PM Modi: ముచ్చటగా మూడోసారి ప్రధానిగా నరేంద్రమోడీ ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మోడీ చేత ప్రమాణ స్వీకారం చేయించారు. మోడీతో పాటు కేంద్రమంత్రులుగా 72 మంది ప్రమాణస్వీకారం చేయనున్నారు.
కేంద్రంలో నరేంద్ర మోదీ సారథ్యంలో మూడోసారి ఎన్డీఏ ప్రభుత్వం కొలువుదీరనుంది. ఈసారి మోదీ మంత్రివర్గంలో తెలుగు రాష్ట్రాల నుంచి ఐదుగురికి చోటు దక్కింది. వీరిలో మగ్గురు బీజేపీ నాయకులు కాగా.. మరో ఇద్దరు ఎన్డీఏ కూటమిలో కీలకంగా ఉన్న టీడీపీకి చెందినవారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. తాను ఈస్థాయికి వస్తానని అస్సలు ఊహించలేదని అన్నారు. తనపై నమ్మకం ఉంచి తనకు బాధ్యతలు అప్పగించిన మోదీకి, బీజేపీ నాయకత్వానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ అభివృద్ధిలో…
వానాకాలం వచ్చినా రైతుల పంట పెట్టుబడి సాయంపై ప్రభుత్వం నోరు మెదపడం లేదని బీఆర్ఎస్ నేత హరీశ్రావు అన్నారు. ఎన్నికలకు ముందు రూ.500 బోనస్ ఇస్తామని చెప్పి… ఇప్పుడు సన్నరకం వడ్లకే ఇస్తామని చెప్పడం సరికాదన్నారు. రైతులను దగా చేయవద్దని కోరారు. అన్ని రకాల వడ్లకు బోనస్ ఇవ్వాలని రానున్న అసెంబ్లీ సమావేశాల్లో నిలదీస్తామన్నారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం అక్కేనపల్లి గ్రామంలో ఆయిల్ పామ్ మొట్ట మొదటి క్రాప్ కటింగ్ కార్యక్రమంలో హరీశ్ రావు పాల్గొన్నారు.…
కేంద్ర కేబినెట్లో చోటు దక్కినందుకు హర్షం వ్యక్తం చేశారు శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు. కాసేపట్లో కేంద్ర మంత్రిగా ప్రమాణం చేయనున్న తరుణంలో ఆయన సోషల్ మీడియాలో తన సందేశాన్ని విడుదల చేశారు. ఈ ఆనందానికి కారణమైన శ్రీకాకుళం జిల్లా ప్రజలకు ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.
నరసాపురం ఎంపీ శ్రీనివాస వర్మ భావోద్వేగానికి గురయ్యారు. బీజేపీకి చెందిన నరసాపురం ఎంపీ భూపతిరాజు శ్రీనివాస్ వర్మను కేంద్ర మంత్రి పదవి దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన భావోద్వేగానికి గురై... సోము వీర్రాజు కాళ్లకు మొక్కి.. ఆలింగనం చేసుకున్నారు.
బీజీపీ అనుకున్న విధంగా ఫలితాలు ఏమి రాలేదని , బీజీపీ నాయకులు ఎగిరెగిరి పడడం మానుకోవాలన్నారు ఎమ్మెల్యే కడియం శ్రీహరి. స్టేషన్ ఘనాపూర్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ.. రామ మందిరం కట్టిన ఫైజాబాద్ లో బీజీపీ అభ్యర్థి గెలవడం రాముడికి కూడా ఇష్టం లేదన్నారు. ఒక్క చంద్రబాబు, ఒక్క నీతిష్ కుమార్ మారితే ప్రభుత్వమే గందరగోళంగా మారుతుందని, కాంగ్రెస్ పార్టీ ప్రజల గుండెల్లో పదిలంగా ఉందన్నారు కడియం శ్రీహరి.…
ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయకముందే అమరావతి పనులు చకాచకా జరిగిపోతున్నాయి. అమరావతిలో సీఆర్డీఏ అధికారులు కొన్ని పనులను ప్రారంభించారు. ముఖ్యంగా అమరావతిలోని ట్రంక్ రోడ్ల వెంబడి, నిర్మాణంలో ఉన్న భవన సముదాయాల ప్రాంతాల్లో పెరిగిన ముళ్ల కంపలను వెంటనే తొలగించాలని ఆదేశాలు రావటంతో ఈ పనులు ప్రారంభమయ్యాయి.
ముస్తాబౌతున్న చంద్రబాబు ప్రమాణ స్వీకార వేదిక కృష్ణాజిల్లా గన్నవరం మండలం కేసరపల్లి వద్ద చంద్రబాబు ప్రమాణ స్వీకార వేదిక సిద్ధమవుతోంది. సభా వేదిక పనులు దగ్గరుండి అధికారులు, టీడీపీ నాయకులు పరివేక్షిస్తున్నారు. ఈనెల 12వ తేదీ టీడీపీ అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సభా వేదిక నిర్మాణం వద్ద టీడీపీ నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసులు ప్రత్యేక దళాలతో భారీ బందోబస్తు చేసేలా ప్రణాళిక ఏర్పాటు చేశారు. ఏర్పాట్లను సీఎస్…
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్కుమార్కు కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కింది. ఈ వార్తల నేపథ్యంలో ఆయన కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తూ బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదివారం నాడు తన మండలి సభ్యులతో కలిసి వరుసగా మూడోసారి ప్రమాణం చేయనున్నారు. కుమార్ కరీంనగర్ నివాసంలో ఆయన భార్య అపర్ణ విలేకరులతో మాట్లాడుతూ, ఇది తమ జీవితంలో అత్యుత్తమ క్షణం అని అన్నారు. “మేమంతా చాలా…