గురుకుల ఉపాధ్యాయ పోస్టుల అభ్యర్థులు చేస్తున్న నిరసనకు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే టీ హరీష్ రావు మద్దతు తెలిపారు. అభ్యర్థుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) తరపున డిమాండ్ చేశారు. “ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల కోసం అని చెప్పుకుంటున్నప్పటికీ, గురుకుల ఉపాధ్యాయ పోస్టుల కోసం పోటీ పడుతున్న వారి పోరాటాల పట్ల ఉదాసీనంగా ఉండటం నిరుత్సాహకరం” అని ఆయన అన్నారు. అభ్యర్థులు పలుమార్లు మంత్రులు, అధికారులకు విన్నవించినా, ముఖ్యమంత్రి నివాసం…
చైనా మరో ఘనత.. భూమి మీదకు జాబిల్లి ఆవలి వైపు నమూనాలు చంద్రమండల యాత్రల్లో చైనా మరో ఘనత సాధించింది. ప్రపంచ చరిత్రలో తొలిసారి జాబిల్లికి ఆవలి వైపు నమూనాలు సేకరించి.. వాటిని విజయవంతంగా భూమి మీదకు తీసుకొచ్చింది. చంద్రుడి రెండో వైపు నుంచి మట్టి, శిథిలాలను మోసుకుని చాంగే-6 వ్యోమనౌక భూమిని చేరుకుంది. ఉత్తర చైనాలోని ఇన్నర్ మంగోలియా ప్రాంతాల్లో ఇది సురక్షితంగా ల్యాండ్ అయింది. మే 3వ తేదీన చాంగే-6 నింగికెగిరి దాదాపు 53…
మంత్రి బాల వీరాంజనేయ స్వామి బాధ్యతలు స్వీకరించారు. వేద మంత్రోచ్ఛారణల మధ్య ఛాంబర్లోకి అడుగు పెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తన మీద చంద్రబాబు ఉంచిన భాద్యతలను సమర్ధవంతంగా నిర్వహిస్తానని మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. తన శాఖ ద్వారా పేదలకు మేలు జరిగే అవకాశం ఎక్కువగా ఉందని అన్నారు. 2014-19 కాలంలో కొన్ని గురుకుల పాఠశాలల్లో అదనపు సీట్లు ఇచ్చామని.. గత ప్రభుత్వంలో జగన్ ఈ సీట్లను రద్దు చేశారని తెలిపారు.…
ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా జితేందర్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా జితేందర్ రెడ్డి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యావాదాలు తెలిపారు. నన్ను నమ్మి కాంగ్రెస్ లోకి ఆహ్వానించారని, ఢిల్లీలో ప్రత్యేక ప్రతినిధిగా అవకాశం కల్పించారు, కేబినెట్ ర్యాంక్ ఇచ్చారన్నారు. ఎన్నో పోరాటాలు చేసి, రాష్ట్రాన్ని సాధించుకున్నామని, విభజన చట్టంలో పెట్టిన అంశా పై కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్నారు జితేందర్ రెడ్డి. కృష్ణా నుంచి రావలసిన నీటి వాటా కూడా రాలేదని,…
విభజన చట్టంలో మిగిలి పోయిన సమస్యలు సాధించాలన్నారు మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గత ఐదేళ్లలో రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రాలేదని, ఛార్జ్ తీసుకున్న మూడో రోజే నేను తెలంగాణా భవన్ ను పరిశీలించానన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. ఢిల్లి లోనిఆంధ్ర భవన్ విభజన పై స్పష్టత వచ్చిందని, హైదారాబాద్ హౌజ్ పక్కన తెలంగాణ భవన్ నిర్మాణం జరగనుందన్నారు. ఇప్పటికే కొన్ని మోడల్స్ పరిశీలిస్తున్నామని, త్వరలోనే…
ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న మంత్రివర్గ విస్తరణ తదితర అంశాలపై కాంగ్రెస్ హైకమాండ్ బుధవారం ఢిల్లీలో కీలక సమావేశం నిర్వహించే అవకాశం ఉంది. ఇప్పటికే ముఖ్యమంత్రి ఎ రేవంత్‌రెడ్డితో పాటు పలువురు మంత్రులు ఢిల్లీలో ఉండగా , ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, నీటిపారుదల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కూడా మంగళవారం ఢిల్లీకి వెళ్లారు. తన రాజకీయ ప్రత్యర్థి, జగిత్యాల ఎమ్మెల్యే ఎం. సంజయ్‌కుమార్‌ను పార్టీలోకి చేర్చుకోవాలన్న రేవంత్‌రెడ్డి నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేసిన…
తెలంగాణ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ (టిజెయుడిఎ) లోని అన్ని యూనిట్లు బుధవారం తమ నిరసనలను తాత్కాలికంగా విరమించుకోగా, ఉస్మానియా జనరల్ హాస్పిటల్ (ఓజిహెచ్) మెడికోలు ఔట్ పేషెంట్, ఎలక్టివ్ సర్జరీలు , ఇన్‌పేషెంట్ వార్డు సేవలను బహిష్కరించాలని నిర్ణయించారు. ప్రస్తుతం ఉన్న ఆసుపత్రి క్యాంపస్‌లోనే కొత్త OGH భవనాన్ని నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం గట్టి ప్రణాళికతో వచ్చే వరకు సమ్మెను కొనసాగించాలని OGH యొక్క TJUDA యూనిట్ నిర్ణయించింది. TJUDA సమ్మె నోటీసులోని కీలకమైన డిమాండ్లలో కొత్త…
నేడు తెలంగాణలో పాఠశాలల బంద్‌కు ఏబీవీపీ పిలునిచ్చింది. ప్రైవేటు స్కూల్స్‌లో ఫీజుల నియంత్రణలో ప్రభుత్వం విఫలమైందని ఏబీవీపీ ఆరోపించింది. ఈ నేపథ్యంలోనే పాఠశాలల బంద్‌కు పిలుపునిస్తూ.. అందుకే హైదరాబాద్‌లోని అన్ని పాఠశాలలు మూసివేయనున్నారు. బుధవారం పని చేయని రోజు అని పేర్కొంటూ హైదరాబాద్‌లోని పాఠశాలలు వాట్సాప్ సందేశాల ద్వారా తల్లిదండ్రులకు సెలవు నోటీసులు పంపాయి. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలని, డీఈవో, ఎంఈవో పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ ప్రైవేటు పాఠశాలల ఫీజుల పెంపును…
వేణు స్వామి క్రేజ్ మాములుగాలేదు.. కన్నడ హీరోయిన్ తో పూజలు.. ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి గురించి తెలుగు రాష్ట్రాల ప్రజలకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. ఈయన సోషల్ మీడియలో ఫెమస్ స్టార్ అయ్యాడు.. సెలెబ్రేటీల జాతకాలు ఇవే అంటూ చెబుతూ ట్రెండ్ అవుతున్నాడు. ఇప్పటివరకు ఆయనతో చాలా మంది హీరోయిన్లు పూజలు చేయించుకున్నారు. తెలుగు హీరోయిన్లు పూజలు చేయించుకున్న సంగతి తెలిసిందే.. కానీ ఇప్పుడు ఆయన ఖాతాలో మరో హీరోయిన్ వచ్చి చేరింది.. ఆమె ఎవరో…