శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో టీడీపీ కార్యకర్తలు , అభిమానుల మధ్య బాలయ్య తన జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారు. సుగూరు ఆంజనేయస్వామి దేవాలయం వద్ద ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రత్యేక పూజలు నిర్వహించారు.
బీహార్ రాష్ట్రంలోని గయ జిల్లాలో రైలు ప్రమాదం తృటిలో తప్పిపోయింది. దీంతో ప్రయాణికులు ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. ఈస్ట్ సెంట్రల్ రైల్వే గ్రాండ్ కార్డ్ రైల్వే సెక్షన్లో ఈ రైలు ప్రమాదం జరిగింది.
ఇటీవల కురిసిన వర్షాల వల్ల జలాశయాలకు వరద నీరు వచ్చి చేరుతోంది. శ్రీశైలం జలాశయానికి వరద నీరు స్వల్పంగా ప్రారంభమైంది. ఎగువ పరివాహక ప్రాంతమైన సుంకేసుల జలాశయం నుంచి 4,052 క్యూసెక్కుల వరద నీరు శ్రీశైలం జలాశయానికి వచ్చి చేరుతోంది.
ఏపీ కొత్త ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చురుకుగా కొనసాగుతున్నాయి. బుధవారం ఉదయం 11.27 గంటలకు గన్నవరం సమీపంలో కేసరపల్లిలో ప్రమాణస్వీకారం జరగనుంది. ఈ కార్యక్రమం కోసం అధికారులు ఏర్పాట్లను ముమ్మరం చేశారు. ప్రధాని మోడీ సహా పలువురు జాతీయ నేతలు హాజరుకానుండడంతో ఎలాంటి లోటుపాట్లు లేకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
ఉత్తర కొరియా, దక్షిణ కొరియా మధ్య ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుంది. గతంలో ఇరు దేశాలు క్షిపణులతో ఒకరిపై ఒకరు దాడి చేసుకునేవారు. అయితే ఇప్పుడు చెత్తతో నిండిన బెలూన్లతో ఇరు దేశాలు పరస్పరం స్పందిస్తున్నాయి.
కలియుగ దైవం తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనం కోసం టోకెన్ లేని భక్తులకు 16 గంటల సమయం పడుతోంది. ఉచిత సర్వదర్శనానికి 31 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.
కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బీజేపీలో సంస్థాగత స్థాయి మార్పుల ప్రక్రియ ప్రారంభం కానుంది. కొత్త జాతీయ అధ్యక్షుడి ఎంపిక పెండింగ్లో ఉంది. ఇప్పుడు జేపీ నడ్డా ప్రభుత్వంలో చేరిన తర్వాత.. పార్టీకి కొత్త జాతీయ అధ్యక్షుడు వస్తారనే విషయం మరింత స్పష్టమైంది. అధ్యక్షుడిగా నడ్డా పదవీకాలం జనవరిలో పూర్తి కావడంతో లోక్సభ ఎన్నికల వరకు పొడిగించారు.
కేంద్ర మంత్రి పదవి లభించడం పట్ల బీజేపీ ఎంపీ బండి సంజయ్ స్పందించారు. ఈరోజు చాలా ఆనందంగా ఉందని.. తనపై నమ్మకం ఉంచి కేంద్ర మంత్రివర్గంలో చోటు కల్పించిన ప్రధానమంత్రి నరేంద్రమోడీకి, జాతీయ నాయకత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్లో వేసవి సెలవులను ఈ నెల 12 వరకు పొడిగిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. షెడ్యూల్ ప్రకారం 12న పాఠశాలలు పునఃప్రారంభం కావాల్సి ఉండగా.. తాజా మార్పుతో 13న రీఓపెన్ అవుతాయని సర్కారు తెలిపింది.