జమ్మూకశ్మీర్‌లోని పుల్వామాలో కాల్పులు కలకలం రేపాయి. జమ్మూకశ్మీర్‌లో ఈరోజు ఉదయం ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు జరిగినట్లు పోలీసులు తెలిపారు. పుల్వామా జిల్లాలోని నిహామా ప్రాంతంలో ఉగ్రవాదుల ఉనికి గురించి పోలీసులకు సమాచారం అందడంతో సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు.
MLC Kavitha: ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ రిమాండ్ నేటితో ముగియనుంది. ఢిల్లీ లిక్కర్ ఈడీ, సీబీఐ రెండు కేసుల్లో జ్యుడీషియల్ రిమాండ్ ముగియనుంది. తీహార్ జైలు అధికారులు నేడు రౌస్ అవెన్యూ కోర్టులో కవితను హాజరు పర్చనున్నారు.
పశ్చిమ బెంగాల్‌లోని బరాసత్, మథురాపూర్ లోక్‌సభ నియోజకవర్గాల్లో ఓట్ల లెక్కింపునకు ఒకరోజు ముందు సోమవారం ఒక్కో పోలింగ్ స్టేషన్లో రీపోలింగ్ నిర్వహించాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. కట్టుదిట్టమైన భద్రత మధ్య నేడు రీపోలింగ్ నిర్వహించనున్నారు. ఈ కేంద్రాల్లో జూన్ 1న ఓటింగ్ నిర్వహించగా.. అ ఫిర్యాదులు రావడంతో మళ్లీ ఇక్కడ ఓటింగ్ నిర్వహిస్తున్నారు.
లోక్‌సభ ఎన్నికలకు సంబంధించిన అన్ని దశలు పూర్తయిన తర్వాత ఒక వైపు దేశం ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తుండగా.. మరోవైపు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) ప్రజలకు పెద్ద షాక్ ఇచ్చింది. దేశవ్యాప్తంగా టోల్ పన్నును పెంచింది. ఈరోజు నుంచి అన్ని టోల్ ప్లాజాల వద్ద వాహనదారులు 5 శాతం అదనంగా టోల్ ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది.
దేశంలో 7 దశలలో జరిగిన లోక్ సభ ఎన్నికలు-2024తో పాటు రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌కు సమయం ఆసన్నమైంది. దేశంలోని ప్రజలంతా ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఎన్నికల కౌంటింగ్ రేపు(మంగళవారం) జరగనుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ క్రమంలోనే ఎన్నికల సంఘం కీలక ప్రకటన చేసింది.
రాజస్థాన్ రాష్ట్రంలోని బార్మర్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఓ మహిళ తన నలుగురు పిల్లలను తానే వాటర్ ట్యాంక్‌లో పడేసింది. అనంతరం ఆమె కూడా ట్యాంక్‌లో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనలో నలుగురు పిల్లలు ప్రాణాలు కోల్పోయారు.
కృష్ణా జిల్లాలో పటిష్ట భద్రత మధ్య ఓట్ల లెక్కింపునకు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ఈసీఐ మార్గదర్శకాలకు అనుగుణంగా ఈవీఎం ఓట్లు, పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. మచిలీపట్నం పార్లమెంటు, 7 అసెంబ్లీ స్థానాల ఓట్ల లెక్కింపునకు 14 చొప్పున కౌంటింగ్ టేబుళ్లను ఏర్పాటు చేశారు.
అన్నమయ్య జిల్లా రాయచోటిలోని ఎస్పీ కార్యాలయంలో ఏఆర్ మహిళా కానిస్టేబుల్ వేదవతి (29) ఆత్మహత్య చేసుకుంది. ఎస్పీ కార్యాలయంలోని సెక్యూరిటీ గార్డ్ రూమ్‌లో తన వద్ద ఉన్న సర్వీస్ తుపాకితో కాల్చుకొని ఏఆర్ మహిళా కానిస్టేబుల్ వేదవతి ఆత్మహత్య చేసుకుంది.