జగన్ రెడ్డి మోహన్ తన లండన్ పర్యటన నుండి శుక్రవారం కుటుంబ సభ్యులతో కలిసి తిరిగి ఏపీకి చేరుకున్నారు. లండన్ నుంచి రాష్ట్రానికి సీఎం కుటుంబం చేరుకుంది. గన్నవరం ఎయిర్ పోర్టులో సీఎం జగన్ మోహన్ రెడ్డికి ఎంపీలు విజయసాయిరెడ్డి, నందిగం సురేష్ ,మంత్రులు జోగి రమేష్, చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ,కారుమూరి నాగేశ్వరరావు, మేరుగ నాగార్జున,కొట్టు సత్యనారాయణ, ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ , వెలంపల్లి శ్రీనివాసరావు, కైలే అనిల్ కుమార్, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, టిజె, సుధాకర్ బాబు, కోన రఘుపతి, ముదునూరి ప్రసాదరాజు, శిల్పా చక్రపాణిరెడ్డి, రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి, తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, ఎమ్మెల్సీలు తలశిల రఘురాం, రుహుల్లా,మొండితోక అరుణ్ కుమార్, మైలవరం ఎమ్మెల్యే అభ్యర్ధి సర్నాల తిరుపతిరావు, విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యే అభ్యర్ధి షేక్ ఆసిఫ్,గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే అభ్యర్ధి నూర్ ఫాతిమా, ఏలూరు పార్లమెంట్ వైసీపీ అభ్యర్ధి కారుమూరి సునీల్ ఘనస్వాగతం పలికారు. అనంతరం విమానాశ్రయం నుంచి నేరుగా తాడేపల్లిలోని ఆయన నివాసానికి చేరుకున్నారు.
ఇక జూన్ 4వ తేదీన ఏపీ ఎన్నికల ఫలితాలు రానున్నాయి. దీంతో కౌంటింగ్ జరగనున్న నేపథ్యంలో పార్టీ పరంగా తీసుకోవాల్సిన చర్యలపై నేతలతో జగన్ చర్చించే అవకాశం ఉంది. పలు అంశాలపై దిశానిర్దేశం చేస్తారని తెలుస్తోంది. పోలింగ్ తర్వాత… రెస్ట్ మోడ్ లోకి వెళ్లి నేతలు కౌంటింగ్ వేళ తిరిగి యాక్టివ్ అవుతున్నారు. ఇప్పటికే పరస్పరం కౌంటర్లు, విమర్శలు చేసుకుంటున్నారు. కౌంటింగ్ కు సమయం దగ్గరపడుతున్న వేళ…. ఏపీ ఫలితాలపై మరింత ఉత్కంఠ పెరుగుతోంది.