ఏపీలో సోమవారం సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ జరగబోతుంది. రాష్ట్రంలోని 25 లోక్సభ స్థానాలతో పాటు.. 175 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఈ క్రమంలో.. ఈసీ అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ క్రమంలో.. మచిలీపట్నం కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ బాలాజీ, జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం ఆస్మి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతే.. జిల్లాలో రేపు జరిగే ఎన్నికలకు సర్వం సిద్ధం అయిందని తెలిపారు. మరోవైపు.. పోలింగ్ సిబ్బందికి కృతజ్ఞతలు చెప్పారు. జిల్లాలో 1768 కేంద్రాల్లో 364 పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా గుర్తించారు. 890 సామాన్య కేంద్రాలు ఉండగా.. వెరసి 1256 కేంద్రాల వద్ద వీడియో గ్రాఫి ఏర్పాటు చేశామని కలెక్టర్ పేర్కొన్నారు.
Challenge Vote: మీ ఓటును వేరే వాళ్లు వేశారా?.. అయితే ఇలా చేయండి!
12,448 మంది పోలింగ్ సిబ్బంది.. 412 మంది మైక్రో అబ్జర్వర్లను నియమించినట్లు కలెక్టర్ బాలాజీ తెలిపారు. మరోవైపు.. కృష్ణ కానుక అనే కిట్ను సిబ్బందికి అందించామని.. మస్కిటో కాయిల్స్ సైతం అందించామని అన్నారు. ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ఎన్నికల ప్రక్రియ జరుగుతుందని చెప్పారు. కాగా.. ఓటు లేనివారు నియోజకవర్గంలో ఉండకూడదని తెలిపారు.
అంతేకాకుండా.. మైక్ పర్మిషన్ ప్రచారాలు లేవని, లిక్కర్ సేల్స్ నిషేధం, భద్రత సిబ్బందిని అలెర్ట్ చేశామని పేర్కొన్నారు. ఓటు వేయడానికి వచ్చేటప్పుడు ఓటు గుర్తింపు కార్డు లేకపోతే 12 రకాల వివిధ గుర్తింపు కార్డులు తీసుకెళ్ళాలని కోరారు. ప్రజాస్వామ్య పండుగ అందరూ వచ్చి ఓటు వేయండి, ప్రజాస్వామ్యాన్ని గెలిపించండని విజ్ఞప్తి చేశారు.
PM Modi: 14న మోడీ నామినేషన్.. హాజరుకానున్న ఎన్డీఏ సభ్యులు