తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా.. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ కొనసాగుతోంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.
మండలిలో కాంగ్రెస్, బీజేపీ ఎమ్మెల్సీలు పదే పదే అబద్దాలు చెబుతున్నారు.. దీని గుర్తించి తమ ఎమ్మెల్సీలు అడ్డుకునే ప్రయత్నం చేస్తే చైర్మన్ న్యూసెన్స్ చేయవద్దని కామెంట్ చేశారు. మండలి చైర్మన్గా న్యూసెన్స్ అనే పదం వాడారు.. దాన్ని రికార్డుల్లో నుంచి తొలగించాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు.
తెలంగాణ శాసన సభ, మండలి సమావేశాలు కొనసాగుతున్నాయి. మండలి ప్రారంభమైన కాసేపటికే శాసనమండలి ఆవరణలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు నిరసనకు దిగారు. పసుపుకు 15 వేల మద్దతు ధర చెల్లించాలని.. పసుపు రైతులను వెంటనే ఆదుకోవాలి అంటూ నిరసన చేపట్టారు.
పవన్ అన్న అంటూ లోకేష్ ట్వీట్.. మంత్రి స్పెషల్ విషెస్ జనసేన 12వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మంత్రి లోకేష్ స్పెషల్ ట్వీట్ వేశారు. పవన్ అన్నకు అంటూ ఆప్యాయంగా స్పందించారు. జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ అన్నకు ప్రత్యేక శుభాకాంక్షలు అంటూ రాసుకొచ్చారు. ఏపీ అభివృద్ధిలో జనసేన పనితీరు ఎంతో కీలకం అన్నారు. ఆ పార్టీ కమిట్ మెంట్ ఏపీ అభివృద్ధికి చాలా కీలకం అన్నారు. భవిష్యత్…
బంగ్లాదేశ్ యువతుల అక్రమ రవాణాపై ఈడీ దూకుడు.. బంగ్లాదేశ్ యువతుల అక్రమ రవాణాపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు దూకుడు పెంచారు. హైదరాబాద్ నగరంలోని బండ్లగూడలో నమోదైన కేసులో ఆస్తులను అటాచ్ చేసింది. బ్యూటిషన్, టైలరింగ్ పేరుతో హైదరాబాద్ వచ్చిన యువతులు.. వివిధ వృత్తుల పేరుతో హైదరాబాద్ వచ్చి వ్యభిచారం నిర్వహిస్తున్నారు. బంగ్లాదేశ్ యువతులను హైదరాబాద్ రప్పించి వ్యభిచారం చేయించిన ముఠా.. తాజాగా ఖైరతాబాద్, సనత్ నగర్, చాదర్ ఘాట్ లో మూడు కేసులు నమోదు చేశారు. ఇక,…
ఇంటర్మీడియట్ విద్యలో కీలక సంస్కరణలకు శ్రీకారం..! విస్తృత ప్రజాభిప్రాయ సేకరణ అనంతరం ఇంటర్మీడియట్ బోర్డులో సంస్కరణలకు రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పచ్చజెండా ఊపారు. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ 77వ సమావేశం అమరావతి అసెంబ్లీలోని పేషిలో మంత్రి లోకేష్ అధ్యక్షతన నిర్వహించారు. ఇంటర్మీడియట్లో విద్యలో నాణ్యత ప్రమాణాలను పెంపొందించి విద్యార్థులను ప్రభుత్వ జూనియర్ కాలేజీల వైపు ఆకర్షించేలా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రైవేటు కళాశాలలకు ధీటుగా ప్రభుత్వ జూనియర్…
తెలంగాణలో భారత్ సమ్మిట్ నిర్వహించబోతున్నాం.. ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా మీడియాతో చిట్ చాట్ లో పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో భారత్ సమ్మిట్ నిర్వహించబోతున్నాం.. దానికి సంబంధించినటువంటి అంశాలపై కేంద్ర విదేశాంగ శాఖ మంత్రితో ఇవాళ చర్చిస్తాను.. డీలిమిటేషన్ అనేది సౌత్ ను లిమిటేషన్ చేయడానికే.. డీలిమిటేషన్ పై తెలంగాణలో జరిగే అఖిలపక్ష సమావేశానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కచ్చితంగా హాజరు కావాలన్నారు. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించినటువంటి…
తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధినేత వైయస్ జగన్ను గురజాల నియోజకవర్గం మాచవరం మండలం పిన్నెల్లి గ్రామస్తులు కలిశారు. దాదాపు 400 వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరుల కుటుంబాలపై కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే గ్రామ బహిష్కరణ వేటు వేశారు. బహిష్కరించిన వారిలో అన్ని కుటుంబాలు మైనారిటీ, ఎస్సీ, బీసీలకు చెందినవే ఉన్నాయి. కాగా.. వచ్చే రెండు నెలల్లో ఛలో పిన్నెల్లి కార్యక్రమానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సిద్దమవుతుంది. ఈ క్రమంలో.. గ్రామ బహిష్కరణ విషయంపై…
పరుగులు పెడుతున్న పసిడి.. రూ. 490 పెరిగిన తులం గోల్డ్ ధర.. రూ. 2 వేలు పెరిగిన కిలో వెండి ధర బంగారం ధరలు జెట్ స్పీడ్ తో పరుగెడుతున్నాయి. పెరుగుతున్న ధరలు గోల్డ్ లవర్స్ ను కంగారు పెట్టేస్తున్నాయి. శుభకార్యాల వేళ పుత్తడి ధరలు ఆకాశాన్ని తాకుతుండడంతో కొనుగోలు దారులు వెనకడుగు వేస్తున్నారు. గత కొద్ది రోజులుగా పెరుగుతూ వస్తున్న గోల్డ్ ధరలు నేడు మళ్లీ పెరిగాయి. మళ్లీ అదే జోరు చూపిస్తున్నాయి. తులం బంగారంపై…
ఎస్ఎల్బీసీ టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్ 18వ రోజు కొనసాగుతుంది. ఈరోజు రోబోలతో రెస్క్యూ ఆపరేషన్ చేపడుతున్నారు. ఇప్పటికే టన్నెల్లోకి అన్వీ రోబో బృందం వెళ్లింది. డేంజర్ జోన్లో రోబోలతో తవ్వే ప్రయత్నం చేశారు. క్యాడవర్ డాగ్స్ గుర్తించిన రెండు చోట్ల తవ్వకాలు మొదలు పెట్టారు. కాగా.. సాయంత్రానికి రెండు మృతదేహాలు వెలికితీసే అవకాశం ఉంది.