Chandrababu: శాఖల కేటాయింపుపై చంద్రబాబు కసరత్తు.. ఎవరెవరికి ఏయే శాఖలంటే?
- ఏపీలో కొలువుదీరిన నూతన సర్కారు
- శాఖల కేటాయింపుపై చంద్రబాబు కసరత్తు!
- ఎవరెవరికి ఏ శాఖలు?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chandrababu: ఆంధ్రప్రదేశ్‌లో నూతన సర్కారు కొలువుదీరింది. మంత్రివర్గం ప్రమాణస్వీకారం ముగిసింది. కొత్త ప్రభుత్వం ఏర్పడడంతో టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు, కార్యకర్తలు రాష్ట్రవ్యాప్తంగా సంబరాలు జరుపుకుంటున్నారు. కానీ ఇప్పుడు ఎవరెవరికి ఏయే శాఖలు కేటాయిస్తారనే అంశంపై విస్తృతంగా చర్చ జరుగుతోంది. ప్రమాణ స్వీకారం అనంతరం సీఎం చంద్రబాబు తన నివాసానికి చేరుకున్నారు. ఈ క్రమంలోనే ఏపీ సీఎం చంద్రబాబు శాఖల కేటాయింపుపై కసరత్తు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. ఎవరెవరికి ఏయే శాఖలు కేటాయించాలనే అంశంపై తర్జన భర్జన జరగనుంది. పోలవరం, అమరావతి నిర్మాణాలకు చంద్రబాబు సర్కార్ హై ప్రయార్టీ ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఇరిగేషన్, పట్టణాభివృద్ధి శాఖల పరిధిలో పోలవరం, అమరావతి నిర్మాణాల వ్యవహారం ఉంటుంది. ఈ క్రమంలోనే ఈ కీలక శాఖలను ఎవరికి అప్పగిస్తారనే దానిపై చర్చ జరుగుతోంది.
Read Also: AP New Ministers: ప్రమాణ స్వీకారం చేసిన ఏపీ మంత్రులు వీరే..
Also Read
పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీ కీలక శాఖలను ఆశిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. హోం శాఖ పవన్‌కు వెళ్తుందనే విస్తృత ప్రచారం జరుగుతుండగా.. పరిశ్రమలు, స్కిల్ డెవలప్మెంట్, వ్యవసాయం, ఇంధన శాఖలపై టీడీపీ వద్దే ఉంటాయా..? లేక జనసేనకు వెళ్తుందా..? అనేది చర్చనీయాంశమైంది. ఓ వైపు లోకేష్‌కు విద్యాశాఖ అని ప్రచారం జరగుతుండగా.. మరోవైపు గతంలోని శాఖలే కేటాయించవచ్చనే ప్రచారాలు జరుగుతున్నాయి. ఆర్థిక శాఖ పయ్యావులకు లేదా ఆనంకు కేటాయించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. వంగలపూడి అనితకు కీలక శాఖలు కట్టబెట్టే అవకాశాలు కూడా లేకపోలేదని కూటమి కార్యకర్తల్లో చర్చ జరుగుతోంది. పట్టణాభివృద్ధిని నారాయణకు కట్టబెడతారా..? లేక సీఎం వద్దే ఉంచుకుంటారా..? అనే చర్చ విస్తృతంగా జరుగుతోంది. ఈ రోజు సాయంత్రం చంద్రబాబు తిరుమలకు వెళ్లనున్న సంగతి తెలిసిందే. ఈ లోపే శాఖలు కేటాయించే అవకాశం ఉంది. ఎవరికి ఏ శాఖలు కేటాయిస్తారో అధికారిక నిర్ణయం వచ్చేవరకు వేచి చూడాల్సిందే.
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?