తాము తయారు చేసిన కరోనా టీకాను ప్రపంచవ్యాప్తంగా ఉపసంహరించుకుంటున్నట్టు బ్రిటన్ ఫార్మా దిగ్గజం ఆస్ట్రాజెనెకా తెలిపింది. వాణిజ్యపరమైన కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించింది.
తూర్పుగోదావరి జిల్లా నల్లజర్లలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. వైసీపీ, టీడీపీ శ్రేణుల మధ్య కొట్లాట జరిగింది. మంత్రి తానేటి వనిత ప్రచారంలో వివాదం చెలరేగింది. నల్లజర్లలో ముళ్లపూడి బాపిరాజు ఇంటి వద్ద బైక్ సైలెన్సర్లతో హంగామా సృష్టించడంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చెలరేగింది.
తెలుగు రాష్ట్రాల్లో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు. 6వ తేదీన ఏపీలో పర్యటించిన ప్రధాని.. నేడు మరోసారి ఏపీలో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటించనున్నారు. మధ్యాహ్నం 3.35 గంటలకు ప్రత్యేక విమానంలో తిరుపతి ఎయిర్పోర్టుకు ప్రధాని మోడీ చేరుకోనున్నారు.
ఐపీఎల్ 2024లో భాగంగా.. రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ ఘన విజయం సాధించింది. 20 పరుగుల తేడాతో ఢిల్లీ గెలుపొందింది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 201 పరుగులు చేసింది. 222 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్.. కెప్టెన్ సంజూ శాంసన్ ఒక్కడే (86) పరుగులతో రాణించాడు. మిగతా బ్యాటర్లు బ్యాటింగ్లో రాణించలేకపోయారు. రాజస్థాన్ ఓపెనర్లు యశస్వీ జైస్వాల్ (4), జాస్ బట్లర్ (19) పెద్దగా పరుగులు చేయలేదు. రియాన్…
తిరుపతిలో పవన్ కల్యాణ్, చంద్రబాబు రోడ్ షో నిర్వహించారు. ఈ రోడ్ షోలో భారీగా కార్యకర్తలు తరలివచ్చారు. మంగళం లీలామహల్ సెంటర్ మీదుగా గాంధీరోడ్డు వరకు రోడ్ షో చేపట్టారు. అనంతరం.. గాంధీరోడ్డు వద్ద వారాహీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. తిరుపతి పవిత్రతను కాపాడటానికి ప్రజలందరు సిద్ధంగా ఉండాలని కోరారు. తనది పునర్జన్మ.. వేంకటేశ్వర స్వామీ తనకు పునర్జన్మ ఇచ్చాడని అన్నారు. ఎన్టీఆర్, చిరంజీవి లాంటి వారు పోటీ చేసిన గొప్ప…
మెదక్ పార్లమెంట్ పరిధిలో కేసీఆర్ రోడ్షో నిర్వహించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. వర్షం కురిసిన ఇంతమంది వచ్చారు మీకందరికీ ధన్యవాదాలు తెలిపారు. చైతన్యవంతమైన మెదక్ లో మీరు మంచి తీర్పు ఇవ్వాలని, కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటిలతో అరచేతిలో వైకుంఠం చూపించిందన్నారు. అనేక వాగ్దానాలు చేసి అబద్దాలతో అధికారంలోకి వచ్చారని ఆయన తెలిపారు. ఉచిత బస్సుతో మహిళలు కోటుకుంటున్నారు…ఆటో కార్మికులు రోడ్డున పడ్డారని, రైతు బంధు డబ్బులు అందరికి వచ్చాయా..పాత పథకాలు కూడా సరిగా అమలు…
తిరుపతిలో పవన్ కల్యాణ్, చంద్రబాబు రోడ్ షో నిర్వహించారు. ఈ రోడ్ షోలో భారీగా కార్యకర్తలు తరలివచ్చారు. మంగళం లీలామహల్ సెంటర్ మీదుగా గాంధీరోడ్డు వరకు రోడ్ షో చేపట్టారు. అనంతరం.. గాంధీరోడ్డు వద్ద వారాహీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ, గోవిందా.. గోవిందా అంటూ స్పీచ్ మొదలెట్టారు. అన్నీ సర్వేలు కూటమిదే విజయం అంటోందని తెలిపారు. ఇక్కడ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అభినయ్ ను ఎమ్మెల్యేగా గెలిపించడం అవసరమా అని…
ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆధ్వర్యంలో సీఈఓ ముకేష్ కుమార్ మీనాని వైఎస్సార్సీపీ బృందం కలిసింది. పాణ్యం, అనకాపల్లి సభల్లో సీఎం జగన్ పై చంద్రబాబు చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఫిర్యాదు చేశారు. చంద్రబాబు చేసే తప్పుడు ప్రచారాలు, అసభ్య వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా.. ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ, ఈసీ ఒక్కో రాష్ట్రానికి ఒక్కో విధంగా వ్యవహరిస్తోందని తెలిపారు. పొరుగు రాష్ట్రంలో దుర్భాషలాడిన నేతలపై 48 గంటలు నిషేధం విధించిందని…
వరంగల్ తూర్పు సభను విజయవంతం చేసినందుకు కొండా దంపతులకు ధన్యావాదాలు తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 17 సార్లు పార్లమెంట్ ఎన్నికలు జరిగాయని, పీవిని ప్రధాని చేసిన ఘటన ఓరుగల్లుకు ఉందన్నారు. ఈ ప్రాంతం తెలంగాణ ఉద్యమనికి ఊపిరిపోసింది, కేసీఆర్ పాలనలో వరంగల్ అభివృద్ధి కుంటుపడిందన్నారు. జూన్ 30తారీఖు వరకు వరంగల్ కు 3 కోట్ల నిధులు ఇస్తామని, మే9 తేది లోపు ప్రతి రైతుకు నగదు ఖాతాల్లో వేస్తామని, కేంద్ర…