Chandrababu Naidu Oath Ceremony Live Updates: ఏపీ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఉదయం 11.27 గంటలకు శుక్లపక్ష షష్టి తిథి వేళ కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరపల్లిలోని సభాప్రాంగణంలో చంద్రబాబు ప్రమాణస్వీకారం చేస్తారు. చంద్రబాబుతో పాటు 24 మంది మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రభుత్వంలో మంత్రులుగా బాధ్యతలు చేపట్టనున్న వారి జాబితాను మంగళవారం అర్ధరాత్రి దాటాక విడుదల చేశారు. మొత్తం 24 మందికి ఈ జాబితాలో చోటు దక్కగా.. జనసేన నుంచి ముగ్గురికి, బీజేపీ నుంచి ఒకరికి మంత్రి పదవి లభించింది. ఇదిలా ఉండగా.. కేబినెట్‌లో 17 మంది కొత్తవారే ఉండడం గమనార్హం. మొత్తంగా 17 మంది తొలిసారి మంత్రి పదవి చేపట్టనున్నారు. వీరిలో 10 మంది తొలిసారి ఎమ్మెల్యేలుగా గెలిచారు. చంద్రబాబు ప్రమాణస్వీకారం కార్యక్రమం లైవ్ అప్‌డేట్స్ మీ కోసం..
మెగా బ్రదర్స్ తో ప్రధాని నరేంద్ర మోడీ సందడి.. ప్రమాణస్వీకారం తర్వాత చిరంజీవి, పవన్ కళ్యాణ్ తో ప్రత్యేకంగా మాట్లాడిన మోడీ.. చిరంజీవి, పవన్ చేతులు పట్టుకొని ప్రజలకు అభివాదం..
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి వెంకటేశ్వర స్వామి వారి జ్ఞాపికను అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి పవన్ కళ్యాణ్
ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు మంత్రివర్గ సభ్యులు, గవర్నర్ అబ్దుల్ నజీర్ తో ప్రధాని మోడీ గ్రూప్ ఫోటో
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి ప్రమాణస్వీకారం
ఏపీ రాష్ట్ర మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన కొండపల్లి శ్రీనివాస్
ఏపీ మంత్రిగా వాసంశెట్టి సుభాష్ తో ప్రమాణం చేయించిన గవర్నర్ అబ్దుల్ నజీర్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా సంజీవరెడ్డి గారి సవిత ప్రమాణస్వీకారం
ఏపీ మంత్రిగా టీజీ భారత్ తో ప్రమాణస్వీకారం చేయించిన గవర్నర్ అబ్దుల్ నజీర్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంత్రిగా బీసీ జనార్దన్ రెడ్డి ప్రమాణస్వీకారం
ఏపీ మంత్రిగా గుమ్మడి సంధ్యారాణితో ప్రమాణస్వీకారం చేయించిన గవర్నర్
ఏపీ రాష్ట్ర మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన కందుల దుర్గేష్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా గొట్టిపాటి రవి కుమార్ ప్రమాణస్వీకారం
ఏపీ మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన డోలా బాల వీరాంజనేయ స్వామి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా కొలుసు పార్థసారథితో ప్రమాణస్వీకారం చేయించిన గవర్నర్
ఏపీ మంత్రిగా అనగాని సత్యప్రసాద్ ప్రమాణ స్వీకారం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా పయ్యావుల కేశవ్ తో ప్రమాణం చేయించిన గవర్నర్ అబ్దుల్ నజీర్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా ఆనం రామనారాయణరెడ్డి ప్రమాణస్వీకారం
ఏపీ మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన నాస్యం మహమ్మద్ ఫరూఖ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా డాక్టర్ నిమ్మల రామానాయుడు ప్రమాణస్వీకారం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా సత్యకుమార్ యాదవ్ తో ప్రమాణం చేయించిన గవర్నర్
ఏపీ మంత్రిగా వంగలపూడి అనిత ప్రమాణస్వీకారం
ఏపీ రాష్ట్ర మంత్రిగా పొంగూరు నారాయణతో ప్రమాణం చేయించిన గవర్నర్ అబ్దుల్ నజీర్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా ప్రమాణం చేసిన నాదెండ్ల మనోహార్
ఏపీ మంత్రిగా కొల్లు రవీంద్రతో ప్రమాణ స్వీకారం చేయించిన గవర్నర్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా కింజరాపు అచ్చెన్నాయుడితో ప్రమాణం చేయించిన గవర్నర్ నజీర్
ఏపీ రాష్ట్ర మంత్రిగా నారా లోకేశ్ తో ప్రమాణం చేయించిన గవర్నర్
ప్రమాణస్వీకార వేదికపైనే అన్న చిరంజీవి కాళ్లు మొక్కిన పవన్ కళ్యాణ్
ఏపీ మంత్రిగా పవన్ కళ్యాణ్ తో ప్రమాణస్వీకారం చేయించిన గవర్నర్ అబ్దుల్ నజీర్
ప్రమాణ స్వీకార వేదికపై నారా చంద్రబాబుని కౌగిలించుకున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడితో ప్రమాణ స్వీకారం చేయించిన గవర్నర్ అబ్దుల్ నజీర్
సభా ప్రాంగణానికి చేరుకున్న ప్రధాని మోడీ, చంద్రబాబు..
చంద్రబాబు ప్రమాణస్వీకార వేదికపైకి కలిసొచ్చిన అక్కా చెల్లెళ్లు పురంధేశ్వరి, భువనేశ్వరి..
సభా వేదికపై తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్.. చిరంజీవి, రజనీకాంత్, బాలకృష్ణలను పలకరించిన తమిళిసై
కేసరపల్లికి ఒకే కారులో చేరుకున్న ప్రధాని మోడీ, చంద్రబాబు..
చంద్రబాబు ప్రమాణస్వీకారం వేదికపై కేంద్రమంత్రులు జేపీ నడ్డా, నితిన్ గడ్కరీ, అమిత్ షా, రామ్మోహన్ నాయుడు, చిరాగ్ పాశ్వాన్, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్.వీ.రమణ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే, మధ్యప్రదేష్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్
గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న ప్రధాని మోడీ.. ప్రధాని మోడీకి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఘన స్వాగతం..
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంను పలకరించిన నారా లోకేశ్..
గన్నవరం ఎయిర్‌పోర్టుకు టీడీపీ అధినేత చంద్రబాబు చేరుకున్నారు. ప్రధాని మోడీకి స్వాగతం పలికేందుకు చంద్రబాబు విచ్చేశారు.
సభా వేదికపైనా చిరంజీవి, రజనీకాంత్ దంపతలు..
ఏపీ సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవంలో మెగా- నందమూరి ఫ్యామిలీలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. చిరంజీవి, బాలకృష్ణలు వేదికపైకి వచ్చి అందరినీ పలకరించారు. చిరంజీవికి బాలకృష్ణ సాదర స్వాగతం పలికారు. అభిమానులకు బాలయ్య అభివాదం చేయడంతో 'జై బాలయ్య' అంటూ సభా ప్రాంగణం మారుమోగింది.
చంద్రబాబు ప్రమాణస్వీకారం వేదిక దగ్గరకు చేరుకున్న నందమూరి కుటుంబం.. హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ఆయన భార్య వసుంధర, కూతుళ్లు
విజయవాడ నుంచి కేసరపల్లికి బస్సులో బయలుదేరిన మెగా ఫ్యామిలీ
కేసరపల్లిలో చంద్రబాబు ప్రమాణస్వీకారానికి భారీగా ఏర్పాట్లు.. 80 అడుగుల వెడల్పు.. 60 అడుగుల పొడవు, 8 అడుగుల ఎత్తుతో స్టేజీ.. 3.5 ఎకరాల్లో ప్రధాన వేదిక, వీఐపీ గ్యాలరీ.. 11.5 ఎకరాల్లో నేతలు, ప్రజల కోసం గ్యాలరీలు..
నాలుగోసారి సీఎంగా చంద్రబాబు ప్రమాణస్వీకారం.. చంద్రబాబుతో పాటు 24మంది మంత్రుల ప్రమాణం.. హాజరుకానున్న ప్రధాని మోడీ, అమిత్ షా, కేంద్రమంత్రులు సహా పలు రాష్ట్రాలు సీఎంలు.. హాజరుకానున్న చిరంజీవి, రజనీకాంత్..
ఏలూరు జిల్లాలో నేషనల్ హైవే 16పై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ఏపీ సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి భారీ వాహనాలు వస్తుండడంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. దూర ప్రాంతాల నుంచి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వస్తున్న వాహనాలను పోలీసులు వెనక్కి పంపుతున్నారు. కలపరు, పొట్టిపాడు టోల్‌గేట్ల వద్ద వాహనాలు వెనుదిరగిపోవాలని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు.
కాసేపట్లో గన్నవరం ఎయిర్ పోర్టుకు చంద్రబాబు.. ప్రధాని మోడీకి స్వాగతం పలకనున్న చంద్రబాబు.. ఉదయం 10.40కి గన్నవరం విమానాశ్రయంలో దిగనున్న ప్రధాని మోడీ..
ఏపీ సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి భారీగా అభిమానులు తరలివస్తున్నారు. పొట్టిపాడు టోల్‌ప్లాజా వద్ద భారీగా వాహనాల రద్దీ నెలకొంది. రెండు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.
చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమం నేపథ్యంలో 16 నెంబర్ జాతీయ రహదారిపై పోలీసుల ఆంక్షలు విధించారు. పాసులు ఉన్నవారికి మాత్రమే అనుమతి ఇస్తున్నారు. ఏలూరు సమీపంలోని కలపర్రు టోల్ గేట్, హనుమాన్ జంక్షన్ హైవేపై పోలీసులు చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. పాసులు ఉన్న వారిని మాత్రమే విజయవాడ వైపు అనుమతిస్తున్నారు. ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు హనుమాన్ జంక్షన్ వద్ద ట్రాఫిక్ మళ్లింపు చేపట్టారు.
ప్రమాణ స్వీకారం చేయబోతోన్న చంద్రబాబుకు కార్యకర్తలు వినూత్న రీతిలో శుభాకాంక్షలు తెలపనున్నారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయబోతోన్న సందర్భంగా సుమారు 50 బోట్లతో కృష్ణానదిలో ర్యాలీ నిర్వహించనున్నారు. పడవలను మూడు పార్టీల జెండాలతో అలకరించి నదిలో కార్యకర్తలు తిరుగుతున్నారు. ప్రకాశం బ్యారేజ్ వద్దకు వెళ్లి చంద్రబాబుకు బోట్ల నుంచి ఆల్ ద బెస్ట్ చెప్పనున్నారు టీడీపీ అభిమానులు.
చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ,తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల నుంచి పెద్ద ఎత్తున అభిమానులు తరలివస్తున్నారు. గన్నవరం సమీపంలో హైవేపై కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. పాసులు ఉన్న వాహనాలను పోలీసులు అనుమతిస్తున్నారు.