World Traveller: అమ్మ చివరి కోరిక నెరవేర్చేందుకు 100 దేశాల యాత్రకు శ్రీకారం చుట్టినట్లు నగరానికి చెందిన ఐటీ నిపుణుడు రామకృష్ణ తెలిపారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రపంచంలో స్వచ్ఛమైనది ఏదైనా ఉంది అంటే తల్లి ప్రేమ ఒకటేనని అన్నారు. తాను పది నెలల వయసులో బావిలో పడి అనారోగ్య బారిన పడ్డ అమ్మ జ్యోతిర్మయి 2023లో మృతి చెందిందని అన్నారు. నవల రచయిత్రి ఆయన తన తల్లి ప్రస్తుత సామాజిక మాధ్యమాలలో పిల్లల కోసం తాను రాసిన కథలను ప్రచారం చేయాలని కోరడంతో ప్రపంచ యాత్రకు స్వీకరం చుట్టినట్టు చెప్పారు. ఇప్పటికే 33 దేశాలు పూర్తి చేసిన తాను ఈ ఏడాది చివరి నాటికి 100 దేశాల పూర్తి చేయాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. ఏ దేశానికి వెళ్లినా ఆయా దేశాల విశిష్టతను, అక్కడి ప్రజల ఆచార సాంప్రదాయాలపై అవగాహన కల్పిస్తూ తీసిన వీడియోలను యూట్యూబ్ ఛానల్‌లో ప్రసారం చేస్తున్నట్లు చెప్పారు.