ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థిపై ఉపాధ్యాయుడి దాడి..
హైదరాబాద్ మియాపూర్ మదీనగూడ ప్రభుత్వ పాఠశాలలో ఒక ఉపాధ్యాయుడు విద్యార్థిపై విచక్షణరహితంగా దాడి చేసిన ఘటన కలకలం రేపుతోంది. విద్యార్థిపై శారీరక దాడి చేసి అతడి ముఖం, శరీరంపై తీవ్ర గాయాలు కలిగించినట్లు తెలుస్తోంది. స్థానిక సమాచారం మేరకు, ఓ ఉపాధ్యాయుడు గతంలో కూడా విద్యార్థులపై కర్రతో దాడి చేసిన ఘటనలు ఉన్నాయని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన విద్యార్థి తల్లిదండ్రులు ప్రధానోపాధ్యాయుడిని కలిసి ఫిర్యాదు చేశారు. అయితే, ఆశించిన న్యాయం దక్కలేదని భావించిన తల్లిదండ్రులు, ఉపాధ్యాయుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని మియాపూర్ పోలీస్‌స్టేషన్‌లో అధికారికంగా ఫిర్యాదు చేశారు.
కుంభమేళాకి 62 కోట్ల మంది భక్తులు..ఈ శతాబ్ధంలోనే అరుదైన సంఘటన..
ఉత్తర్ ప్రదేశ్ ప్రయాగ్ రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాకి ఇప్పటి వరకు 62 కోట్ల మంది భక్తులు వచ్చినట్లు సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆదివారం చెప్పారు. నిర్దిష్ట కాలంలో ఇంత పెద్ద సంఖ్యలో భక్తులు రావడం ‘‘శతాబ్ధంలోనే అరుదైన సంఘటన’ ’గా అభివర్ణించారు. ఆగ్రాలో జరిగిన యూనికార్న్ కంపెనీ సమావేశంలో యోగి పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. దీనిని స్టార్టప్ ప్రపంచంలోని యూనికార్న్ మహా కుంభ్ అని చెప్పవచ్చని అన్నారు.
రేపు అసెంబ్లీకి వైఎస్ జగన్ సహా వైసీపీ ఎమ్మెల్యేలు..
సోమవారం నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. తొలిరోజు ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ ప్రసంగించనున్నారు. ఆ తర్వాత జరిగే బీఏసీ సమావేశంలో సమావేశంలో ఎన్ని రోజులు నిర్వహించాలనే దానిపై నిర్ణయం తీసుకోనున్నారు. ఈనెల 28న అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమవుతోంది. మరోవైపు.. రేపు అసెంబ్లీకి వైసీపీ అధినేత వైఎస్ జగన్ సహా వైసీపీ ఎమ్మెల్యేలు వెళ్లనున్నారు. అందుకోసం.. వైఎస్ జగన్ తమ పార్టీ ఎమ్మె్ల్యేలు, ఎమ్మెల్సీలకు ఆదేశాలు జారీ చేశారు. ముందుగా అసెంబ్లీ కమిటీ హాలులో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ సమావేశం కానున్నారు. శాసన సభ, మండలిలో వ్యవహరించాల్సిన తీరుపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు దిశా నిర్దేశం చేయనున్నారు. ముఖ్యంగా సూపర్ సిక్స్ హామీలు, ప్రభుత్వ వైఫల్యాలపై ప్రభుత్వాన్ని నిలదీయాలని టార్గెట్‌తో వైసీపీ ఉన్నట్లు తెలుస్తోంది.
రేవంత్ రెడ్డికి బీజేపీ రక్షణ కవచంగా నిలుస్తున్నది
కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీజేపీ రక్షణ కవచంగా నిలుస్తున్నదని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. అమృత్ టెండర్ల స్కామ్ నుంచి మొదలుకొని సివిల్ సప్లైస్ స్కామ్ వరకు కేంద్ర ప్రభుత్వ నిధులను పక్కదారి పట్టించి స్కామ్ లకు పాల్పడుతున్నా కాపాడుతున్నదని ఆయన మండిపడ్డారు. సాక్ష్యాదారాలతో సహా అనేకసార్లు కేంద్రానికి ఫిర్యాదు చేసిన మౌనం వహిస్తున్నదన్నారు కేటీఆర్. గతంలో కాలేశ్వరం ప్రమాదంపైన అఘామేగాలపై స్పందించిన కేంద్రం… మెన్న సుంకిశాల ప్రమాదం పైన కానీ, నేడు ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ ప్రమాదంపై స్పందించడం లేదని ఆయన వ్యాఖ్యానించారు. బీజేపీ పార్టీ కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ ను కాపాడుతున్నదన్నది మిలియన్ డాలర్ ప్రశ్నగా మారిందని ఆయన అన్నారు. సరైన సమయంలో రేవంత్ బీజేపీలో చేరతానని హమీ ఇవ్వడం వల్లనే కేంద్రం అయనను కాపాడుతుందన్న అనుమానం ఉందన్నారు కేటీఆర్
పోలవరం కాలువలో పడి ఇద్దరు యువకులు మృతి..
కృష్ణా జిల్లా గన్నవరంలో విషాదం చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు పోలవరం కాలువలో పడి ఇద్దరు వ్యక్తులు మృతి చెందిన విషాద ఘటన ఆదివారం జరిగింది. బాపులపాడు మండలం వీరవల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. తండ్రితో కలిసి పోలవరం కాలువలో చేపలు పట్టేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు పోలవరం కాలువలో గల్లంతై ఇద్దరు యువకులు మృతి చెందినట్టు గుర్తించారు. మృతులు వీరవల్లి వాసులు షేక్ నాగూర్ భాష, (16) షేక్ షరీఫ్ (17)గా గుర్తించారు. పోలవరం కాలువ నుంచి మృతదేహాలను బయటికి తీయించి.. పోస్టుమార్టం నిమిత్తం గన్నవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా.. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
ఎన్డీఏ ప్రభుత్వం వచ్చాకే అభివృద్ది శరవేగంగా సాగుతోంది..
విశాఖలో నిర్వహించిన బడ్జెట్ పై మేధావుల సమావేశంలో కేంద్ర ఉక్కుశాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బడ్జెట్‌లో అన్ని వర్గాలకు సమతుల్యం పాటించారు.. రైతులకు పెద్ద పీట వేశారని తెలిపారు. కిసాన్ క్రెడిట్ కార్డు పరిమితిని రూ.5 లక్షలకు పెంచారు.. వ్యవసాయ పెట్టుబడి సమకూర్చే విధంగా చర్యలు తీసుకున్నామన్నారు. కేంద్రం ధన్ వ్యయన్ అనే పథకం తీసుకువచ్చింది.. ఫసల్ బీమా యోజన యధావిధిగా కొనసాగుతోంది.. యూరియా, డీఏపీ ధరల విషయంలో రాయతీలు ఇస్తోందని పేర్కొన్నారు. మరోవైపు.. విద్యకు పెద్ద ఎత్తున 2014లోనే ప్రాధాన్యత ఇచ్చారు.. దేశంలో 360 యూనివర్సిటీలు మంజూరు చేశారని అన్నారు. అధికారంలోకి వచ్చే నాటికి 51 వేల మెడికల్ సీట్లు ఉండేవి.. పదేళ్ల కాలంలో లక్షా 10 వేలకు పెంచారని వెల్లడించారు. దేశంలో 18 ఎయిమ్స్, 360 యూనివర్సిటీలు వచ్చాయి.. ఏపీకి 2 ఎయిమ్స్ వచ్చాయని భూపతిరాజు శ్రీనివాస వర్మ తెలిపారు. అటల్ ల్యాబ్స్‌ను 50 వేలు ఏర్పాటు చేయనున్నాం.. పాఠశాల స్ధాయిలోనే సృజనాత్మకతను వెలికితీసే ఆలోచనలో ఉన్నామని భూపతిరాజు శ్రీనివాస వర్మ పేర్కొన్నారు.
నీరా కేఫ్ నిర్వహణ గాలికొదిలేశారు
పీవీ మార్గ్ లోని నీరా కేఫ్‌ను మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సందర్శించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. అంతరించుకు పోతున్న కుల వృతులను కాపాడాలని నాటి ప్రభుత్వం నీరా కేఫ్ ను ప్రారంభించారని, మీ కుల వృత్తిని కాపాడమని మాజీ సీఎం కేసీఆర్ చెప్పారన్నారు. నీరా పాలసీ తీసుకొచ్చింది నాటి ప్రభుత్వం. ఆరోగ్య కరమైన నీరా పానీయం అందించే లక్ష్యం చేసిందన్నా శ్రీనివాస్ గౌడ్. నీరా ప్రొడక్ట్స్ కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నాయని, సంప్రదాయ ఫుడ్ అందించాలని చూశామన్నారు. ప్రైవేట్ కాంట్రాక్టర్‌కి ఇచ్చి చాట్ బండార్ తయారు చేసారన్నారు శ్రీనివాస్ గౌడ్. ఇక్కడ ఏసీలు తీసేసి, నీరా ఉత్పత్తులు తీసేసి దీని నిర్వహణ మొత్తం తీసేశారని, లక్షలాది మంది గౌడన్న లకు ఆత్మగౌరవం దెబ్బతినేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేస్తోందని ఆయన మండిపడ్డారు.
వేరే వ్యక్తితో యువతి రిలేషన్.. స్నేహితులతో కలిసి మాజీ ప్రియుడు గ్యాంగ్ రేప్..
మహారాష్ట్రలోని భివాండీలో దారుణం జరిగింది. 22 ఏళ్ల యువతిపై ఆరుగురు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. నగరంలోని వేర్వేరు ప్రాంతాల్లో ఆమెపై అఘాయిత్యం చేశారు. ఈ కేసులో ఆరుగురు నిందితులను పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఫిబ్రవరి 20వ తేదీ తెల్లవారుజామున ఒక పాఠశాలలో బాధితురాలిపై సామూహిక అత్యాచారం జరిగిందని తెలిపారు. మహిళపై ఆమె మాజీ ప్రియుడు అపహరించి, అతడి నలుగురు స్నేహితులతో కలిసి గ్యాంగ్ రేప్ చేశాడు.
మహిళ, ప్రధాన నిందితుడు గతంలో కొన్ని ఏళ్ల పాటు రిలేషన్‌లో ఉన్నారు. అయితే, ఆ మహిళ మరొక వ్యక్తితో రిలేషన్‌లోకి వెళ్లడంపై మాజీ ప్రియుడు కోపంతో ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు తెలిసింది. ఫిబ్రవరి 19 రాత్రి మహిళ సోదరుడిని నిందితులు కిడ్నాప్ చేశారు, ఆమెను ఇక్కడికి పిలిపించాలని ఆమె సోదరుడిపై ఒత్తిడి చేశారు.
సెంటర్ నిర్వాహకుల నిర్లక్ష్యంతో అంధ విద్యార్థినికి అన్యాయం..
సెంటర్ నిర్వాహకుల నిర్లక్ష్యంతో గ్రూప్-2 అంధ విద్యార్థిని సంజనకు అన్యాయం జరిగింది. గుంటూరు నుంచి కడపకు గ్రూప్ 2 పరీక్ష రాసేందుకు వచ్చిన అంధ విద్యార్థిని సంజన.. సకాలంలో పరీక్షా కేంద్రానికి చేరుకున్నప్పటికీ అధికారుల నిర్లక్ష్యంతో పరీక్ష రాయలేకపోయింది. హాల్‌టికెట్ పై కేఓఆర్ఎం నియర్ బై కేఎస్ఆర్ఎమ్ అని ఉండడంతో కేఎస్ఆర్ఎం పరీక్షా కేంద్రంలోకి సిబ్బంది అనుమతించలేదు. తాను రాయాల్సిన పరీక్ష పేపర్ రాకపోవడంతో 10 గంటల 45 నిమిషాలకు అధికారులు బయటకు పంపారు. సకాలంలో తనకు వివరాలు తెలిపి ఉంటే పక్కనే ఉన్న కేఓఆర్ఎమ్ సెంటర్‌కు చేరుకునే దానినంటూ సంజన ఆవేదన వ్యక్తం చేసింది. 11 గంటలకు కేఎస్ఆర్ఎం కాలేజీని చేరుకున్నప్పటికీ అధికారులు అనుమతించలేదు. దీంతో.. చేసేది ఏమీ లేక గ్రూప్-2 పరీక్ష రాయకుండా వెనుతిరిగింది అంధ అభ్యర్థిని సంజన.
శ్రీశైలం పుణ్యక్షేత్రాన్ని అపవిత్రం చేసే కుట్రలు జరుగుతున్నాయి
ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలం పుణ్యక్షేత్రాన్ని అపవిత్రం చేసే కుట్రలు జరుగుతున్నాయని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆరోపించారు. వైఎస్సార్ ప్రభుత్వం ఉన్న టైంలో కూడా చాలావరకు ముస్లింలకు శ్రీశైలం పుణ్యక్షేత్ర ప్రాంగణంలో అనేక షాప్ లు ఇచ్చారని, అప్పుడు హిందూ.. ఇతర సంఘాలు కోర్టుకు వెళ్ళారు.. స్టే కూడా తెచ్చుకున్నారన్నారు. నిన్న శివ స్వాములు ముస్లింలకు ఎందుకు షాప్ లు ఇచ్చారని ప్రశ్నిస్తే వారిపై పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారన్నారు. మహా శివరాత్రికి లక్షల మంది భక్తులు శ్రీశైలం వెళ్తారని, అక్కడ పవిత్రతను దెబ్బ తీసే కుట్ర జరుగుతుందని ఆయన మండిపడ్డారు. ఏపీ సీఎం.. డిప్యూటీ సీఎంకు నేను విజ్ఞప్తి చేస్తున్న మన హిందూ దేవాలయాల దగ్గర వేరే మతం వాల్ల షాపులు ఉండకుండా చూడాలన్నారు రాజా సింగ్.