తెలంగాణలో 2024-25 స్కూల్స్ అకాడమిక్ క్యాలెండర్ను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. జూన్ 12 నుండి స్కూళ్లు ఓపెన్ చేయనున్నారు... 23 ఏప్రిల్ 2025 వరకు మొత్తం 229 పనిదినాలు ఉండనున్నాయి. కాగా.. జూన్ 1 నుండి 11 వరకు బడి బాట కార్యక్రమం జరుగనుంది. 2024 జూన్ 12న ప్రారంభమై 2025 ఏప్రిల్ 23తో ముగుస్తాయి. 2025 ఏప్రిల్ 24 నుంచి 2025 జూన్ 11 వరకు మొత్తం 49 రోజులు ఈ విద్యాసంవత్సరంలో వేసవి…
వరంగల్, ఖమ్మం, నల్లగొండ పట్టభద్రుల ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ.. కొత్తగూడెం, కొత్తగూడెం క్లబ్లోని ఆత్మీయ సమ్మేళనంలో బీజేపీ జాతీయ నాయకులు ఈటల రాజేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల ఫ్లెయింగ్ స్కాడ్ పేరుతో తమకు ఇబ్బందులు గురిచేయాలని చూశారని ఆరోపించారు. లక్ష కోట్ల యజమాని అయిన గుడిసెల్లో ఉన్న వారికైనా ఒకటే ఆయుధం ఓటు అని తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో తూట తిన్నది ఇక్కడి ప్రజలేనని.. ఈ…
కేరళ పరిసరాల్లోని ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలో అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరిసీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయి.
బెంగళూరు రేవ్ పార్టీ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మురం చేశారు. డ్రగ్స్ టెస్టులో పాజిటివ్ వచ్చిన వారికి బెంగళూరు పోలీసులు నోటీసులు పంపారు. ఈ కేసులో నటి హేమతో పాటు 86 మందికి నోటీసులు జారీ చేశారు.
బెంగళూరు రేవ్ పార్టీ కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు. బెంగళూరు రేవ్ పార్టీ కేసులో మంత్రి వాహనంపై సీసీబీ పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు. రేవ్ పార్టీ సమయంలో మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి వాహనాన్ని ఉపయోగించిన వ్యక్తిని పోలీసులు గుర్తించారు.
RTC MD Sajjanar: నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి సంబంధించిన మాల్ కేసు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇటీవల మాల్ను ఆర్టీసీ అధికారులు సీజ్ చేసిన విషయం తెలిసిందే..
ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్యశ్రీ సేవలు తిరిగి ప్రారంభమయ్యాయి. ఈ మేరకు ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రుల అసోసియేషన్ ప్రకటించింది. ఆరోగ్యశ్రీ సేవలు పునరుద్ధరించాలని నిర్ణయించామని.. శుక్రవారం ఏపీ సీఎస్ జవహర్ రెడ్డిని కలిసి మా వినతిని తెలిపామని ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రుల అసోసియేషన్ ప్రతినిధులు వెల్లడించారు.