Gorantla Butchaiah Chowdary: ఈ నెల 11న టీడీఎల్పీ సమావేశం జరుగుతుందని తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యుడు, టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి వెల్లడించారు. టీడీఎల్పీలో చంద్రబాబుని నేతగా ఎన్నుకుని గవర్నర్ కు నివేదిక పంపుతామన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గా చంద్రబాబు ప్రమాణ స్వీకారం 12న ఉంటుందన్నారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ప్రధాని మోడీ సహా వివిధ పార్టీల నేతల్ని ఆహ్వానిస్తున్నామన్నారు. ప్రధాని ప్రమాణ స్వీకారంతో పాటు ఒడిశా కూడా చంద్రబాబు వెళ్తారని బుచ్చయ్య చౌదరి తెలిపారు. దొంగే దొంగా దొంగా అని ఏడ్చే విధానాలు ఓటమి చూశాక కూడా జగన్ మారలేదని విమర్శించారు. అసహనంతో తెలుగుదేశం శ్రేణులపై దాడుల్ని ప్రేరేపిస్తూ మేమేదో దాడులు చేస్తున్నట్లు అసత్య ప్రచారాలు చేస్తున్నాడని ఆయన మండిపడ్డారు.
Read Also: Chandrababu: ప్రజా తీర్పుతో ఎవరూ ఆకాశంలో ఎగరొద్దు.. ఎంపీలకు చంద్రబాబు దిశానిర్దేశం