పోలీసులు అధికారులు బరితెగించి ప్రవర్తిస్తున్నారని మాజీ మంత్రి పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు ఏకపక్షంగా వైసీపీ నేతలు, కార్యకర్తలపై కేసులు పెడుతున్నారని.. అసలు ముద్దాయిలను వదిలేసి తప్పు చేయని వారిపై కేసులు పెడుతున్నారని ఆయన అన్నారు.హింస జరుగుతుందని తెలిసినా పోలీసులు పట్టించుకోలేదని మండిపడ్డారు.
హైదరాబాద్‌లోని నిజాంపేట్ ఎక్స్ రోడ్లో ఉన్నటువంటి సిగ్నస్ గ్యాస్ట్రో హాస్పిటల్ నందు అరుదైన క్యాన్సర్ శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తిచేసినట్లు హాస్పిటల్ వైద్యనిపుణులు, యాజమాన్యం ప్రకటించింది. 32 ఏళ్లు వయస్సు గల వ్యక్తికి ఆహారం, నీరు తీసుకోవడమే కష్టమే మారడంతో సిగ్నల్ గ్యాస్ట్రో ఆస్పత్రికి రాగా.. ప్రాథమిక పరీక్షలు నిర్వహించి తర్వాత ఎగువ అన్నవాహిక క్యాన్సర్‌గా గుర్తించారు.
ఏపీలో ఓట్ల లెక్కింపు కోసం ఈసీ భారీ ఏర్పాట్లు చేస్తోంది. పోలింగ్ తర్వాత జరిగిన ఘర్షణలు, గొడవలు కారణంగా ఈసారి మరిన్ని జాగ్రత్తలు తీసుకుటోంది. కౌంటింగ్ ప్రక్రియను పకడ్బంధీగా చేసేందుకు మూడు అంచెల భద్రతా ఏర్పాట్లు చేస్తోంది. అన్ని కౌంటింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తోంది. కేంద్ర బలగాలతోపాటు స్థానిక పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది.
ఒక వయస్సు తర్వాత తాగడం నేరం కాదు.. కానీ తాగి రోడ్లపై న్యూసెన్స్ చేయడం, డ్రైవింగ్ చేయడం మాత్రం నేరమే. ఈ నిర్లక్ష్యానికి ఎంత నష్టం ఉంటుందో ఊహించలేరు. ఏం చేస్తున్నారో సోయి ఉండదు. తాగుతారు.. తాగి రోడ్డెక్కుతారు.. మత్తులో డ్రైవింగ్ చేసి జనాలను గుద్దేస్తారు. యమకింకరుల్లా మారి ప్రాణాలు తీసేస్తారు.
మాంసాహార ప్రియులకు చేదువార్త ఇది. గత కొన్ని రోజులగా ఏపీ, తెలంగాణలో చికెన్ ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఎండలతో పాటు చికెన్ రేట్లు కూడా మండిపోతూ సామాన్యులను బెంబేలెత్తిస్తున్నాయి. కిలో చికెన్ ధర 'ట్రిపుల్' సెంచరీ దాటింది.
Hyderabad: ఛత్తీస్‌గఢ్‌లోని భిలాయ్ ప్రాంతానికి చెందిన ఓ పాప ప్రమాదవశాత్తూ ఆలౌట్ లిక్విడ్ తాగింది. ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందిగా ఉండడంతో తల్లిదండ్రులు గమనించి స్థానిక ఆస్పత్రికి తరలించారు.
మాజీ ఎంపీ కావూరి సాంబశివరావు కుటుంబ సభ్యులు నిర్వహిస్తున్న ప్రోగ్రెసివ్ కన్స్ట్రక్షన్స్ సంస్థ నిర్వాహకుల, మరో ప్రజా ప్రతినిధి, సినీ నటుడు తొట్టెంపూడి వేణుతో పాటు సంస్థ ఎండీపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఇందుకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తరాఖండ్ రాష్ట్రములో హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టుకు సంబంధించిన ఓ పనిని తెహ్రీ డెవలప్మెంట్ కార్పొరేషన్ (టీహెచ్‌డీసీ) ద్వారా ప్రోగ్రెసివ్ కన్స్ట్రక్షన్ సంస్థ ప్రాజెక్ట్ ను దక్కించుకొంది. Ghaziabad : ఇద్దరు…
ఇటీవల ఆస్తి కోసం సొంత కుటుంబ సభ్యులను కూడా మోసం చేస్తున్నారు. కుటుంబ సమస్యలు, ఆస్తి గొడవల వ్యవహారంలో అత్తను సొంత కోడలు కిడ్నాప్ చేసి నానా హింసలు పెట్టింది. అన్నమయ్య జిల్లా రాజంపేట పట్టణం మన్నూరులో ఆస్తి కోసం వృద్ధురాలిని కిడ్నాప్ చేసింది.
నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలం కనకాద్రి పల్లెలో దారుణం చోటుచేసుకుంది. తాగిన మత్తులో కట్టుకున్న భార్యను గొడ్డలితో కిరాతకంగా నరికి చంపాడు ఓ కసాయి మొగుడు. మద్యం మత్తులో భార్య సుగుణమ్మ (48) ను కిరాతకంగా గొడ్డలితో హత్య చేశాడు భర్త వడ్డే రమణ.
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం శనివారం రాత్రి తుఫాన్‌గా మారింది. దానికి రేమాల్‌గా నామకరణం చేశారు. రేమాల్ అంటే అరబిక్ భాషలో ఇసుక అని అర్థం. ఇవాళ అర్ధరాత్రి దాటిన తర్వాత తీరం దాటే అవకాశం ఉంది.