Donald Trump: పోర్న్ స్టార్‌కు రహస్యంగా డబ్బు చెల్లించిన కేసులో దోషిగా తేలిన ట్రంప్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Donald Trump: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు మరో షాక్ తగిలింది. పోర్న్ స్టార్ స్టార్మీ డేనియల్ తో సంబంధం బయటపడకుండా అనైతిక ఆర్థిక ఒప్పందం చేసుకున్నారన్న కేసులో.. ట్రంప్ దోషిగా తేలిపోయారు. ఈ మేరకు.. ఆయనపై మోపిన మొత్తం 34 నేరాభియోగాలు నిజమేనని న్యూయార్క్ కోర్టు తీర్పును ఇచ్చింది. అయితే, ఇంకో 5 నెలల్లో జరగనున్న 2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలిచి, తిరిగి అధ్యక్ష పదవి చేపట్టాలని అనుకుంటున్న ట్రంప్ కు.. తాజా తీర్పుతో గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లు అయింది. సంబంధిత కేసు కోసం మాన్హాటన్లోని కోర్టుకు మాజీ అధ్యక్షుడు వెళ్లాడు. జడ్జి మాటలు వింటూ సైలెంట్ గా ఉండిపోయారు. కానీ, కోర్టు బయటకు వచ్చి, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ ప్రభుత్వం తన మీద చేస్తున్న కుట్ర అని ఆరోపణలు చేశారు. కోర్టులో కూడా రిగ్గింగ్ జరిగింది.. కానీ నవంబర్ లో జరిగే అధ్యక్ష ఎన్నికల తర్వాత ప్రజలే నిజమైన తీర్పును ఇస్తారని డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు.
Read Also: Prajawal Revanna : బెంగుళూరు చేరుకున్న ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ అరెస్ట్ .. నేడు కోర్టులో హాజరు
Also Read
అమెరికాలో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దోషిగా తేలడం చాలా అరుదైన ఘటన. కానీ.. దోషిగా తేలినప్పటికీ, చట్ట ప్రకారం ట్రంప్.. 2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయొచ్చు.. పోర్న్ స్టార్మీ డేనియల్ తో కేసులో ఆయనకు జైలు శిక్ష పడినా.. అధ్యక్ష ఎన్నికల బరిలో దిగే ఛాన్స్ ఉంది. ఈ కేసుకు సంబంధించి.. జులై 11వ తేదీన కీలక తీర్పును న్యూయార్క్ కోర్టు వెల్లడించనుంది. సరిగ్గా అందుకు కొన్ని రోజుల ముందే.. మిల్వాకీలో రిపబ్లికెన్ నేషనల్ కన్వెన్షన్ జరగనుంది. ఈ ఈవెంట్లో.. డెమొక్రటిక్ అభ్యర్థి జో బైడెన్ కి పోటీగా డొనాల్డ్ ట్రంప్ ని రిపబ్లిక్ పార్టీ అధికారికంగా ఎంపిక చేసే ఛాన్స్ ఉంది. కాగా, ఈ నిర్ణయాన్ని ట్రంప్ న్యాయవాద బృందం సవాలు చేయనుంది.
తాజావార్తలు
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
-
ED Raids : అమెరికన్లకు ఫేక్ కాల్స్.. భారత్‌లో ఈడీ మెరుపు దాడులు.!
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్‌ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!