టీ20 వరల్డ్ కప్ 2024లో భాగంగా.. టీమిండియా తొలి మ్యాచ్ ఐర్లాండ్ తో ఆడుతుంది. ఈ క్రమంలో టాస్ ఓడిపోయి మొదట బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్.. 96 పరుగులకే ఆలౌటైంది. టీమిండియా బౌలర్లు చెలరేగడంతో స్వల్ప స్కోరుకే కట్టడి చేశారు. పూర్తిగా 20 ఓవర్లు ఆడకుండా.. కేవలం 16 ఓవర్లు మాత్రమే ఆడగలిగారు. ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యా ఐర్లాండ్ బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. 3 వికెట్లతో చెలరేగాడు. ఇక.. ఐర్లాండ్ బ్యాటింగ్ విషయానికొస్తే, గారెత్ డెలానీ ఒక్కడే అత్యధికంగా (26) పరుగులు చేయగలిగాడు. మిగతా బ్యాటర్లంతా 20 లోపు స్కోరుకే పెవిలియన్ బాట పట్టారు.
Read Also: INDIA bloc: ఇండియా కూటమి కీలక నిర్ణయం
ఐర్లాండ్ బ్యాటింగ్లో ఓపెనర్లు ఆండీ బల్బిర్నీ (5), పాల్ స్టిర్లింగ్ (2) శుభారంభాన్ని అందించలేకపోయారు. ఆ తర్వాత లోర్కాన్ టక్కర్ (10), హ్యారీ టెక్టర్ (4), కర్టిస్ కాంఫర్ (12), జార్జ్ డాక్రెల్ (3), మార్క్ అడైర్ (3), జోష్ లిటిల్ (14) పరుగులు చేశారు. టీమిండియా బౌలర్లలో అందరూ వికెట్లు తీయగలిగారు. హార్ధిక్ పాండ్యా 3 వికెట్లతో రెచ్చిపోయాడు. ఆ తర్వాత.. అర్ష్దీప్ సింగ్, బుమ్రా తలో రెండో వికెట్లతో చెలరేగారు. ఆ తర్వాత మహమ్మద్ సిరాజ్, అక్షర్ పటేల్ తలో వికెట్ సాధించగలిగారు.
Read Also: Rahul gandhi: రాయ్‌బరేలీ, వయనాడ్.. ఏది వదులుకుంటారు?