AP News: ఆంధ్రప్రదేశ్ గవర్నర్ సెక్రటరీగా హరి జవహర్ లాల్ నియామకం అయ్యారు. ఆర్టీసీ ఎండీగా డీజీపీ ద్వారకా తిరుమల రావుకు అదనపు బాధ్యతలు అప్పగించారు. ఆర్టీసీ ఎండీగా ఉన్న ద్వారకా తిరుమలరావుకు సర్కారు డీజీపీ పదవి అప్పగించింది. సీనియార్టీకి పట్టం కట్టిన ప్రభుత్వం ద్వారకా తిరుమలరావుకు, డీజీపీగా పోస్టింగ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆర్టీసీ ఎండీగా ద్వారకా తిరుమలరావు అదనపు బాధ్యతలు చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ఉత్తర్వులు ఇచ్చారు. 1989 బ్యాచ్ ఐపీఎస్ అధికారైన ద్వారకా తిరుమలరావు ప్రస్తుతం రాష్ట్ర క్యాడర్ ఐపీఎస్‌ల సీనియారిటీ జాబితాలో అందరికంటే ముందున్నారు.
Read Also: Rain Alert: రేపు ఏపీలోని ఈ జిల్లాల్లో తేలికపాటి వర్షాలు
దేవదాయ శాఖ స్పెషల్ సీఎస్‌గా సత్యనారాయణ నియామకమయ్యారు. దేవదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణకు స్పెషల్ సీఎస్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు. దేవదాయ శాఖ స్పెషల్ సీఎస్ కరికాల వలవన్ రాజీనామాకు ఆమోదం లభించిన సంగతి తెలిసిందే. రిటైరైన తర్వాత కూడా కరికాల వలవన్ సర్వీసును కొనసాగిస్తూ గత ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త ప్రభుత్వం ఆదేశాల మేరకు కొన్ని రోజుల కిందట కరికాల వలవన్ రాజీనామా చేశారు.