ఆంధ్రప్రదేశ్లో కూటమి భారీ విజయం సాధించింది. ఎన్డీఏతో పొత్తు పెట్టుకున్న టీడీపీ, జనసేన ప్రభంజనం సృష్టించింది. ఈ సందర్భంగా.. టీడీపీ నేతలు విజయానందంలో మునిగితేలుతున్నారు. కాగా.. విజయంపై కమలాపురం టీడీపీ ఎమ్మెల్యే పుత్తా చైతన్య రెడ్డి మాట్లాడుతూ, ప్రజల నమ్మకాన్ని నిలుపుకుంటామని తెలిపారు. చంద్రబాబు, లోకేష్ పై నమ్మకంతో ప్రతిపక్షమే లేని మెజార్టీని ప్రజలు ఇచ్చారని తెలిపారు. 2019లో వైసీపీ ఇచ్చిన మోసాలు నమ్మి మోసపోయామని ప్రజలు భావించారని.. వాళ్ళ నాయకుడే ఓటమిని ఒప్పుకున్నారన్నారు. మరోవైపు.. ఈవీఎంలను ట్యాపరింగ్ చేయాల్సిన అవసరం తమకు లేదని తెలిపారు. అభివృద్ధిలో కలిసి పని చేస్తామంటే తాము కూడా కలిసి పనిచేయడానికి సిద్ధమని పేర్కొ్న్నారు. అవినీతిని బయటకు తీస్తామని తెలిపారు.
Read Also: CM Revanth Reddy: ఏపీ ఎన్నికల ఫలితాలపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పందన ఇదే.. !
మరోవైపు.. రాజంపేటలో టీడీపీ పార్లమెంట్ అధ్యక్షుడు చామర్తి జగన్ మోహన్ రాజు మాట్లాడుతూ.. రాష్ట్రంలో టీడీపీ అధికారంలో రావడం సంతోషకరమని అన్నారు. టీడీపీ గెలుపులో పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషించారని.. టీడీపీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు బర్తరఫ్ తరువాత జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఇటువంటి ఫలితాలు వచ్చాయన్నారు. తిరిగి అంతకన్నా దారుణ ఫలితాలను వైసీపీకి 11 సీట్లను ప్రజలు ఇచ్చారని తెలిపారు. దేశంలోనే టీడీపీ విజయం చారిత్రాత్మకమైందని.. రాజంపేటలో టీడీపీ అభ్యర్థి చిన్న చిన్న తప్పులతో ఓటమి చెందారని అన్నారు. భవిష్యత్తులో వాటిని సరిదిద్దుకుని ముందుకు సాగుతామని జగన్ మోహన్ రాజు తెలిపారు.
Read Also: Jr NTR: ప్రియమైన బాబు మావయ్య, బాలకృష్ణ బాబాయ్.. సంచలనం రేపుతున్న ఎన్టీఆర్ ట్వీట్