్యకర్తలకు, ప్రజలకు శిరస్సువంచి పాదాభివందనం చేస్తున్నానని తెలిపారు. అనకాపల్లిలో సోమవారం జరిగిన ప్రధాని బహిరగసభ వేదికపై ప్రధాని నరేంద్రమోడీ తన గెలుపుకు మద్దతుగా తలపై…
ఏపీలో చల్లబడ్డ వాతావరణం.. పలు ప్రాంతాల్లో వర్షం తీవ్ర ఎండలకు అల్లాడిపోతున్న ఏపీ జనం ఒక్కసారిగా ఊపిరిపీల్చుకున్నారు. రాష్ట్రంలో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. దీంతో.. ప్రజలు వేడిమి నుంచి ఉపశమనం పొందుతున్నారు. కొన్ని చోట్ల వాతావరణం చల్లబడగా.. మరికొన్ని చోట్ల వర్షం కురుస్తుంది. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో రెండు గంటల పాటు ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురిసింది. దీంతో.. నగరం అతలాకుతలం అయ్యింది. కొద్ది రోజులుగా 45 డిగ్రీల ఉష్ణోగ్రతో వడగాల్పులకు ఇబ్బంది పడిన ప్రజలు…
బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు రైతుల నోట్లో మట్టికొట్టాయని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ధ్వజమెత్తారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల దుష్ట రాజకీయ పన్నాగాలకు రైతులు బలవుతున్నారని రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖామాత్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఒక ప్రకటనలో మండిపడ్డారు. అసలే వర్షాలు లేక రైతులు తీవ్రమైన బాధలో ఉంటే.. కనీస మానవత్వం లేకుండా స్వార్ధరాజకీయాల కోసం రైతుల నోటికాడ బుక్కను లాక్కోవడం ఏంటని ఆయన నిలదీశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం…
నైట్ ఫ్రాంక్ ఇండియా యొక్క తాజా ‘థింక్ ఇండియా థింక్ రిటైల్ 2024’ నివేదిక ప్రకారం, హై స్ట్రీట్ రిటైల్‌లో హైదరాబాదు భారతదేశంలోని అగ్రశ్రేణి నగరాలలో ఒకటిగా నిలుస్తుంది, జాతీయ రాజధాని ప్రాంతం (NCR) మరియు బెంగళూరు తర్వాత చాలా దగ్గరగా ఉంది. మొదటి ఎనిమిది నగరాల్లో ఉన్న 82 శాతం స్టోర్లలో 15 శాతం హైదరాబాద్‌దేనని నివేదిక హైలైట్ చేసింది. ఈ నివేదిక హైదరాబాద్‌లో విస్తరించి ఉన్న ఐదు ప్రముఖ హై స్ట్రీట్లను గుర్తించి, దాని…
హైదరాబాద్ నగరంలో మంగళవారం భారీ వర్షం, వడగళ్ల వానలు కురిశాయి. హైదరాబాద్‌తో పాటు రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాలు ఆకస్మిక మరియు తీవ్రమైన వాతావరణ మార్పులతో మునిగిపోయాయి, వాతావరణ పరిస్థితుల్లో నాటకీయ మార్పులకు కారణమైంది. అనేక ప్రాంతాల్లో బలమైన గాలులు, భారీ వర్షపాతం మరియు ఉరుములతో కూడిన గాలివానలతో కూడిన ఉష్ణోగ్రతలో గణనీయమైన తగ్గుదల ఉందని నివేదికలు సూచిస్తున్నాయి . హైదరాబాద్‌లోని కూకట్పల్లి, కేపీహెచ్‌బీ, మూసాపేట్లో భారీ వర్షం కురుస్తుండగా, బాలానగర్, ఫతేనగర్, సనత్‌నగర్‌లో కూడా వర్షం కురుస్తోంది.…
ఐపీఎల్ 2024లో భాగంగా.. ఈరోజు రాజస్థాన్ రాయల్స్-ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ జరుగనుంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో.. టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. ఇప్పటికే.. పాయింట్ల పట్టికలో టాప్ లో ఉన్న రాజస్థాన్, ఈ మ్యాచ్ లో గెలిచి అదే స్థానంలో కొనసాగాలని చూస్తోంది. మరోవైపు.. ఢిల్లీ ఈ మ్యాచ్ లో నెగ్గి ప్లేఆఫ్స్ లోకి వెళ్లేందుకు ప్రయత్నం…
మేడిగడ్డ బ్యారేజీకి మరింత నష్టం వాటిల్లకుండా తీసుకోవాల్సిన చర్యలపై ఎన్డీఎస్ఏ మధ్యంతర నివేదిక ఇచ్చింది. మేడిగడ్డలో ఏడో బ్లాక్‌కు మాత్రమే నష్టం వాటిల్లిందా, మిగిలిన బ్లాకుల పరిస్థితి ఏంటన్నది తెలుసుకోవడానికి పలు పరీక్షలు చేయాల్సి ఉంది. తుది నివేదికను జూన్‌లో అందజేస్తారని నీటిపారుదల శాఖ అధికార వర్గాలు తెలిపాయి. కేంద్ర జల సంఘం మాజీ ఛైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలోని నిపుణుల కమిటీ ఈ బ్యారేజీలను పరిశీలించడంతోపాటు నీటిపారుదల శాఖ అధికారులు, ఏజెన్సీలతో చర్చించింది. పూర్తి నివేదిక…
విశాఖలో సీఎం జగన్ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఓల్డ్ గాజువాకలో ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. ముఖ్యమంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. మూడు రాజధానులు ప్రకటించే ధైర్యం చేసింది జగనేనని తెలిపారు. విశాఖను రాజధానిగా చేయడమే కాదు.. జూన్ 4న ప్రమాణ స్వీకారం, పాలన చేసేది ఇక్కడ నుంచేనని పేర్కొన్నారు.
చిత్తూరు జిల్లా పుంగనూరులో టీడీపీ భారీ బహిరంగ నిర్వహించింది. ఈ సభలో చంద్రబాబు మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఐదేళ్ళుగా పేదలపై భారం మోపుతూ.. బాదుడే బాదుడు అని ఆరోపించారు. ఏడుసార్లు కరెంటు ఛార్జీలు పెంచాడు.. రెండు వందలు వస్తున్న కరెంట్ బిల్లు వెయ్యి దాటి రెండువేల వరకు వెళ్ళిందని పేర్కొన్నారు. నిత్యావసర సరుకులు, పెట్రోలు ధరకు ఆఖరికి చెత్త పన్ను వేశాడని సీఎం జగన్ పై దుయ్యబట్టారు. ప్రతి ఎన్నికలకు ఏదో ఒక…