ముంబైలో విషాదం చోటు చేసుకుంది. ఆదివారం క్రికెట్ మ్యాచ్ ఆడుతూ ఓ వ్యక్తి మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే.. ఆదివారం కశ్మీరా ప్రాంతంలోని ఓ ఫామ్‌హౌస్‌లో ఓ కంపెనీ తమ ఉద్యోగులకు క్రికెట్ మ్యాచ్‌ను నిర్వహించింది. అందులో పాల్గొన్న ఓ వ్యక్తి బంతిని గట్టిగా కొట్టాడు. అనంతరం ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే.. అతన్ని సమీప ఆస్పత్రికి తరలించారు. అయితే అక్కడికి చేరుకునేలోపే అతను చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. మృతుడు రామ్ గణేష్ తేవార్‌గా గుర్తించారు.
నిజామాబాద్ జిల్లా పార్లమెంట్ అభ్యర్థులు, ఇన్చార్జ్ మంత్రులు, ఏఐసీసీ సెక్రెటరీలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూమ్ మీటింగ్ నిర్వహించారు. జూమ్ సమావేశంలో ఏఐసీసీ ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు, ఏఐసీసీ సెక్రటరీలు, ఎంపీ అభ్యర్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. రేపు లోక్ సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు నేపథ్యంలో వారికి పలు సూచనలు చేశారు. పోటాపోటీ ఉన్న…
ఢిల్లీ నుంచి ముంబై వెళ్తున్న ఆకాస ఎయిర్ కు చెందిన విమానానికి సెక్యూరిటీ హెచ్చరిక రావడంతో అహ్మదాబాద్‌కు మళ్లించారు. విమానంలో ఒక చిన్నారి సహా 186 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది ఉన్నారు.
రేపు దేశవ్యాప్తంగా కౌంటింగ్ కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ వెల్లడించారు. ఏడు విడుతలుగా పోలింగ్ విజయవంతంగా జరిగిందన్నారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాలకు ముందు ఎన్నికల సంఘం విలేకరుల సమావేశంలో కౌంటింగ్‌కు సంబంధించి సీఈసీ రాజీవ్ కుమార్ కీలక విషయాలను వెల్లడించారు.
డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే తెలంగాణ పాలిసెట్ పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. పాలిసెట్ పరీక్షను మే 24న నిర్వహించిన సంగతి తెలిసిందే. తెలంగాణ వ్యాప్తంగా 82, 809 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు.
దేశంలో ఎండలు మండిపోతున్నాయి. ఉక్కపోతతో జనం అల్లాడిపోతున్నారు. వడదెబ్బ కారణంగా ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు. ఒడిశాలో గత మూడు రోజులుగా వడదెబ్బ కారణంగా 20 మంది మరణించారు. ఒడిశా తీవ్రమైన వేడిగాలులతో అల్లాడుతున్నట్లు అధికారిక ప్రకటన తెలిపింది.
మాల్దీవులు ఇజ్రాయెల్ పౌరులు తమ దేశంలోకి ప్రవేశించడాన్ని నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. పాలస్తీనాకు మద్దతుగా తీసుకున్న ఈ నిర్ణయాన్ని సాకారం చేసేందుకు హిందూ మహాసముద్రంలో ఉన్న ఈ ద్వీప దేశం చట్టపరమైన సవరణలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇజ్రాయెల్ పౌరులు తమ దేశంలోకి రాకుండా ఆ దేశ మంత్రిమండలి ఆదివారం ఒక తీర్మానాన్ని ఆమోదించింది.
ముస్లిం మెజారిటీ దేశమైన పాకిస్థాన్ లో ఓ మహిళకు అరుదైన గౌరవం లభించింది. పాక్ లో మెడికల్ కార్ప్స్లో పనిచేస్తున్న డాక్టర్ హెలెన్ మేరీ రాబర్ట్స్ బ్రిగేడియర్ ర్యాంక్ సాధించిన క్రైస్తవ, మైనారిటీ కమ్యూనిటీ నుంచి మొదటి మహిళగా చరిత్ర సృష్టించారు.
ఎగ్జిట్ పోల్స్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మూడోసారి చారిత్రాత్మక విజయం సాధిస్తారని అంచనా వేసిన తర్వాత భారత స్టాక్ మార్కెట్ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీ 50 సోమవారం రికార్డు స్థాయిలో ప్రారంభమయ్యాయి.
ఐరోపా దేశమైన పోర్చుగల్‌లో జరిగిన ఎయిర్ షోలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఎయిర్ షోలో భాగంగా గాల్లో విన్యాసాలు చేసే క్రమంలో రెండు విమానాలు పరస్పరం ఢీకొనగా.. ఓ పైలట్ మృతి చెందారు. మరో విమానంలోని పైలట్ గాయపడ్డారు.