Youngest MP: ఇండియాలో అతిపిన్న వయస్సు గల ఎంపీ ఎవరో తెలుసా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
2024 ఎన్నికలకు సంబంధించి మంగళవారం ఫలితాలు వెలువడ్డాయి. ఈ ఫలితాల్లో ఎన్డీఏ విజయం సాధించింది. కాంగ్రెస్ బలమైన ప్రతిపక్షంగా నిలిచింది. కాగా.. ఈ ఎన్నికల్లో కొందరు ముఖ్యమైన ఓటమిపాలైతే.. మరికొందరు తొలిసారిగా పార్లమెంట్ లో అడుగుపెట్టనున్నారు. కాగా.. నిన్న గెలిచిన వారిలో కాంగ్రెస్ ఎంపీగా సంజనా జాతవ్ కూడా ఉన్నారు. ఈమె ఇండియాలో అతిపిన్న వయస్సు గల ఎంపీ.. రాజస్థాన్‌లోని భరత్‌పూర్ లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ తరుఫున విజయం సాధించింది. సంజనా జాతవ్ వయస్సు (25). జాతవ్ 51,983 ఓట్లతో బీజేపీ అభ్యర్థి రాంస్వరూప్ కోలీపై విజయం సాధించారు.
Read Also: Devendra Fadnavis: బీజేపీ పరాజయానికి బాధ్యత నాదే.. డిప్యూటీ సీఎంకు పదవికి రాజీనామా..?
Also Read
- Abhijeet Dipke Controversy: రామ మందిర CEOపై తప్పుడు వీడియో.. అభిజీత్ దీప్కేపై విమర్శలు..
- Vaibhav Sooryavanshi: చిన్న వయసులోనే ఊహించని పాపులారిటీ.. వైభవ్ వైభవ్ అంటూ మాస్ మేనియా..
- India Diesel Exports: రష్యా, అమెరికాను వెనక్కి నెట్టి.. యూరప్ డీజిల్ సరఫరాలో భారత్ టాప్
- Nepal Earthquake: ఓ వైపు వరద విలయం.. నేపాల్‌లో భూకంపం..
సంజనా జాతవ్ వివరాలు:
సంజనా జాతవ్ (25) దళిత వర్గానికి చెందిన సభ్యురాలు. 18వ లోక్‌సభకు ఎన్నికైన అతి పిన్న వయస్కురాలైన పార్లమెంటు సభ్యులలో ఒకరు. ఈమె 2019లో మహారాజా సూరజ్మల్ బ్రిజ్ విశ్వవిద్యాలయం నుండి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. జాతవ్ రాజస్థాన్‌లో పనిచేస్తున్న పోలీస్ కానిస్టేబుల్ కప్తాన్ సింగ్‌ను వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. ఎన్నికల కమిషన్‌కు సమర్పించిన అఫిడవిట్‌లో జాతవ్ మొత్తం ఆస్తుల విలువ రూ. 23 లక్షలు.. అప్పులు రూ. 7 లక్షలుగా ప్రకటించారు.
2023 రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలలో జాతవ్ 409 ఓట్ల స్వల్ప తేడాతో బీజేపీ అభ్యర్థి రమేష్ ఖేడి చేతిలో ఓడిపోయారు. ఓటమి నిరాశను తన మనసులో దాచుకుని.. ఆమె లోక్‌సభ ఎన్నికల కోసం ఉత్సాహంగా ప్రచారం నిర్వహించింది. 2019 ఎన్నికలలో ఖాతా తెరవడంలో విఫలమైన కాంగ్రెస్ పార్టీకి చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. ఇటీవల ముగిసిన లోక్‌సభ ఎన్నికల్లో రాజస్థాన్‌లోని 25 స్థానాలకు గాను బీజేపీ 14 స్థానాలను కైవసం చేసుకుంది. రాష్ట్రంలో ఎనిమిది స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్), రాష్ట్రీయ లోక్‌తాంత్రిక్ పార్టీ (ఆర్‌ఎల్‌పి), భారతీయ అఖిల్ కాంగ్రెస్ (బిఎసి) ఒక్కో స్థానాన్ని దక్కించుకున్నాయి.
తాజావార్తలు
-
Mahesh Kumar Goud : బీఆర్ఎస్ అప్పులపై మహేష్ గౌడ్ సవాల్.. ‘చర్చకు వస్తారా?’
-
Abhijeet Dipke Controversy: రామ మందిర CEOపై తప్పుడు వీడియో.. అభిజీత్ దీప్కేపై విమర్శలు..
-
Vaibhav Sooryavanshi: చిన్న వయసులోనే ఊహించని పాపులారిటీ.. వైభవ్ వైభవ్ అంటూ మాస్ మేనియా..
-
India Diesel Exports: రష్యా, అమెరికాను వెనక్కి నెట్టి.. యూరప్ డీజిల్ సరఫరాలో భారత్ టాప్
-
Nepal Earthquake: ఓ వైపు వరద విలయం.. నేపాల్‌లో భూకంపం..
ట్రెండింగ్
-
Asia Cup 2026: భారత్ చేతిలో 55 పరుగులకే ఆలౌట్.. అయినా పాక్‌దే ఆసియా కప్ టైటిల్ అంటున్న కోచ్!
-
Harmanpreet Kaur History: హర్మన్‌ప్రీత్ కౌర్ నయా చరిత్ర.. క్రికెట్ హిస్టరీలోనే మొట్టమొదటి కెప్టెన్!
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!