లైంగిక నేరాల ఆరోపణల తర్వాత గత నెలలో జర్మనీకి పారిపోయిన ప్రజ్వల్ రేవణ్ణ తల్లి భవానీ రేవణ్ణ.. తన భర్తను ఇంతకుముందు అరెస్టు చేసిన కిడ్నాప్ కేసులో ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. హెచ్డి రేవణ్ణను ఏప్రిల్ 29న ఇంటి పనిమనిషిని కిడ్నాప్ చేసిన ఆరోపణలపై ఈ నెల ప్రారంభంలో అరెస్టు చేశారు. హెచ్డి రేవణ్ణ కిడ్నాప్ చేసిన మహిళ తమ ఇంటిలో పని చేస్తుందని.. ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ కూడా అత్యాచారానికి పాల్పడ్డారని బాధితురాలి…
హఫీజ్‌పేటలో ఆస్బెస్టాస్ షీట్ పైకప్పు పడిపోవడంతో మూడేళ్ల బాలుడి కుటుంబానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు ఆదివారం రాత్రి రూ.లక్ష ఆర్థిక సాయం అందజేశారు. కుటుంబ సభ్యులను పరామర్శించి పార్టీ తరపున అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. భారీ వర్షం, ఈదురు గాలుల కారణంగా ఆదివారం రాత్రి హఫీజ్‌పేటలో ఓ ఇంటి గోడ కూలి ఇటుకలు పక్కనే ఉన్న ఇంటి పైకప్పుపై పడ్డాయి. ఆస్బెస్టాస్ షీట్ పైకప్పు చిన్నారి సమద్‌పై పడడంతో వెంటనే మృతి…
గుజరాత్‌లోని రాజ్‌కోట్ వీడియో గేమ్‌జోన్‌లో అగ్ని ప్రమాదం సంభవించి 28 మంది అగ్నికి ఆహుతైన విషయం తెలిసిందే. చనిపోయిన వారిలో చిన్నారులు ఉండటం, వారంతా తీవ్రంగా కాలిపోవడం అందరినీ కలచివేసింది. ఈ కేసు గుజరాత్ హై కోర్టులో విచారణకు వచ్చింది.
జూన్ రెండవ తేదీన తెలంగాణ రాష్ట్ర అవతరణ ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి తెలియజేశారు. జూన్ 2 వ తేదీన ఉదయం గన్ పార్క్ లోని అమరవీరుల స్థూపం వద్ద తెలంగాణ రాష్ట్ర సాధన అమరులకు రాష్ట్ర ముఖ్యమంత్రి నివాళులు అర్పించిన అనంతరం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించే కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. రాష్ట్ర అవతరణ దినోత్సవ ఏర్పాట్లపై నేడు డా.బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో వివిధ శాఖల…
దేశంలో ప్రాజెక్టులు కట్టి వ్యవసాయం..విద్యుత్ ని తెచ్చింది నెహ్రు అని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. FCI ఏర్పాటు చేసి దేశం ఆకలి చావుల నుండి కాపాడింది నెహ్రు అని, మోడీ పదేళ్ళలో ఒక్క ప్రాజెక్టు అయినా కట్టారా..? అని జగ్గారెడ్డి ప్రశ్నించారు. ఆస్తులు పోగు చేసింది కాంగ్రెస్.. ఆస్తులు ధారదత్తమ్ చేస్తుంది మోడీ అని ఆయన మండిపడ్డారు. 60 ఏండ్లు పాలించిన వాళ్ళు ఏం చేయనిదే.. బీజేపీ..brs వాళ్ళు…
పశ్చిమ బెంగాల్లో రెమల్ తుఫాన్ బీభత్సం సృష్టిస్తోంది. ఇప్పటికే అక్కడ పరిస్థితులు అల్లకల్లోలంగా మారాయి. ఈ తుఫాన్ ధాటికి ఇద్దరు మృతి చెందగా.. పలువురు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాగా.. రెమల్ తుఫాను నేపథ్యంలో గౌహతి అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి కోల్‌కతాకు వెళ్లే 14 విమానాలను రద్దు చేసింది. తుఫాను కారణంగా పలు విమానయాన సంస్థలకు చెందిన విమానాలు రద్దు చేసినట్లు గౌహతిలోని లోక్‌ప్రియ గోపీనాథ్ బోర్డోలోయ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చెందిన సీనియర్ అధికారి తెలిపారు.
పాములంటే సాధారణంగా అందరికీ భయమే.. వాటిని చూస్తే కొందరికైతే చెమటలు పట్టేస్తాయి. ఎక్కడో దూరం నుంచి చూసినా కానీ.. కొందరు భయపడిపోతారు. అయితే.. సోషల్ మీడియాలో పాములకు సంబంధించిన వీడియోలు ఎన్నో వస్తుండటంతో కాస్త భయం తగ్గుతుంది. అయినప్పటికీ రియల్‌గా పామును చూస్తే భయపడే వారు ఎంతో మంది ఉన్నారు.
అమెరికాలోని ఫ్లోరిడాలోని బోకా రాటన్ ఫ్లోరిడా అట్లాంటిక్ యూనివర్సిటీలో చదువుతున్న తెలంగాణకు చెందిన విద్యార్థి రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిపల్లి గ్రామానికి చెందిన సౌమ్యను ఫ్లోరిడాలో ఆదివారం నాడు వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది, దీంతో.. ఆమె వెంటనే అక్కడికక్కడే మృతి చెందింది. సౌమ్య ఫ్లోరిడా అట్లాంటిక్ యూనివర్శిటీలో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసి, కన్సల్టెన్సీ ద్వారా ఉద్యోగం కోసం ప్రయత్నిస్తోంది. ఇక్కడ ఆమె కుటుంబ సభ్యులు ప్రకారం, సౌమ్య తన…
పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్యాసింజర్ వ్యాన్, ట్రక్కు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో మహిళలు, చిన్నారులు సహా ఒకే కుటుంబానికి చెందిన 13 మంది మృతి చెందారు. మరో తొమ్మిది మంది గాయపడినట్లు అధికారులు తెలిపారు. లాహోర్‌కు 350 కిలోమీటర్ల దూరంలోని ముజఫర్‌గఢ్ జిల్లాలో ఆదివారం ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. ఎమర్జెన్సీ సర్వీస్ 1122 ప్రకారం.. ప్యాసింజర్ వ్యాన్, ట్రక్కు ఢీకొనడంతో చాలా మంది అక్కడికక్కడే మరణించారు. అధికారులు తెలిపిన…
ఐపీఎల్ ఫైనల్లో కోల్‌కతా నైట్‌రైడర్స్ చేతిలో సన్ రైజర్స్ హైదరాబాద్ ఓడిపోయింది. దీంతో.. ఎస్ఆర్హెచ్ టీమ్ మొత్తం తీవ్ర నిరాశలో ఉంది. ఈ క్రమంలో.. తమ ప్లేయర్లకు జట్టు యజమాని కావ్యా మారన్ ధైర్యం నింపారు. 'మీరు మమ్మల్ని గర్వపడేలా చేశారు. టీ20 క్రికెట్ ఎలా ఆడాలో నిరూపించారు. ఆరెంజ్ ఆర్మీ అభిమానులంతా కాలర్ ఎగిరేసేలా అత్యుత్తమ ప్రదర్శన కనబర్చారు. ఫైనల్లో ఓడటం బాధాకరం. బౌలింగ్, బ్యాటింగ్ అన్ని విభాగాల్లో రాణించారని చెప్పుకొచ్చింది.