జేఎన్టీయూహెచ్ కొత్త వైస్ ఛాన్సలర్గా ప్రొఫెసర్ టి. కిషన్ కుమార్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. డాక్టర్ కె. విజయకుమార్ రెడ్డి (డైరెక్టర్), డాక్టర్ కె. వెంకటేశ్వరరావు (రిజిస్ట్రార్), వివిధ విభాగాల డైరెక్టర్లు, అనుబంధ కళాశాలల ప్రిన్సిపాల్స్ ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. విశ్వవిద్యాలయాల అభివృద్ధికి బడ్జెట్లో 5 వేల కోట్ల రూపాయలు కేటాయించాలని తెలిపారు. అలాగే.. ఇతర సమస్యలు పరిష్కారం చేయాలని కోరారు. రాష్ట్రంలోని 15 యూనివర్సిటీలలో మౌలిక సదుపాయాలు లేక విద్యార్థులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.
హైదరాబాద్లో నకిలీ ఎడ్యుకేషన్ సర్టిఫికెట్స్ ముఠా గుట్టురట్టు చేశారు టాస్క్ ఫోర్స్ పోలీసులు.. డిగ్రీ, డిప్లొమా ఫేక్ సర్టిఫికెట్స్ తయారు చేస్తున్న ఆరుగురు గ్యాంగ్ సభ్యులను అరెస్ట్ చేశారు.
రెండు రోజుల భారతదేశ పర్యటన నిమిత్తం సోమవారం సాయంత్రం ఖతార్ అమీర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్-థానీ ఢిల్లీ చేరుకున్నారు. ఆయనకు స్వాగతం పలికేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సోమవారం విమానాశ్రయానికి వెళ్లి అరుదైన ఆతిథ్యాన్ని అందించారు. ఖతార్ అమీర్ను ప్రధాని మోడీ ఆలింగనం చేసుకుని స్వాగతం పలికారు.
హైదరాబాద్ మధురానగర్లో ఓ ప్రియుడు ప్రియురాలి ఇంటి ముందు పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. శనివారం రాత్రి ప్రియుడు సూర్యనారాయణ ప్రియురాలి ఇంటికి వచ్చాడు. ఆమె భర్త ముందే 'నీ పెళ్లాంని నాకిచ్చేయ్.. బాగా చూసుకుంటాను' అని అన్నాడు. దీంతో.. ప్రియురాలి భర్త, సూర్యనారాయణకు మధ్య గొడవ జరిగింది.
ఇంటర్ విద్యార్థినితో ఉపాధ్యాయుడి అసభ్య ప్రవర్తన.. కుటుంబీకుల ఆందోళన విద్యార్థులకు విద్యాబుద్దులు నేర్పించి వారి భవిష్యత్తుకు పాటుపడాల్సిన కొందరు ఉపాధ్యాయులు బుద్ది లేకుండా వ్యవహరిస్తున్నారు. విద్యార్థులు తప్పులు చేస్తే సరిచేయాల్సిందిపోయి టీచర్లే తప్పుడు పనులకు పూనుకుంటున్నారు. కొందరి ఉపాధ్యాయుల ప్రవర్తన, ఉపాధ్యాయలోకానికే మాయని మచ్చగా మారింది. తాజాగా వరంగల్ లో దారుణం చోటుచేసుకుంది. ఇంటర్ విద్యార్థినితో ఉపాధ్యాయుడు అసభ్యంగా ప్రవర్తించిన ఘటన వెలుగుచూసింది. విషయం తెలిసిన విద్యార్థిని కుటుంబ సభ్యులు కాలేజీ ముందు ఆందోళనకు దిగారు. పూర్తి…
సంఘ్ చీఫ్ మోహన్ భగవత్ 10 రోజుల బెంగాల్లో పర్యటిస్తున్నారు. నేడు నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ఆర్ఎస్ఎస్ తదుపరి కార్యాచరణపై ఆయన వివరణ ఇచ్చారు.
శనివారం రాత్రి న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో జరిగిన తొక్కిసలాటలో 18 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతులలో 11 మంది మహిళలు, ఐదుగురు చిన్నారులు ఉన్నారు. తొక్కిసలాటలో మరణించిన ఐదుగురి పోస్ట్మార్టం నివేదికలు వెలువడ్డాయి. నివేదిక ప్రకారం.. ఈ ఐదుగురు "ట్రామాటిక్ అస్ఫిక్సియా" కారణంగా మరణించారని తేలింది. ఇది ఛాతీ లేదా పొత్తికడుపు పైభాగంపై అధిక ఒత్తిడి వల్ల ఆక్సిజన్ లేదా రక్త సరఫరా కోల్పోవడాన్ని సూచిస్తుంది.
రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ప్రజల ఆరోగ్యం ఎంతో ముఖ్యం! రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ప్రజల ఆరోగ్యం ఎంతో ముఖ్యం అని.. ప్రజల ఆరోగ్యం బాగుంటే వ్యక్తిగత ఆదాయం పెరుగుతుందని, తద్వారా రాష్ట్ర ఆదాయం పెరుగుతుందని మంత్రి నారాయణ అన్నారు. రాష్ట్రంలో చెత్తను సద్వినియోగం చేసుకునేందుకు వేస్ట్ ఎనర్జీ ప్లాంట్లు పెడుతున్నాం అని.. నెల్లూరు, కాకినాడ, రాజమహేంద్రవరంలతో పాటు రాయలసీమలో రెండు ప్లాంట్లు ఏర్పాటు చేస్తామన్నారు. వచ్చే రెండేళ్లలో ఏపీని చెత్త రహిత రాష్ట్రంగా తీర్చి దిద్దాలనేది తమ…