జైలు శిక్ష అనుభవిస్తున్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను మధ్యంతర బెయిల్‌పై విడుదల చేస్తే.. అధికారిక విధులను నిర్వహించొద్దని సుప్రీంకోర్టు మంగళవారం అభిప్రాయపడింది.
చైనాలోని నైరుతి ప్రావిన్స్ యునాన్లోని ఓ ఆసుపత్రిలో మంగళవారం జరిగిన కత్తి దాడిలో ఇద్దరు వ్యక్తులు మరణించగా.. 21 మంది గాయపడ్డారు. ఆ దేశ మీడియా ఈ విషయాన్ని ధృవీకరించింది.
తన తండ్రికి మద్దతుగా కేశినేని శ్వేత ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 48వ డివిజన్ ఎన్నికల ప్రచారంలో కేశినేని శ్వేత పాల్గొన్నారు.
జమ్మూకశ్మీర్‌లోని కుల్గామ్‌లో మంగళవారం భద్రతా బలగాలతో జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. కుల్గామ్‌లోని రెడ్వానీ ప్రాంతంలో ఉగ్రవాదుల ఉనికి గురించి సమాచారం అందుకున్న భద్రతా దళాలు సోమవారం అర్థరాత్రి కార్డన్ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించినట్లు తెలిసింది.
Online Gaming Fraud: ఎవరైనా నిజమైన ఆన్లైన్ గేమ్‌లు ఆడుతూ డబ్బు సంపాదించారా? అవుననే సమాధానం ఎవరి నుంచి రాదు. ఎందుకంటే ఆన్ లైన్ గేమ్స్ అంతా ఒక భూటకమనే చెప్పాలి.
మూడో దశ లోక్‌సభ ఎన్నికల సందర్భంగా కర్ణాటకలో ఎన్నికల విధుల్లో ఉన్న ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు గుండెపోటుతో మరణించారు. వీరిలో ఒకరు ప్రభుత్వ పాఠశాలలో ప్రధానోపాధ్యాయులుగా పనిచేస్తుండగా, మరొకరు వ్యవసాయ శాఖకు చెందిన వారు.
ఒకరికి బదులు మరొకరు పరీక్ష రాసి అడ్డంగా దొరికిపోయిన ఘటన రాజస్థాన్‌లో జరిగింది. దేశవ్యాప్తంగా ఆదివారం జరిగిన నీట్ యూజీపరీక్షలో ఈ ఉదంతం చోటు చేసుకుంది. ఆదివారం జరిగిన నీట్ పరీక్షలో రాజస్థాన్‌లో ఓ విద్యార్ధికి బదులు మరొక విద్యార్ధి పరీక్షకు హాజరై పట్టుబడ్డాడు.
ప్రజ్వల్ రేవణ్ణ లాంటి వారిని అస్సలు సహించబోమని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం జేడీఎస్ ఎంపీని దేశం విడిచి వెళ్లేందుకు అనుమతించిందని, అభ్యంతరకర లైంగిక వీడియోలను విడుదల చేసిందని ఆరోపించారు. శాంతిభద్రతల సమస్య ఉన్నందున ఈ విషయంలో చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని అన్నారు.
ఎవరి వద్దైనా ఒసామా బిన్ లాడెన్ ఫొటో, ఐసిస్ జెండా కనిపించినంత మాత్రాన, ఆ ఒక్క ఆధారంగా మాత్రమే ఉపా చట్టం కింద అతనిపై చర్యలు తీసుకోలేమని, ఢిల్లీ హైకోర్టు ఓ వ్యాజ్యంపై విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది.
టీ20 వరల్డ్‌కప్-2024 కోసం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తమ జట్టు న్యూ జెర్సీని రివీల్ చేసింది. మ్యాట్రిక్స్ జెర్సీ' 24 పేరుతో పీసీబీ బోర్డ్ తమ కొత్త జెర్సీని సోషల్ మీడియా వేదికగా విడుదల చేసింది.