KTR : కాంగ్రెస్, బీజేపీలపై కేటీఆర్ ఆసక్తికర ట్వీట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాంగ్రెస్‌పై ప్రధాని నరేంద్ర మోడీ చేసిన “నోట్లతో నిండిన టెంపో” వ్యాఖ్యలకు ధీటుగా బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి రామారావు గురువారం మాట్లాడుతూ.. డీ-మానిటైజేషన్ విఫల ప్రయత్నమని ప్రధాని మోదీ భావిస్తున్నారా? అని ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. ఇటీవల తెలంగాణలో పర్యటించిన సమయంలో కాంగ్రెస్‌కు అదానీ, అంబానీలు టెంపోల నిండుగా డబ్బు పంపుతున్నారని ప్రధాని మోదీ అన్నారని, ఆయన మాట ప్రకారం కాంగ్రెస్‌కి వాళ్లు అంతగా డబ్బు పంపుతుంటే ఈడీ, సీబీఐ, ఐటీలు ఎందుకు మౌనంగా ఉన్నాయని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ను స్కాంగ్రెస్‌గా అభివర్ణించారు. మోదీకి ఇష్టమైన ఈడీ, సీబీఐలు స్కాంగ్రెస్ విషయంలో ఎందుకు మిన్నకుండి పోయాయని కేటీఆర్ సూటిగా ప్రశ్నించారు.
తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని ప్రత్యేక ట్వీట్‌లో, ఇన్వర్టర్లు, ఛార్జింగ్ బల్బులు, టార్చ్‌లైట్లు, కొవ్వొత్తులు, జనరేటర్‌లతో మరియు పవర్ బ్యాంకులు సహా “ఆరు హామీలు” అని వ్యంగ్యంగా ట్యాగ్ చేయబడిన ఉత్పత్తుల జాబితాను “స్టాక్ అప్” చేయమని కేటీఆర్ పౌరులకు పిలుపునిచ్చారు. “గుర్తుంచుకోండి, ఇది కాంగ్రెస్ ప్రభుత్వం, BRS కాదు,” అని ఆయన పౌరులకు గుర్తు చేశారు, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో పెరిగిన విద్యుత్ అంతరాయాలను సూచించాడు. మే 13న జరిగే లోక్‌సభ ఎన్నికల్లో తెలివిగా ఓట్లు వేయాలని ఆయన కోరారు.
Also Read
- CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
- Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
- Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
- India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
తాజావార్తలు
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!