తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. సర్వదర్శనానికి భక్తులు 16 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. మరోవైపు.. టోకెన్ లేని భక్తుల సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతుంది. అలాగే నిన్న (సోమవారం) అర్ధరాత్రి వరకు 71,824 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. 28,462 మంది భక్తులు స్వామి వారికి తలనీలాలు సమర్పించారు. స్వామి వారి హుండి ఆదాయం 4.01 కోట్లు వచ్చినట్లుగా అధికారులు తెలిపారు.
వైద్యుడు కనిపించే దేవుడు.. సేవా భావం కలిగినవారే ఈ వృత్తి లోకి వస్తారు. నిస్సహాయులకు.. నిరుపేదలకు నేరుగా సాయం అందించే ఏకైక అవకాశం ఈ వృత్తిలోనే ఉంటుంది. ఈ వృత్తి మరే వృత్తికి సాటిరాదు. వైద్య శాఖకు ఉన్న ప్రాధాన్యతను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం.. ఏ సమస్య వచ్చినా అన్నిటినీ పక్కన పెట్టి ముందుగా స్పందిస్తోంది. గత ప్రభుత్వం పదేళ్ల పాలనలో వందేళ్ళ ఆర్థిక విధ్వంసాన్ని సృష్టించింది. వాటన్నిటిని ఒక్కొక్కటిగా అధిగమిస్తూ ముందుకు వెళుతుంది. ఈ క్రమంలోనే…
తెలంగాణలో నేటి నుంచి వ్యవసాయ భూముల సర్వే చేపట్టనున్నారు. రైతు భరోసా అమలు కోసం భూసర్వే చేపట్టనున్న అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వెల్లడించింది. తెలంగాణ వ్యాప్తంగా సాగు భూమి, సాగులో లేని భూముల సర్వే నిర్వహించనున్నారు. ఏ పథకమైనా అర్హులకు మాత్రమే అందాలి. అప్పుడే కదా.. టాక్స్ పేయర్స్ మనీకి విలువ ఉంటుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతు బంధు పథకం నిధులు పక్కదారి పట్టాయి అంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. రైతు భరోసా పథకాన్ని మాత్రం.. అలా…
ముఖ్యమంత్రి చంద్రబాబు రెండో రోజు కుప్పంలో పర్యటించనున్నారు. రెండో రోజు షెడ్యూల్లో భాగంగా.. కుప్పం ఆర్ అండ్ బి అతిధి గృహము నందు ఉదయం10.30 గంటలకు ప్రజల నుండి వినతులు స్వీకరించనున్నారు. అనంతరం.. మధ్యాహ్నం 12 గంటలకు కుప్పం పీఈఎస్ మెడికల్ కళాశాల సమీపంలో ఉన్న ప్రభుత్వ డిగ్రీ కళాశాల యందు కుప్పం నియోజకవర్గ అధికారులతో సమీక్షా నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 2.40 గంటలకు పీఈఎస్ మెడికల్ కాలేజీ ఆడిటోరియం నందు పార్టీ శ్రేణులతో సమావేశం చేపట్టనున్నారు. ఆ…
తెలంగాణలో నేటి నుంచి వ్యవసాయ భూముల సర్వే. రైతు భరోసా అమలు కోసం భూసర్వే చేపట్టనున్న అగ్రికల్చర్ డిపార్ట్మెంట్. తెలంగణ వ్యాప్తంగా సాగు భూమి, సాగులో లేని భూముల సర్వే. నేడు నాంపల్లి కోర్టులో తిరుపతన్న, భుజంగరావు బెయిల్ పిటషన్లపై విచారణ. ఫోన్ ట్యాపింగ్ కేసులో బెయిల్ కోరుతూ తిరుపతన్న, భుజంగరావు పిటిషన్స్. నేడు తెలుగు రాష్ట్రాల్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.72,220 లుగా ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం…
తన మరదలు పై కన్నేసాడని తన మిత్రులతో కలిసి యువకుడిని అతి దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన సికింద్రాబాద్ బేగంపేటలోని పాటిగడ్డలో అర్ధరాత్రి చోటు చేసుకుంది. పాటిగడ్డకు చెందిన ఉస్మాన్ అనే యువకుడు స్థానిక యువతిని ప్రేమిస్తున్నాడు. ఈ విషయం తెలుసుకున్న యువతి బావ అజజ్.. తన మరో ముగ్గురు మిత్రులతో కలిసి పాటిగడ్డలో ఉంటున్న అతని దగ్గరికి వెళ్లి రాత్రి సమయంలో యువకుడిని అడ్డగించారు. ఆ తర్వాత.. నలుగురు యువకులు కలిసి ఉస్మాన్ పై…
పానీపూరి అంటే ముఖ్యంగా చిన్న పిల్లలకు చాలా ఇష్టం. దానిని లొట్టలేసుకుని తింటుంటారు. అంతేకాకుండా.. సరిపోకుంటే ఇంటికి పార్శిల్ తెచ్చుకుని మరీ తింటారు. అయితే.. ఇప్పుడు పిల్లల నుంచి పెద్దల వరకు పానీపూరీని తింటున్నారు. గల్లీలో ఇటు చివర.. అటు చివర దర్శనమిస్తాయి. అయితే.. అదే పానీపూరి ఓ అత్త కోడలు మధ్య గొడవకు కారణమైంది. అసలు విషయానికొస్తే.. పానీపూరీలు తీసుకొచ్చిన భర్త తన కంటే ముందే తల్లికి పెట్టాడని భార్యకు కోపం వచ్చింది. దీంతో.. రాత్రంతా…
హైదరాబాద్లో మరోసారి ఈడీ దాడులు కలకలం రేపుతున్నాయి. ఆపరేషన్ మొబిలైజేషన్-OM చారిటీ గ్రూప్పై 11 చోట్ల ఈడీ సోదాలు చేసింది. విదేశాల నుంచి విరాళాలు తీసుకుని దుర్వినియోగం చేసినట్లు ఆరోపణలు రావడంతో ఈ సోదాలు చేపట్టింది. రూ.300 కోట్ల విరాళాలు సేకరించినట్లు ఆరోపణలు వచ్చాయని వారు తెలిపారు.
సీఎం రేవంత్ రెడ్డితో పాటు పలువురు మంత్రులు ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. ఢిల్లీకి వెళ్లిన వారిలో మంత్రి సీతక్క కూడా ఉన్నారు. ఈ క్రమంలో ఈరోజు కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ ని తెలంగాణ రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క కలిశారు. తెలంగాణలో గ్రామపంచాయతీ భవనాల నిర్మాణం కోసం నిధులు మంజూరు చేయాలని మంత్రి సీతక్క కోరారు.
కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి మండిపడ్డారు. తెలంగాణ భవన్ లో ఆయన మాట్లాడుతూ.. తమ పార్టీ ఎమ్మేల్యేలు పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఎం. సంజయ్ కుమార్ బీఆర్ఎస్ బీఫాం పై గెలిచి కాంగ్రెస్ లో చేరారని తెలిపారు. వారి సభ్యత్వం రద్దు కావాల్సి ఉందని.. వారిపై పిటిషన్ ఇవ్వాలని స్పీకర్ ను సమయం కోరామని జగదీష్ రెడ్డి తెలిపారు. ఈరోజు లేదా రేపు సమయమిస్తానని స్పీకర్ చెప్పారన్నారు. గతంలో పార్టీ మారిన ముగ్గురు…